శిల్పం: కూర్పుల మధ్య తేడాలు

వాస్తు శిల్ప శాస్త్రములు
పంక్తి 12:
ఈ ప్రతిమలను మూడు బింబాలుగా విభజిస్తారు. పూర్ణబింబం, అర్ధబింబం మరియు అభాసబింబం అభాస బింబం. పూర్ణ బింబం అంటే ముందు వెనుక కచ్చితమైన ప్రంఆణంతో చెక్క బడినవి ఇవి అన్నిటికంటే మైనవి. వీటిని పూజిస్తే ఉత్తమ ఫలితాలనందిస్తాయని విశ్వాసం. అర్ధ బింబాలంటే ముందు వైపు చెక్కబడి వెనుక వైపు చదరంగా ఉండేవి వీటిని పూజిస్తే ఫలితం మధ్యమ ఫలితం లభిస్తుందని విశ్వాసం. అభాస బింబాలంటే చిత్రంగా చెక్క బడినవి, చిత్రాలు వీటిని వీటిని పూజిస్తే సంతృప్తికరమైన ఫలితం ఉండదని విశ్వాసం.<br />
ఆలయంలోగర్భ గృహంలో ఉండే విగ్రహాన్ని మూల విగ్రహం అంటారు. వీటిని మూల బింబం మరియు మూలవిగహం అంటారు. ఇలాంటి విగ్రహాలను స్థపతి శాస్త్రీయంగా సమగ్రహంగా పరిశీలించి ఎన్నిక చేస్తాడు.
 
== వాస్తు శిల్ప శాస్త్రములు ==
భారతీయ వాస్తుశిల్పము కళగా పరిగనింపబడినది. కళ అనగా అంశము. <nowiki>'''క''' కారము బ్రహ్మ వాచక మగుటవలన సృష్టిని, '''ల'''</nowiki> కారము లయమును సూచించుచున్నందున కళకూడా సృష్టి, స్థితి, లయ రూపమైనది.[[64 కళలు]] లో 38 వ కళ <nowiki>'''</nowiki>వాస్తువిద్యా<nowiki>'''</nowiki>. అనంతాంధకార కాల గర్భమున దాగియున్న ప్రాచీన వాస్తువిజ్ఞానమును దర్శించుటకు జ్ఞానజ్యోతిలవలె అపౌరుషమైన వైదిక సాహిత్యము, పురాణము అగు శిల్పశాస్త్రములు ఇంకనూ మిగిలిఉన్నవి. అందువలన నేటికిని నష్టావిశిష్టములైన ప్రాచీన నిర్మాణములు మన కళావిశిష్టత నెలుగెత్తి చాటుచున్నవి.భారతీయ వాస్తు విజ్ఞానము ముత్కృష్ణమైనది; ఉదాత్తమైనది. మన ఆధ్యాత్మిక వికాసమున కనుగుణముగా ఆయాప్రయోజనములతో కూడిన ఆరాధనలు, ఉపాసనలు, వానికి తగిన దేవతలు, దేవాగారములు వెలసినవి. ప్రపంచ వాజ్మయమున ప్రాచీనమగు [[చతుర్వేదాలు]] [[ఉపనిషత్తు]] లయందు దేవమూర్తులు, దేవాగారములు, పూజలు ప్రస్తావించబడినవి.వేదకాలమునందు జనులు గూహలలో కాక సుందరహర్మయములలో నివసించినారు అని [[అథర్వణ వేదం]] చెప్పుచున్నది.వేదములలో రాజులకు ప్రాపదములను, రాజోద్యోగులకు శాలా హర్మ్యములు ఉండినట్లు తెలియుచున్నది. [[తైత్తిరీయోపనిషత్తు]] బ్రాహ్మణమున ఒక బ్రాహ్మణ గృహ వర్ణన కలదు. అగ్నిశాలలు, శ్మశానవాటికల నిర్మాణములు, శిలా ఫలకములపై గీయబడిన చిత్తరువుల, విగ్రహముల ప్రస్తావన తెలుపబడినది. అప్పటికే వాస్తు శిల్ప అభివృద్ధి జరుగుచుండెడను. [[ఋగ్వేదం]] న 1000 ద్వారములు గల ఒక రాజు ప్రస్తావించబడినాడు.7 మిత్రావరుణులు 100 స్తంభములు, 100 ద్వారములు గల భవనముల నాక్రామించుకిని ఉండిరి.
 
వేదవాజ్మయము తరువాతి కాలమున [[సింధు లోయ నాగరికత]] అను వ్యవహరించబడుచున్న [[మొహంజో-దారో]] [[హరప్పా]] త్రవ్వకాలలో బయల్వడిన ప్రాచీన నగరశిధిలములు, దేవప్రతిలు ఇవి భారతీయ వాస్తిశాస్త్రోత్కృష్ణకు ప్రబల నిదర్సనములై ఉన్నవి.శ్రీ వినోద విహారరాయ్ వేదరత్న అను వంగదేశీయ విద్వాంసుడు <nowiki>'''హరప్పా''' ఋగ్వేదమున ప్రస్తావించబడిన '''హరియప్రియ'''</nowiki> అన్య్ ఆర్యనగరమని అచటి అవశేషములను వేదమంత్రములతో సమంవయించి నిరూపించినారు.
 
కావ్యములకంటే పురాణ వాజ్మయమున వాస్తువిశేషములు చాలవివరించబడినవి. [[పురాణములు]] లో తొమ్మిది పురాణములు వాస్తులక్షణములను శాస్త్రీయముగా దెపిలి తరువాత వచ్చిన శిల్పశాస్త్రములకు తగిన సామగ్రి నందించినవి. [[మత్స్య పురాణము]] న 252, 255,256 258,262, 253,269,270 అధ్యాయములలోను, [[గరుడ పురాణం]] నందలి 45,46,47, 48 అధ్యాయములలోను, [[స్కాంద పురాణము]] న మహేశ్వరఖండలో 24 వ అధ్యాయము, [[వైష్ణవఖండ]] లో 25వ అధ్యాయములోను, [[నారద పురాణము]] న 13 వ అధ్యాయమునను, [[బ్రహ్మాండ పురాణము]] న 7వ అధ్యాయమునను, [[భవిష్య పురాణం]] న 12,130,131,132 వ అధ్యాయములలో, [[వాయు పురాణము]] న 39 వ అధ్యాయమున , [[అగ్ని పురాణము]] న 42 నుండి 60, 104, 105 వ అధ్యాయములలో వాస్తు శిల్ప విషయములు ప్రస్తావించబడినవి.
 
సుప్రసిద్ధ [[వరాహమిహిరుడు]] విశ్వకోశమందగిన [[బృహత్సంహిత]] లో 53 (వాస్తువిద్యా), 56 (ప్రాసాదలక్షణం), 57 (వజ్రలేప లక్షణం), 58 (ప్రతిమా లక్షణము) అధ్యాయములను ప్రస్తావించినాడు.
 
పురాణములు ప్రాస్తావికముగ మాత్రమే శిల్ప శాస్త్రమును తడవినవి. శిల్పశాస్త్రమునకు [[ఆగమము]] లు ఆధారములు.ఇందు శాస్త్రీయ చర్చ కలదు. ఆగములలో ప్రధాన లక్షణములైన భూపరీక్షా, స్థలపరీక్షా, దిక్సాధన, స్థలపధక, హర్మ్య, ప్రాసాద నిర్మాణపద్ధతులు సప్రమాణముగా నిరూపించబదినవి.ఆగములు వేదతుల్యములు. ఇవి శివోపాసన కుద్దేశించబడినవి. ఇవి మొత్తం 28 అని అంగీకరించబడినవి. వీటిలో ప్రత్యేకముగా గ్రామ, నగర, దేవతా నిర్మాణములకు అవసరమైన వాస్తు లక్షణములు వివరించబడినవి.
 
ఇవికాక ప్రత్యేక వాస్తుశిల్ప శాస్త్రములు కలవు. వీనిలో చాల మట్టుకు వ్రాతప్రతులలో ఉన్నవి. వీటిని తెలిసినవారు అత్యల్ప సంఖ్యలో కలరు. అనేక గ్రంధములు విదేశీయ గ్రంధాలయములలో భద్రపరచి ఉన్నవి. వీటిలో కొన్ని గ్రంధముల పేర్లు: <nowiki>'''</nowiki>మానసారము, వాస్తు విద్యా, శిల్పరత్న, అభిలషితార్ధచింతామణి, సమరాంగణ సూత్రధార, వాస్తురత్నావలీ, ప్రతిమాలక్షణ, ప్రతిమా మాన లక్షణ, రూపమండన, వాస్తుమండన, చిత్రసారము <nowiki>''</nowiki>. ఇంకా 150 వరకు గ్రంధములు కలవి అను అభిప్రాయము.
 
వీటిలో <nowiki>'''మానసారము''' సమగ్ర లక్షణములు తెలుపుచూ దేవాలయ గ్రామ నిర్మాణాదికమును వివరించు ఉత్తమ శిల్పశాస్త్రము.ఇందు 70 అధ్యాయములు కలవు.దీనిని పరమ ప్రమాణ గ్రంధముగా భావింతురు.దీనిని రచించనవారు '''మానసారఋషి'''</nowiki> క్రీ,పూ.3 వ శతాబ్దమువాడని అంగీకరించినారు.
 
<nowiki>'''చిత్రసారము'''</nowiki> నందలి శిల్పతంత్ర ప్రకరణములో శిల్పశాస్త్ర ద్వాదశ లక్ష గ్రంధాత్మకమని తెలుపబడినది. ఈ 12 లక్షల గ్రంధములను పలువు మహర్షులు విరచించిరి.
 
ఇంచిమించుగా అన్ని దేవాలయములను మహాశిల్పులు కట్టిరో తెలియుటలేదు. కానీ కొన్నియందు ఉదాహరణకు [[హోయసాల]] దేవాలయములలో మాత్రము శిల్పుల పేర్లు కానవచ్చుచున్నది. ఉండవల్లి, బాదామి, అలంపురము మొదలైన క్షేత్రములలో ఆలయమును కట్టిన శిల్పుల పేర్లు మారుపేర్లతొ వ్యవహరించబడినారు. ఇంకా బౌద్ధ, జైన, బ్రాహ్మణ మతములకు సంబంధిచిన ఆలయములు శిల్పకళాదృష్టితో నిర్మించినను నిర్మాతలెవ్వరో నేటికీ ఆజ్ఞాతమే.
 
భారతీయ శిల్పులలో 4 తెగలు కలవు.వీరు బ్రహ్మ సంతతి అని చెప్పుదురు. [[మహా భారతము]] న పేర్కొనబడిన దేవశిల్పి విశ్వకర్మ ఈతెగలకు మూలపురుషుడు అని చెప్పెదరు. <nowiki>'''</nowiki>మానసారము<nowiki>'''</nowiki> దీనిని గూర్చి ఈ విధముగా తెలుపు చున్నది: పరబ్రహ్మకు పద్మసంభువుడు పుట్టెను. ఆ సృష్టి కర్తకు 4 ముఖములునుండు విశ్వకర్మమయ, త్వష్ట, మనువు లుద్భవించిరి. వారికే విశ్వకర్మ, విశ్వభూ, విశ్వస్తి, విశ్వప్రష్టలను పేర్లు కలవు. విశ్వకర్మ (పూర్వ ముఖోద్భవుడు) ఇంద్రపుత్రికయగు బ్రహ్మసత్వను పెండ్లియాడెను. మయుడు ( దక్షిన ముఖోద్భవుడు) రాక్షసపుత్రి క్షత్రియసత్వను పెండ్లియాడెను. త్వష్ట ( పశ్చిమ ముఖోద్భవుడు) కుబేరపుత్రి వైశ్యసత్వను పెండ్లియాడెను. మనువు ( ఉత్తర ముఖోద్భవుడు) నలపుత్రి కూద్రసత్వ పెండ్లియాడెను. ఈ నలుగురు దంపతులకు వరుసగా స్థపతి, సూత్రగ్రాహి, నర్ధకి, తక్షకులను పుత్రులు కలిగిరి. వీరిలో స్థపతి సకలశాస్త్రపారంగతుడైన ప్రధాన పర్యవేక్షకుడు (Chief Architect), వేదవిదుడు; నిర్మాన పధకములను నిర్ణయించువాడు. సూత్రగ్రాహికుడు పధక నిర్మాణ దీక్షితుడు (Draftsman); నర్ధకి చిత్రకళా నిపుణుడు; తక్షకుడు వడ్రంగి నిపుణుడు, రాయి, కర్ర, రాగి, బంగార, లోహముల పని చేయుటలో నిపుణుడు. ఈ నాలుగు తెగల శిల్పుల చేతనే, భారతీయ వాస్తుశిల్ప ప్రచారము, గృహ, దేవయాతన, దుర్గ, నగర, వాసీ కూప తటాకాదుల నిర్మాణము కొనసాగినది.
 
===శిల్పకళాశోభితమైన స్తంభాలు===
వివిధ దేవాలయాలలో స్తంబాలపై వివిధ దేవతా మూర్తులు మరియు యితర కళాకృతులను చెక్కి ఆలయానికి అపురూప శోభకు కల్పిస్తారు.
"https://te.wikipedia.org/wiki/శిల్పం" నుండి వెలికితీశారు