"మహాశివరాత్రి" కూర్పుల మధ్య తేడాలు

95 bytes removed ,  3 సంవత్సరాల క్రితం
చి
చి
 
==ప్రాశస్త్యం==
[[మహా శివరాత్రి]] చాంద్రమాన నెల లెక్కింపు ప్రకారం మాఘమాసం యొక్క కృష్ణ పక్ష [[చతుర్దశి]] రోజున వస్తుంది. [[హిందువు]]ల పండుగలలో '''మహాశివరాత్రి''' ప్రశస్తమైనది. ప్రతీ ఏటా [[మాఘ బహుళ చతుర్దశి]] నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన [[ఆరుద్ర]] యుక్తుడైనప్పుడు వస్తుంది. [[శివుడు]] ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని [[శివపురాణం]]లో ఉంది. చాంద్రమాన నెల లెక్క ప్రకారం, ఈ రోజు గ్రెగేరియన్ క్యాలెండర్లో [[ఫిబ్రవరి]] లేదా [[మార్చి]] నెలలో వస్తుంది. [[హిందూ మతము|హిందువు]]ల క్యాలెండర్ నెలలో [[ఫాల్గుణమాసము|ఫాల్గుణ మాసము]] యొక్క కృష్ణ పక్ష [[చతుర్దశి]]. సంవత్సరంలో పన్నెండు శివరాత్రులలో మహా శివరాత్రి అత్యంత పవిత్రమైనదిగా భావింపబడుతుంది.<ref>{{cite web|last=ShivShankar.in|title=Maha Shivaratri|url=http://www.shivshankar.in/maha-shivaratri/|work=Maha Shivaratri|publisher=ShivShankar.in}}</ref>
 
==బిల్వార్చన==
[[నేపాల్]] లో, కోట్లాది హిందువుల ప్రఖ్యాత [[పశుపతినాథ్]] ఆలయం వద్ద ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి కలిసి శివరాత్రికి హాజరు అవుతారు. వేలాది భక్తులు కూడా ప్రముఖ నేపాల్ శివ [[శక్తిపీఠాలు|శక్తి పీఠము]] వద్ద మహాశివరాత్రికి హాజరు అయి జరుపుకుంటారు.
ట్రినిడాడ్ మరియు టొబాగోలో,దేశవ్యాప్తంగా వేలాది [[హిందువులు]] 400 పైగా ఆలయాల్లో పవిత్రమైన మహాశివరాత్రి రోజు రాత్రి శివుడికి ప్రత్యేక అభిషేకాలు అందించటం ద్వారా గడుపుతారు.<ref>{{cite web|title=Grand Shivratri Carnival celebrated in Trinidad and Tobago|url=http://news.biharprabha.com/2014/03/grand-shivratri-carnival-celebrated-in-trinidad-and-tobago/|work=IANS|publisher=news.biharprabha.com|accessdate=1 March 2014}}</ref>
మహాశివరాత్రి రోజు [[పశుపతినాథ్]] దేవాలయం నేతి దీపపు కుందులతో కన్నులపండుగా ఉంటుంది. వేలాది భక్తులు [[శివరాత్రి]] రోజు బాగమతి నదిలో [[స్నానము]] చేసి, శివరాత్రి పండుగ జరుపుకొంటారు.
 
=== మహా శివరాత్రి బంగ్లాదేశ్ వేడుక ===
[[బంగ్లాదేశ్]]లో హిందువులు కూడా మహా శివరాత్రి జరుపుకుంటారు. వారు శివుని దివ్య వరం పొందడానికి ఆశతో ఉపోషం (ఫాస్ట్) ఉంటారు. అనేక బాంగ్లాదేశ్ హిందువులు ఈ ప్రత్యేక రోజు పాటించడానికి చంద్రనాధ్ ధామ్ (చిట్టగాంగ్) వెళ్తారు. బాంగ్లాదేశ్ లోని అందరు హిందువులు మహా శివరాత్రి రోజు చాలా ప్రముఖంగా జరుపుకుంటారు. ఈ రోజున ఉపోషం (ఫాస్ట్) మరియు పూజ నిర్వహించిన చేసిన యెడల ఒక మంచి భర్త / భార్యను పొందుతారు అని [[బాంగ్లాదేశ్]] హిందువులు ద్వారా చెప్పబడింది,
 
=== మధ్య (సెంట్రల్) భారతదేశంలో మహా శివరాత్రి ===
మధ్య (సెంట్రల్) భారతదేశం శివ అనుచరులు పెద్ద సంఖ్యలో ఉంది. [[మహాకాళేశ్వర్ దేవాలయం]], [[ఉజ్జయినీ]] పేరున స్వామి శివుడు వేంచేసిన పవిత్ర అత్యంత ప్రాచుర్యం పొందిన దేవాలయాల్లో ఒకటి. ఇక్కడికి శివ భక్తులు పెద్ద సమూహాములతో మహా శివరాత్రి రోజున ప్రార్థనలు చేయడానికి ప్రతి సంవత్సరం చేరుకుంటారు. [[జబల్పూర్]] నగరంలో [[తిల్వారా ఘాట్]] మరియు రెండు ఇతర ప్రదేశాలు అయిన [[జియోనార]] గ్రామంలో మఠం ఆలయం, [[సియోనీ]] పేరున, పండుగను చాలా మతపరమైన ఆనందంతో జరుపుకుంటారు.
 
===దక్షిణ భారతదేశంలో మహాశివరాత్రి ===
మహాశివ రాత్రి మహాత్మ్య వృత్తాంతం శివ పురాణములోని విద్యేశ్వర సంహితలో చెప్పబడింది.
 
గంగా యమునా సంగమ స్థానమైన [[ప్రయాగ]]లో (నేటి [[అలహాబాదు]]) ఋషులు సత్రయాగం చేస్తున్నసమయంలో [[రోమర్షణమహర్షి]] అని పేరు గాంచిన [[సూతమహర్షి]] అక్కడకు వస్తాడు. ఆలా వచ్చిన సూతమహర్షికి అ ఋషులు నమస్కరించి సర్వోత్తమమైన ఇతిహాస వృత్తాంతాన్ని చెప్పమనగా అతను తన గురువైన వేదవ్యాసుడు తనకు చెప్పిన గాథను వివరించడం ప్రారంభిస్తాడు. ఒకసారి పరాశర కుమారుడైన వ్యాస మహర్షి [[సరస్వతీసరస్వతి]] నదీ తీరమున ధ్యానం చేస్తుంటాడు. ఆ సమయంలో సూర్యుని వలె ప్రకాశించే విమానంలో సనత్కుమారుడు వెళ్ళుతుంటాడు. దానిని గమనించిన [[వ్యాసుడు]] [[బ్రహ్మ]] కుమారుడైన సనత్కుమారునకు నమస్కరించి ముక్తిని ప్రసాదించే గాథను తెలుపుమంటాడు.
 
అప్పుడు [[మందర పర్వతం]] మీద బ్రహ్మ కుమారుడైన సనత్ కుమారుడు తనకు, [[నందికేశ్వరుడు|నందికేశ్వరుని]]కినందికేశ్వరునికి మధ్య జరిగిన సంవాదాన్ని వ్యాసునికి చెప్పగా, వ్యాసుడు సూతునికి చెప్పిన వృత్తాంతాన్ని సత్రయాగంలో ఋషులకు చెబుతాడు. సనత్కుమారుడు నందికేశ్వరుడిని శివుని సాకారమైన మూర్తిగా, నిరాకారుడైన లింగంగా పూజించడానికి సంబంధించిన వృత్తాంతాన్ని చెప్పమంటాడు. దానికి సమాధానంగా నందికేశ్వరుడు ఈ వృత్తాంతాన్ని చెబుతాడు.
 
== బ్రహ్మ, విష్ణువుల యుద్ధం ==
[[దస్త్రం:NatarajaElectricLights.jpg|thumb|right|200px|విద్యుద్దీపపు కాంతుల్లో నటరాజ స్వరూపుడైన పరమశివుడు]]
ఒకప్పుడు ప్రళయ కాలం సంప్రాప్తము కాగా మహాత్ములగు [[బ్రహ్మ]], [[విష్ణువు]]లు ఒకరితో ఒకరు యుద్ధానికి దిగారు. ఆ సమయంలోనే [[మహాదేవుడు]] లింగరూపంగా ఆవిర్భవించాడు. దాని వివరాలు ఇలాఉన్నాయి. ఒకప్పుడు బ్రహ్మ అనుకోకుండా వైకుంఠానికి వెళ్ళి, శేష శయ్యపై నిద్రిస్తున్న విష్ణువును చూసి, "నీవెవరవు, నన్ను చూసి గర్వముతో శయ్యపై పడుకున్నావులే, నీ ప్రభువును వచ్చి ఉన్నాను నన్ను చూడు. ఆరాధనీయుడైన గురువు వచ్చినప్పుడు గర్వించిన మూఢుడికి ప్రాయశ్చిత్తం విధించబడుతుంది " అని అంటాడు. ఆ మాటలు విన్న [[విష్ణువు]] బ్రహ్మను ఆహ్వానించి, ఆసనం ఇచ్చి, "నీచూపులు ప్రసన్నంగా లేవేమి?" అంటాడు. దానికి సమాధానంగా బ్రహ్మ "నేను కాలముతో సమానమైన వేగం తో వచ్చాను. పితామహుడను. జగత్తును, నిన్ను కూడా రక్షించేవాడను" అంటాడు. అప్పుడు విష్ణువు బ్రహ్మతో "జగత్తు నాలో ఉంది. నీవు చోరుని వలె ఉన్నావు. నీవే నా నాభిలోని పద్మమునుండి జన్మించినావు. కావున నీవు నా పుత్రుడవు. నీవు వ్యర్థముగా [[మాట్లాడుతున్నావు]]" అంటాడు.
 
ఈ విధంగా బ్రహ్మ విష్ణువు ఒకరితోనొకరు సంవాదము లోనికి దిగి, చివరికి యుద్ధసన్నద్దులౌతారు. బ్రహ్మ [[హంస]] వాహనం పైన, విష్ణువు [[గరుడ వాహనం]] పైన ఉండి యుద్ధాన్ని ఆరంభిస్తారు. ఈ విధంగా వారివురు యుద్ధం చేస్తూ ఉండగా దేవతలు వారివారి విమానాలు అధిరోహించి వీక్షిస్తుంటారు. బ్రహ్మ, విష్ణువుల మధ్య యుద్ధం అత్యంత ఉత్కంఠతో జరుగుతూ ఉంటే వారు ఒకరి వక్షస్థలం పై మరొకరు అగ్నిహోత్ర సమానమైన బాణాలు సంధించుకొన సాగారు. ఇలా సమరం జరుగుతుండగా, విష్ణువు [[మాహేశ్వరాస్త్రం]], బ్రహ్మ [[పాశుపతాస్త్రం]] ఒకరిమీదకు ఒకరు సంధించుకొంటారు. ఆ అస్త్రాలను వారు సంధించిన వెంటనే సమస్త దేవతలకు భీతి కల్గుతుంది. ఏమీ చేయలేక, దేవతలందరు శివునికి నివాసమైన కైలాసానికి బయలు దేరుతారు. [[ప్రమథ గణాలు|ప్రమథగణాల]]కుప్రమథగణాలకు నాయకుడైన శివుని నివాసస్థలమైన కైలాసంలో మణులు పొదగబడిన సభా మద్య లొ ఉమాసహితుడై తేజస్సుతో విరాజిల్లుతున్న మహాదేవునికి పరిచారికలు శ్రద్ధతో వింజామరలు వీచుతుంటారు. ఈ విధంగా నున్న ఈశ్వరునికి దేవతలు ఆనందబాష్పాలతో శ్హస్త్రంగమ్ ప్రణమిల్లుతారు. అప్పుడు ప్రమథ గణాలచేత శివుడు దేవతలను దగ్గరకు రమ్మని అహ్వానిస్తాడు. అన్ని విషయాలు ఎరిగిన శివుడు దేవతలతో "బ్రహ్మ, విష్ణువుల యుద్ధము నాకు ముందుగానే తెలియును. మీ కలవరము గాంచిన నాకు మరల చెప్పినట్లైనది " అంటాడు. బ్రహ్మ, విష్ణువులకు ప్రభువైన శివుడు సభలో ఉన్న వంద ప్రమథ గణాలను యుద్ధానికి బయలుదేరమని చెప్పి, తాను అనేక వాద్యములతో అలంకారములతో కూడిన వాహనం పై రంగు రంగుల ధ్వజముతో, వింజామరతో, పుష్పవర్షముతో, సంగీతము నాట్యమాడే గుంపులతో, వాద్య సముహంతో, పార్వతీదేవితో బయలుదేరుతాడు. యుద్ధానికి వెళ్ళిన వెంటనే వాద్యాల ఘోషను ఆపి, రహస్యంగా యుద్ధాన్ని తిలకిస్తాడు.మాహేశ్వరాస్త్రం, పాశుపతాస్త్రం విధ్వంసాన్ని సృష్టించబోయే సమయంలో శివుడు అగ్ని స్తంభ రూపంలో ఆవిర్భవించి ఆ రెండు అస్త్రాలను తనలో ఐక్యం చేసుకొంటాడు. బ్రహ్మ, విష్ణువులు ఆశ్చర్య చకితులై ఆ స్తంభం యొక ఆది, అంతం కనుగొనడం కోసం వారివారి వాహనాలతో బయలు దేరుతారు. విష్ణువు అంతము కనుగొనుటకు వరాహరూపుడై, బ్రహ్మ ఆది తెలుసుకొనుటకు హంసరూపుడై బయలుదేరుతారు. ఎంతపోయినను అంతము తెలియకపోవడం వల్ల విష్ణుమూర్తి వెనుకకు తిరిగి బయలుదేరిన భాగానికి వస్తాడు. బ్రహ్మకు పైకి వెళ్ళే సమయంలో మార్గమధ్యంలో కామధేనువు క్రిందకు దిగుతూను, ఒక మొగలి పువ్వు (బ్రహ్మ, విష్ణువు ల సమరాన్ని చూస్తూ పరమేశ్వరుడు నవ్వినప్పుడు ఆయన జటాజూటం నుండి జారినదే ఆ మొగలి పువ్వు) క్రింద పడుతూనూ కనిపించాయి. ఆ రెంటిని చూసి బ్రహ్మ 'నేను ఆది చూశాను అని అసత్యము చెప్పండి. ఆపత్కాలమందు అసత్యము చెప్పడము ధర్మ సమ్మతమే" అని చెప్పి కామధేనువు తోను, మొగలి పువ్వుతోను ఒడంబడిక చేసుకొంటాడు. వాటితో ఒడంబడిక చేసుకొన్న తరువాత బ్రహ్మ తిరిగి స్వస్థానానికి వచ్చి, అక్కడ డస్సి ఉన్న విష్ణువు ని చూసి, తాను ఆదిని చూశానని, దానికి సాక్ష్యం కామధేనువు, మొగలి పువ్వు అని చెబుతాడు. అప్పుడు విష్ణువు ఆ మాటను నమ్మి బ్రహ్మ కి షోడశోపచారా లతో పూజ చేస్తాడు. కాని,శివుడు ఆ రెండింటిని వివరము అడుగగా, బ్రహ్మ స్తంభం ఆదిని చూడడం నిజమేనని మొగలి పువ్వు చెపుతుంది. కామధేనువు మాత్రం నిజమేనని తల ఊపి, నిజం కాదని తోకను అడ్డంగా ఊపింది. జరిగిన మోసాన్ని తెలుసుకున్న శివుడు కోపోద్రిక్తుడైనాడు.మోసము చేసిన బ్రహ్మ ను శిక్షించడంకోసం శివుడు అగ్ని లింగ స్వరూపం నుండి సాకారమైన శివుడి గా ప్రత్యక్షం అవుతాడు. అది చూసిన విష్ణువు, బ్రహ్మ సాకారుడైన శివునకు నమస్కరిస్తారు. శివుడు విష్ణువు సత్యవాక్యానికి సంతసించి ఇకనుండి తనతో సమానమైన పూజా కైంకర్యాలు విష్ణువు అందుకొంటాడని, విష్ణువు కి ప్రత్యేకంగా క్షేత్రాలు ఉంటాయని ఆశీర్వదిస్తాడు.
 
== బ్రహ్మకు శిక్ష మరియు వరము ==
 
== కామధేనువుకు శాపము ==
అసత్యాన్ని చెప్పిన [[కామధేనువు]]ను కూడా శివుడు శిక్షించదలచాడు. అసత్యమాడినందుకు పూజలు ఉండవని శివుడు కామధేనువుకు శాపమిచ్చాడు. [[తోక]]తో నిజం చెప్పాను కనుక క్షమించుమని [[కామధేనువు]] శివుని ప్రాధేయపడింది. భోలాశంకరుడు కనుక, కోపమును దిగమ్రింగి, " మొగము తో అసత్యమాడితివి కనుక నీ మొగము పూజనీయము కాదు; కాని సత్యమాడిన నీ పృష్ఠ భాగము పునీతమై, పూజలనందుకొనును" అని శివుడు వాక్రుచ్చెను. అప్పటి నుండి గోముఖము పూజార్హము కాని దైనది; గోమూత్రము, గోమయము, గోక్షీరములు పునీతములైనవై, పూజా, పురస్కారములలో వాడబడుచున్నవి.
 
== మహాశివరాత్రి వ్రత కథ ==
ఆ తరువాత బ్రహ్మ, విష్ణువు ఆదిగా గల దేవతలు శివుడిని ధూపదీపాలతో అర్చించారు. దీనికి మెచ్చి శివుడు అక్కడి వారితో "మీరీనాడు చేసిన పూజకు సంతసించితిని. ఈ రోజు నుండి నేను అవతరించిన ఈ తిథి [[శివరాత్రి]] పర్వదినముగా ప్రసిద్ధి చెందుతుంది.
 
ఈ రోజున ఉపవాసము చేసి భక్తితో నన్ను లింగ రూపముగా, సాకార రూపముగా ఎవరు అర్చిస్తారో వారికి మహాఫలము కలుగుతుంది" అని చెబుతాడు. తాను ఈ విధంగా [[అగ్నిలింగరూపము]]గాఅగ్నిలింగరూపముగా ఆవిర్భవించిన ప్రదేశము [[అరుణాచలము]]గాఅరుణాచలముగా ప్రసిద్ధిచెంద గలదని చెబుతాడు.
 
=== జాగరణము ===
 
=== రుద్రాభిషేకం ===
వేదాలలోనుండి ప్రత్యేకమైన మంత్రాలను [[రుద్ర సూక్తం]]గాసూక్తంగా పండితులచే పఠించబడుతుంది. దీనిని శివలింగానికి ప్రాతఃకాలంలో పవిత్రస్నానం చేయిస్తారు. దీనినే [[రుద్రాభిషేకం]] అంటారు. శివలింగంతో[[శివలింగం]]<nowiki/>తో బాటు గండకీ నదిలో మాత్రమే లభించే సాలిగ్రామం కూడా పూజలందుకుంటుంది. దీనిద్వారా మనసులోని మలినాల్ని తొలగించుకోవడమే ఇందులోని పరమార్ధం.
 
=== పంచాక్షరి మంత్రం ===
[[పంచాక్షరి]] మంత్రం శివస్తోత్రాలలో అత్యుత్తమమైనది. ఈ మంత్రంలోని పంచ అనగా [[అయిదు]] అక్షరాలు "న" "మ" "శి" "వా" "య" (ఓం నమశ్శివాయ) నిరంతరం భక్తితో ఈనాడు పఠిస్తే శివసాయుజ్యం ప్రాప్తిస్తుంది.
 
=== మహామృత్యుంజయ మంత్రం ===
1,88,412

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2115887" నుండి వెలికితీశారు