వై.యస్. రాజశేఖరరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
'''యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి''' ([[జూలై 8]], [[1949]] - [[సెప్టెంబర్ 2]], [[2009]]) [[ఆంధ్ర ప్రదేశ్]] 16వ ముఖ్యమంత్రి, [[కాంగ్రేసు పార్టీ]] నాయకుడు.
 
[[1978]]లో తొలిసారిగా [[పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం]]నుంచి శాసనసభలో అడుగుపెట్టిన రాజశేఖరరెడ్డి మొత్తం 6 సార్లు [[పులివెందుల]] నుంచి ఎన్నికకాగా, 4 సార్లు [[కడప లోక్‌సభ నియోజకవర్గం]] నుంచి [[పార్లమెంటు]]లో అడుగుపెట్టాడు. ఆయన పోటీచేసిన ప్రతి ఎన్నికలలోనూ విజయం సాధించారు . జనతాపార్టీ ప్రభంజనాన్ని తట్టుకొని విజయం సాధించిన తొలి ఎన్నికల (1978) వెంటనే మంత్రిపదవి పొందాడు. ఆ తరువాత వెనువెంటనే ముగ్గురు ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రులు మారిననూ ఆ మూడు మంత్రిమండళ్లలో స్థానం సంపాదించాడు. ఆ తరువాత చాలా కాలం పాటు ఎటువంటి ప్రభుత్వ పదవీ దక్కలేదు. 1989-94 మధ్య [[ముఖ్యమంత్రి]] పదవి కోసం ప్రయత్నించినా అవకాశం రాలేదు. [[1999]]లో మళ్ళీ శాసనసభకు ఎన్నికై ప్రతిపక్షనేతగా ఉంటూ తదుపరి ఎన్నికలలో [[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్ పార్టీ]] గెలుపుకు వ్యూహం రచించాడు. [[2003]]లో మండువేసవిలో 1460 కిలోమీటర్లు <ref>http://www.kadapa.info/ysr.html</ref> సాగిన పాదయాత్ర మరియు ఉచిత విద్యుత్ ప్రచారం అతని విజయానికి బాటలు పరచింది. [[2004]] ఎన్నికలలో పులివెందుల నియోజకవర్గం నుంచి 40వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించడమే కాకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు పొందడంతో ముఖ్యమంత్రి పీఠం వై.ఎస్.రాజశేఖరరెడ్డికే దక్కింది. ఆయన [[సెప్టెంబర్ 2]], [[2009]]న [[చిత్తూరు జిల్లా]]లో రచ్చబండ కార్యక్రమానికి హాజరవడానికి వెళ్తూ నల్లమల అడవులలో హెలికాప్టర్ ప్రమాదానికి గురై దుర్మరణం పాలయ్యాడు. వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అవినీతిపై ఆయన మంత్రివర్గ సభ్యులే కాకుండా కేంద్రమంత్రులు, ప్రస్తుత మంత్రులు, ప్రధాన ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మైసూరారెడ్డి లెక్కలువేయగా<ref>ఈనాడు 26-05-2012</ref> అప్పటి మంత్రి పి.శంకర్రావు వ్యాఖ్యలను కోర్టు సుమోటాగా స్వీకరించి విచారణ చేపట్టింది. వైఎస్సార్ కాలంలో అవినీతి జరిగిందని సీబీఐ ప్రాథమిక విచారణలో వెల్లడించింది. "క్విడ్ ప్రో కో " రూపంలో జగన్ కు చెందిన కంపెనీలలో పెట్టుబడులు వచ్చినట్లు సీబీఐ చార్జిషీటులో పేర్కొంది.
 
==బాల్యం, విద్యాభ్యాసం==
వై.యస్.రాజశేఖర్ రెడ్డి జూలై 8, 1949 న వైఎస్ఆర్ జిల్లా, [[జమ్మలమడుగు]]లోని సి.ఎస్.ఐ. కాంప్‌బెల్ మిషన్ ఆసుపత్రిలో జన్మించాడు.<ref>http://www.aponline.gov.in/quick%20links/cm/cmprofile.html</ref> ఆయన తల్లిదండ్రులు [[జయమ్మ]], [[రాజారెడ్డి]]. ఆయన తండ్రి బళ్ళారిలో కాంట్రాక్టరుగా పనిచేస్తుండటం వల్ల ఆయన పాఠశాల చదువంతా [[బళ్ళారి]]లోని సెయింట్ జాన్స్ పాఠశాలలో సాగింది. ఆ తర్వాత విజయవాడ [[లయోలా కళాశాల]]లో చేరాడు. 1972లో [[గుల్బర్గా విశ్వవిద్యాలయం]] నుంచి వైద్యవిద్యలో పట్టా పుచ్చుకున్నాడు. గుల్బర్గాలోని మహాదేవప్ప రాంపూరే వైద్య కళాశాలలో వైద్యవృత్తిని అభ్యసిస్తుండగానే కళాశాల విద్యార్థిసంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరించాడు. [[శ్రీ వెంకటేశ్వర వైద్యకళాశాల]] (యెస్.వి.ఆర్.ఆర్), [[తిరుపతి]] నుంచి హౌస్‌సర్జన్ పట్టా పొందాడు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల వైపు ఆకర్షితుడైన రాజశేఖరరెడ్డి యెస్.వి.ఆర్.ఆర్ కళాశాలలో పనిచేస్తుండగానే అక్కడ హౌస్‌సర్జన్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.
 
తరువాత కొద్దిరోజులపాటు [[జమ్మలమడుగు]]లోని సి.ఎస్.ఐ. కాంప్‌బెల్ ఆసుపత్రిలో[[ఆసుపత్రి]]<nowiki/>లో వైద్య అధికారిగా పనిచేశాడు. ఆ తరువాత 1973లో పులివెందులలో తండ్రి వై.ఎస్.రాజారెడ్డి పేరుతో కట్టించిన 70 పడకల ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేశాడు. ఆ ఆసుపత్రి ఇప్పటికీ పనిచేస్తూనే ఉంది. వాళ్ళ కుటుంబం పులివెందులలో ఒక పాలిటెక్నిక్ కళాశాల మరియు డిగ్రీ కళాశాలను కూడా నెలకొల్పారు. తరువాత వాటిని లయోలా సంస్థలకు అప్పగించారు. పులివెందుల దగ్గరిలో ఉన్న [[సింహాద్రిపురం]]లో ఉన్న కళాశాలను మాత్రం ఇప్పటికీ వీరి కుటుంబమే నిర్వహిస్తోంది.
 
==రాజకీయ జీవితం==
కళాశాల దశ నుంచే రాజకీయాలపై ఆసక్తి చూపిన రాజశేఖరరెడ్డి [[1980]]-[[1983|83]] కాలంలో రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిపదవిని నిర్వహించాడు. [[కడప లోక్‌సభ నియోజకవర్గం]] నుంచి 4 సార్లు ఎన్నికయ్యాడు. [[పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం]] నుంచి 6 సార్లు విజయం సాధించాడు. రాష్ట్ర [[శాసనసభ ప్రతిపక్షనేత]]గానూ, రెండు సార్లు [[రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రేస్ కమిటీ]] అధ్యక్షుడిగానూ పనిచేశాడు. 1980 నుంచి 1983 దాకా గ్రామీణాభివృద్ధి, వైద్యశాఖ, విద్యాశాఖ మొదలైన కీలకమైన మంత్రి పదవులను నిర్వహించాడు. తెలుగు దేశం నేత [[నారా చంద్రబాబు నాయుడు]] మొదటగా కాంగ్రెస్ లో ఉన్నపుడు ఇరువురూ మంచి మిత్రులు.
1985 నుంచి 1998 వరకు పార్టీలో వై.ఎస్. నిత్య అసమ్మతివాదిగా పేరుపడ్డారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులందరితో ఆయన పోరాటం చేయాల్సి వచ్చింది. 1989-94 మధ్య కాలంలో ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నించినా సాధ్యపడలేదు. [[మర్రి చెన్నారెడ్డి]], [[నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి]], [[కోట్ల విజయ భాస్కర్ రెడ్డి]] వంటి నేతలతో ఆయన రాజకీయ యుద్ధమే చేశారు. వారికి వ్యతిరేకంగా క్యాంపులు నడిపాడు. మర్రి చెన్నారెడ్డిని, నేదురుమిల్లి జనార్ధన్‌రెడ్డిని పదవినుండి తొలగించడానికి ప్రధాన కారణమైన [[హైదరాబాదు]] నగరంలో జరిగిన అల్లర్లలో రాజశేఖర్ రెడ్డి వర్గపు పాత్ర ఉందన్న ఆరోపణలు వచ్చాయి. అదే తాను ముఖ్యమంత్రి అయ్యేనాటికి అలాంటి శిబిరాలు లేని పరిస్థితిని సృష్టించుకోగలిగాడు. రాజకీయాల్లో ముక్కుసూటితనానికి, నిర్మొహమాట ధోరణికి రాజశేఖరరెడ్డి ప్రసిద్ధుడు.<ref>[http://books.google.com/books?id=rm-9tnW3FTwC&pg=PA2638&dq=yeduguri#v=onepage&q=yeduguri&f=false Encyclopaedia of India, Pakistan and Bangladesh] By Om Gupta పేజీ.2638</ref>
 
===పిసిసి అధ్యక్షుడిగా===
పంక్తి 65:
; ప్రమాదంపై విచారణ సంఘము
 
[[నల్లమల అడవులు|నల్లమల]] అడవులలో సంభవించిన హెలికాప్టర్ దుర్ఘటనపై కేంద్ర ప్రభుత్వం విచారణ సంఘాన్ని నియమించింది. [[పవన్‌హన్స్ హెలికాప్టర్ లిమిటెడ్]] యజమాని [[ఆర్.కె.త్యాగి]] ఈ విచారణ కమిటీకి నేతృత్వం వహించాడు.
 
==కాలరేఖ==