గరమ్ హవా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 50:
తన కుమార్తెకూ, కొడుకుకూ పెళ్ళి ఏర్పాట్లు చెయ్యాలని షంషాద్ తల్లి ఆగ్రా వచ్చింది. అది చూసి అమీనా ఎంతో సంబరపడింది. సలీమ్‌ భార్య వివాహం తేదీ వివరాలు అడగబోతే ఆమె షంషాద్‌కు అమీనాను చేసుకోవడం లేదని, పాకిస్తాన్‌లో వున్న సంబంధాన్నే చూశామని చెప్పింది. అనుకున్న ఈ పెళ్ళికి కూడా అంతరాయం కలగడంతో అమీనా ఆత్మహత్య చేసుకున్నది.
 
మీర్జా సలీమ్‌ పూర్తిగా నిస్సహాయుడయ్యాడు. ఇంక లాభం లేదని, దేశం విడిచిపెట్టి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు. రైలు ఎక్కడానికి కొడుకుతో సహా, స్టేషన్‌కు బయల్దేరాడు. దారిలో వాళ్ళకు ఒక వూరేగింపు ఎదురైంది. జీవనోపాధికి సరైన మార్గం కావాలని చేస్తున్న ఆందోళన అది. సలీమ్‌ కొడుకు ఒక్కసారిగా, టాంగా దూకి ఆ సమూహంలో కలిశాడు. ఒక్క క్షణం ఆలోచించి సలీమ్‌ కూడా ఆ గుంపులో కలిశాడు. అతని దేశాభిమానమే అతనికి ఆశ్రయం ఇచ్చింది<ref>{{cite journal|last1=సంపాదకుడు|title=గరమ్‌ హవా|journal=విజయచిత్ర|date=1 November 1974|volume=9|issue=5|page=37|accessdate=22 May 2017}}</ref>.
 
==పురస్కారాలు==
"https://te.wikipedia.org/wiki/గరమ్_హవా" నుండి వెలికితీశారు