కొత్త భావయ్య: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37:
 
 
'''కొత్త భావయ్య చౌదరి''' ఒక చారిత్రక పరిశోధకుడు. తీరాంధ్ర దేశము, [[గుంటూరు]] జిల్లా [[తెనాలి]] మండలం [[సంగం జాగర్లమూడి]] లో [[జూన్ 2]], [[1897]]లో శివలింగయ్య రాజమ్మ దంపతులకు జన్మించాడు. [[విజ్ఞాన చంద్రికా మండలి]] పరీక్షలో కృతార్ధులై శ్రీ [[కందుకూరి వీరేశలింగం]] పంతులు గారి నుండి యోగ్యతా పత్రము పొందాడు. స్వయం కృషితో పరిశోధనా పటిమను, పాండిత్యాన్ని సంపాదించాడు. స్వగ్రామమైన [[సంగం జాగర్లమూడి]] సర్పంచ్ గా గ్రామాభ్యుదయానికి పాటు పడ్డాడు. పలు పాఠశాలలకు, కళాశాలలకు భూరి విరాళాలిచ్చాడు.[[ఆంధ్ర]], [[కర్ణాటక]], [[తమిళ]] దేశములందు దొరికిన శాసనములు, సంస్కృతాంధ్ర కావ్యములు, తాళపత్ర గ్రంథములు, కైఫీయతులు మున్నగు పలు మూలాలు పరిశోధించి , ఎన్నో వ్యయప్రయాసలను లెక్కించక నిరంతర దీక్షతో 12 సంవత్సరములు కృషి చేసి [[కమ్మ]]వారి చరిత్రము అను మూడు సంపుటముల గ్రంథము వ్రాశాడు<ref>కమ్మవారి చరిత్రము, [[కొత్త భావయ్య చౌదరి]], 1939 </ref>. 1954లో మూడు సంపుటములలోని సమాచారము క్లుప్తముగా ఆంగ్లములోనికి అనువదించబడినది.<ref>A Brief History of the Kammas, Kotta Bhavaiah Choudary, Published by K. Bhavaiah Choudary, 1954, Sangam Jagarlamudi, Andhra Pradesh</ref>.[[మద్రాసు]]లో మకాముపెట్టి అచటి ప్రాచ్య లిఖిత పుస్తకాలయము, విశ్వవిద్యాలయము, శాసన పరిశోధన కార్యాలయములలో విషయ సేకరణ చేశాడు. [[సంస్థానాధీశులను]], [[జమీందారులను]], పండితులను సంప్రదించి, ఎన్నో ఉపేక్షలను లెక్కించక తలచిన కార్యము సాధించాడు.భావయ్య విరచితమైన పెక్కు పుస్తకములలో కొన్ని: దేవరహస్యాలు, కాశ్మీర నేపాల దేశ చరిత్రలు, పశ్చిమ చాళుక్య చరిత్ర, వేంగీ చాళుక్య చరిత్ర, సగరపట్టాభిషేకం, కాకతీయ రాజన్య చరిత్ర, [[ఆంధ్ర రాజులు]], [[గుంటూరు]] మండల ప్రాచీన చరిత్ర, శాయపనేనివారి చరిత్ర, [[పరశురాముడు|పరశురామ]] నాటకము, వినోద కథలు, ప్రభోధకుసుమావళి.భావయ్య 23.7.1973 న మరణించాడు.
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/కొత్త_భావయ్య" నుండి వెలికితీశారు