దేవరాజు మహారాజు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఉస్మానియా విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్ధులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
}}
 
డా.దేవరాజు మహారాజు బహుముఖ ప్రజ్ఞాశాలి, [[హేతువాది]], [[జంతుశాస్త్రం|జంతుశాస్త్ర]] నిపుణుడు, మొక్కలలో ఉండే నిమటోడ్ పరాన్న జీవులపై పరిశోధన చేశాడు. సమాజంలో శాస్త్రీయ అవగాహనను పెంచడానికి సరళ విజ్ఞాన శాస్త్ర గ్రంథాలు, వ్యంగ్య రచనలు చేశాడు.
కవిగా, కథా రచయితగా, నాటక కర్తగా, అనువాదకుడిగా, కాలమిస్టుగా, వ్యాసకర్తగా బహుముఖమైన ప్రతిభ చాటుకున్నారు '''డాక్టర్‌ దేవరాజు మహారాజు'''.
==జీవిత విశేషాలు==
డా.దేవరాజు మహారాజు [[ఫిబ్రవరి 21]], [[1951]] న [[వరంగల్]] జిల్లా [[కోడూరు]] లో జన్మించారు. స్వగ్రామం [[వడపర్తి]], [[భువనగిరి]], హైద్రబాద్‌లలో[[హైదరాబాదు|హైదరాబాద్‌]]<nowiki/>లలో వీరి విద్యాభ్యాసం కొన సాగింది. [[ఉస్మానియా యూనివర్సిటీ]] నుంచి 1975లో జంతుశాస్త్రంలో ఎంఎస్సీ, 1979లో డాక్టరేట్‌ అందుకున్నారు. [[జంతుశాస్త్రం|జువాలజీ]] ఫ్రొపెసర్‌గా పరాన్న జీవులపై పరిశోధనలు చేస్తూ, చేయిస్తూ పిజి విద్యార్థులకు, పరిశోధన విద్యార్థులకు 28 ఏళ్లు మార్గదర్శనం చేసారు. [[తెలంగాణా]] ప్రజల భాషలో కవిత కథ చెప్పి మెప్పించి కవిగా, కథకుడిగా స్థిరపడ్డారు. భారతీయ భాషల కవిత్వాన్ని కథల్ని తెలుగులోకి అనువదించి తెలుగు కళ్లకు ఇరుగుపొరుగు దృశ్యాల్ని చూపించారు. వెండితెర కవిత్వంగా కొనియాడబడుతున్న భారతీయ సమాంతర సినిమాను విశ్లేషించారు. జానపద సాహిత్య పరిశీలన చేశారు. విజ్ఞాన గ్రంథాలను ప్రచురించారు. తెలుగు అకాడమీ పుస్తకాలకు రచయితగా, సంపాదకుడిగా వ్యవహరిం చారు. భారతీయ వారసత్వం, సంస్కృతి, విజ్ఞాన నాగరికతలు డిగ్రీ పాఠ్య గ్రంథమే అయినా సంపాదకుడిగా దానిని ఐఎఎస్‌ స్థాయి పోటీ పరీక్షలకు పనికివచ్చే విధంగా తీర్చిదిద్దారు. ప్రముఖ అనువాదకులు దండమూడి మహీదర్‌ దేవరాజును అభినయ కొడవగంటి కుటుంబరావని కితాబునిచ్చారు. ఫ్రెంచ్‌ గడ్డంతో విలక్షణంగా కనిపించే ఈ తెలుగు కవికి అనేక ప్రత్యేకతలున్నాయి. వచన కవిత్వంలో తెలంగాణ జీవద్భాష ప్రవేశపెట్టడం, తెలంగాణ ప్రజల భాషలో తొలి కథల సంపుటి ప్రచురించడం, మూఢనమ్మకాల నిర్మూలనకు కలం పట్టడం వంటివున్నాయి. ఎయిడ్స్‌పై అవగాహన కోసం తెలుగులో[[తెలుగు]]<nowiki/>లో తొలి పుస్తకం రాసి సామాజిక బాధ్యత కవికి ఉండాలని నిరూపించారు దేవరాజు జాన్‌ ఎర్నస్ట్‌ స్టెయిన్‌ బెక్‌ నవల 'దిపెరల్‌'ను తెలుగు పాఠకులకు 'మంచి ముత్యం'గా అదించారు.
 
దేవరాజు మహారాజు 150 మంది భారతీయ కవుల్ని, 50 మంది మరాఠి దళిత కవుల్ని కవితాభారతి, మట్టిడుండె చప్పుళ్లు కవితా సంకలనాల ద్వారా పరిచయం చేశారు. అలాగే [[ఒడియా భాష|ఒరియా]] మహాకవి సీతాకాంత్‌ మహాపాత్ర కవితల నెన్నింటినో అనువదించారు. [[హిందీ భాష|హిందీ]] కవి హరివంశ్‌రాయ్‌ బచ్చన్‌ 'మధుశాలి'ని అదే ధాటితో తెలుగులోకి తెచ్చారు. 70 మంది భారతీయ కథానికా రచయితల్ని (హరివిల్లు, [[ఆంధ్రప్రభ (వారపత్రిక)|ఆంధ్రప్రభ]] వార పత్రిక 1991-92) వారి కథలతో సహా పరిచయం చేశారు. భారతీయ భాషల రచయితలను పరిచయం చేస్తూ స్త్రీవాద ధోరణిలో వెలువడిన వారి కథానికల్ని తెలుగు పాఠకులకందించారు. పిల్లల కోసం రాసిన [[చైనా]] జానపద కథలు నాలుగు పుస్తకాలుగా వెలువడినాయి. భారతీయ జానపదం 1994-96లో తేట తెలుగులో అక్షరాలతో దేవరాజు మహారాజు చేసిన అనువాదాలు, పరిచయాలు వివిధ పత్రికలలో ప్రచురించబడుతున్నాయి.
 
==కథా సంపుటాలు==
"https://te.wikipedia.org/wiki/దేవరాజు_మహారాజు" నుండి వెలికితీశారు