దేవదాస్ కనకాల: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 48:
 
== ఇతరములు ==
కొన్నిరోజులకే ఉద్యోగానికి రాజీనామా చేసి [[ఓ సీత కథ]] లాంటి పలు తెలుగు చలన చిత్రాల్లో ముఖ్యపాత్రను పోషించారు. అంతేకాకుండా [[చలిచీమలు]] వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. అడయార్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ (మద్రాస్) లో [[ఎ.ఆర్.కృష్ణ]] సారథ్యంలో నడిచిన ఆంధ్రప్రదేశ్ రిపర్టరీలోను, మధు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లోను అధ్యాపకునిగా మరియు [[తెలుగు విశ్వవిద్యాలయం]] రంగస్థల కళలశాఖలో అధ్యాపకునిగా, శాఖాధిపతిగా పనిచేశారు. నట శిక్షణ ఇవ్వడంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. [[రజనీకాంత్‌]], [[చిరంజీవి]], [[రాజేంద్ర ప్రసాద్‌]], [[శుభలేఖ సుధాకర్]], [[నాజర్‌]], [[ప్రదీప్ శక్తి]], [[భానుచందర్‌]], అరుణ్‌పాండ్యన్‌, రాంకీ, [[రఘువరన్]] వంటి సినీ నటులతోపాటు, టీవీలో ఉన్న నటులంతా దేవదాస్ కనకాల వద్ద నట శిక్షణ పొందినవారే.
 
దూరదర్శన్ కోసం వీరు దర్శకత్వం వహించిన ''రాజశేఖర చరిత్ర'', ''డామిట్ కథ అడ్డం తిరిగింది'' మొదలగు సీరియల్స్ విశేష ప్రజాధరణ పొంది, అనేక బహుమతులను అందుకున్నాయి.
"https://te.wikipedia.org/wiki/దేవదాస్_కనకాల" నుండి వెలికితీశారు