కైకాల సత్యనారాయణ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 31:
 
==సినీ జీవితం==
తన గంభీరమైన కాయంతో, కంచు కంఠంతో, సినిమాలలో వేషాల కోసం సత్యనారాయణ [[మద్రాసు]] వెళ్ళాడు. ఆయన్ని మొదట గుర్తించింది [[డి.యల్.నారాయణ]]. [[1959]]లో నారాయణ [[సిపాయి కూతురు]] అనే సినిమాలో సత్యనారాయణకు ఒక పాత్ర ఇచ్చాడు. దానికి దర్శకుడు చంగయ్య. ఆ సినిమా బాక్సు ఆఫీసు దగ్గర బోల్తాపడినా సత్యనారాయణ ప్రతిభను గుర్తించారు. అలా గురించటానికి ఆసక్తి గల కారణం, ఆయన రూపు రేఖలు [[యన్.టి.ఆర్|యన్.టి.ఆర్‌ను]]ను పోలి ఉండటమే. యన్.టి.ఆర్ కు ఒక మంచి నకలు దొరికినట్లు అయింది. అప్పుడే యన్.టి.ఆర్ కూడా ఈయన్ని గమనించారు. [[1960]]లో యన్.టి.ఆర్ తన [[సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి]]లో ఈయనకు ఒక పాత్రనిచ్చారు. ఈ సినిమాకి దర్శకత్వం వహించినవారు [[యస్.డి.లాల్]]. ఈ సినిమాలో సత్యనారాయణ యువరాజు పాత్ర వేసాడు.
 
సత్యనారాయణను ఒక ప్రతినాయకుడుగా చిత్రించవచ్చు అని కనిపెట్టినది [[విఠలాచార్య]]. ఇది సత్యనారాయణ సినిమా జీవితాన్నే మార్చేసింది. విఠలాచార్య సత్యనారాయణ చేత ప్రతినాయకుడుగా [[కనక దుర్గ పూజా మహిమ]]లో వేయించాడు. ఆ పాత్రలో సత్యనారాయణ సరిగ్గా ఇమడటంతో, తర్వాతి సినిమాల్లో ఆయన ప్ర్రతినాయకుడుగా స్థిరపడి పోయాడు.
"https://te.wikipedia.org/wiki/కైకాల_సత్యనారాయణ" నుండి వెలికితీశారు