పూతరేకులు: కూర్పుల మధ్య తేడాలు

కొంత విస్తరణ
పంక్తి 9:
==తయారీ విధానం==
[[దస్త్రం:Making of Indian Sweet Pootareku.webm|thumbnail|పూతరేకుల తయారీ]]
పూతరేకుల తయారీకి కాల్చిన పెద్ద మట్టి కుండను వాడుతారు. కుండ నున్నగా గుండ్రంగానూ ఉండేలా చూసుకొంటారు. దాని మూతి వైపుగా కట్టెలు పెట్టేంత వెడల్పుగా కుండకు రంధ్రం చేస్తారు. ఇడ్లీకి[[ఇడ్లీ]]<nowiki/>కి వాడే విధంగా మినప మరియు వరిపిండి మిశ్రమాన్ని పల్చగా జాలుగా వచ్చేలా చేసుకొని ఒకరోజు పాటు నిల్వ ఉంచుతారు. మరుసటి రోజు కుండకు ఉన్న రంధ్రం ద్వారా కట్టెలు పెట్టి, మంట పెట్టి కుండను వేడెక్కిస్తాఅరు. జాలుగా తయారుచేసుకుని సిద్ధంగా ఉంచుకున్న పిండిలో పల్చని గుడ్డను ముంచి, దానిని విప్పి వెడల్పుగా కుండపై ఒకవైపు నుండి మరొక వైపుగా లాగుతారు. వేడెక్కిన కుండపై పిండి పల్చని పొరలా ఒక పేపర్ మందంతో ఊడి వస్తుంది దానిని రేకుగా పిలుస్తారు.
 
ఈ రేకులో తీపిపదార్థాలను వేసి పొరలుపొరలుగా మడిచిపెట్టి పూతరేకులను తయారుచేస్తారు. ఈ తీపి పదార్థాలు రకరకాలుగా ఉంటాయి. నెయ్యి, బెల్లం వేసి వేసి తయారుచెయ్యడం సంప్రదాయికంగా వస్తున్న పద్ధతి. అలాగే పంచదార పొడి వేసి కూడా తయారుచేస్తారు. [[జీడిపప్పు]], [[బాదం పప్పు]] వేసి తయారుచెయ్యడం ఒక పద్ధతి. మధుమేహవ్యాధి ఉన్నవారికోసం సుగర్‌ఫ్రీ పూతరేకులను కూడా తయారుచేస్తున్నారు.<ref>{{Cite web|url=https://web.archive.org/web/20161024070847/http://www.kostalife.com/telugu/%E0%B0%86%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B1%87%E0%B0%AF%E0%B0%AA%E0%B1%81%E0%B0%B0%E0%B0%82-%E0%B0%AA%E0%B1%82%E0%B0%A4%E0%B0%B0%E0%B1%87%E0%B0%95%E0%B1%81%E0%B0%B2%E0%B1%81-%E0%B0%85%E0%B0%82%E0%B0%9F/|title=ఆత్రేయపురం పూతరేకులు అంటే ఒక స్వీట్ కాదు, ప్రపంచపటంలో నిలిచిన ఒక బ్రాండ్}}</ref>
"https://te.wikipedia.org/wiki/పూతరేకులు" నుండి వెలికితీశారు