కంకణ (కన్నడ సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
* కూర్పు : ఉమేష్ కులకర్ణి
==చిత్రకథ==
అది [[మైసూరు]] పట్టణం. అప్పుడే బి.ఏ. పరీక్షలు రాసి, తర్వాత ఏం చేయాలా అని ఆలోచిస్తూ కుర్చున్నారు ఆరుగురు అమ్మాయిలు. కాలేజీలో చదువుకుంటుండగా - వాళ్ళ మధ్య ఏర్పడిన మైత్రి అంతా ఇంతా కాదు. అందుకే వాళ్ళు ఒక చోట కూర్చుని భవిష్యత్తు పట్ల తమ ఆశలు, ఆశయాలు చెప్పుకుంటూ, ఒకరి అభిప్రాయాలు మరొకరు తెలుసుకోవడం పట్ల ఎంతో ఆసక్తి చూపారు. మనసులు విప్పి మాట్లాడుకున్నారు.
 
ఒక్కొక్కరి కుటుంబంలోను రకరకాల సమస్యలు... రమ, సుశీలల కుటుంబాలు పెద్దవి.అంచేత వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ, తమ తమ కుటుంబాలకు సాయపడదామనుకున్నారు. వేదవల్లి గృహిణిగా స్థిరపడాలని అనుకున్నా, ఆమె నల్లగా ఉండడంవల్ల సంబంధం చేసుకోడానికి వచ్చేవాళ్ళు ఎక్కువ కట్నం అడగడడమో - లేదా పిల్ల నచ్చలేదనడమో ఆమెకు ఒక సమస్యగా పరిణమించించిది. కస్తూరికి పెద్ద చదువులు చదువుకుని - పెద్ద ఉద్యోగం చేస్తున్న వ్యక్తిని పెళ్ళాడాలని కోరిక. అమృతకు పెళ్ళి మీద అంతగా ఆసక్తి లేదు. ఇక వాళ్ళందరితో పోలిస్తే - ఏ చీకూ చింతా లేని అమ్మాయి - అంబిక. ఆమె శ్రీమంతుల ఇంట్లో పుట్టడమే అందుకు కారణం!
"https://te.wikipedia.org/wiki/కంకణ_(కన్నడ_సినిమా)" నుండి వెలికితీశారు