"కంకణ (కన్నడ సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

చి
ఒక్కొక్కరి కుటుంబంలోను రకరకాల సమస్యలు... రమ, సుశీలల కుటుంబాలు పెద్దవి.అంచేత వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ, తమ తమ కుటుంబాలకు సాయపడదామనుకున్నారు. వేదవల్లి గృహిణిగా స్థిరపడాలని అనుకున్నా, ఆమె నల్లగా ఉండడంవల్ల సంబంధం చేసుకోడానికి వచ్చేవాళ్ళు ఎక్కువ కట్నం అడగడడమో - లేదా పిల్ల నచ్చలేదనడమో ఆమెకు ఒక సమస్యగా పరిణమించించిది. కస్తూరికి పెద్ద చదువులు చదువుకుని - పెద్ద ఉద్యోగం చేస్తున్న వ్యక్తిని పెళ్ళాడాలని కోరిక. అమృతకు పెళ్ళి మీద అంతగా ఆసక్తి లేదు. ఇక వాళ్ళందరితో పోలిస్తే - ఏ చీకూ చింతా లేని అమ్మాయి - అంబిక. ఆమె శ్రీమంతుల ఇంట్లో పుట్టడమే అందుకు కారణం!
 
చదువైపోగానే సరదాగా కొంత కాలం గడపకుండా అప్పుడే రకరకాల ఆలోచనలతో సతమతమైపోవడం ఎందుకని - అంబిక - తన స్నేహితురాళ్ళందరినీ తీసుకుని ' చిక్‌మగళూర్' లోని తన మామయ్యగారి కాఫీ ఎస్టేట్‌కు విహారయాత్రకు బయలుదేరింది.
 
అక్కడ ఈ అమ్మాయిలకు అంబిక అత్తగారి దూరపు బంధువు సురేష్ పరిచయం అయ్యడు. కస్తూరి సురేష్ పట్ల ఆకర్షణకు లోనయ్యింది. అతని వీళ్ళందర్నీ బేలూరుకు[[బేలూరు]]కు తీసుకువెళ్ళాడు. సురేష్‌తో ఏర్పడిన సాన్నిహిత్యం కస్తూరిని ఊహాలోకాల్లో విహరింపజేసింది. అందరూ బేలూరు నుంచి శృంగేరి వెళ్దామనుకున్నారు. కానీ అక్కడి వాతావరణం కస్తూరికి పడకపోవడంతో ఆమెకు అకస్మాత్తుగా జబ్బు చేసింది. తన స్నేహితురాళ్ళను విహారయాత్ర కొనసాగించమని చెప్పి ఆమె అక్కడే ఉండిపోయింది. మెడికల్ గ్రాడ్యుయేట్ అయిన సురేష్ ఆమెకు వైద్యచికిత్స చేశాడు. ఆ సమయంలోనే ఆమెపట్ల తనకు కలిగిన ప్రేమను వ్యక్తం చేశాడు.
 
విహారయాత్రను ముగించుకుని అందరూ ఇళ్ళకు చేరుకున్నారు. రమ - ఒక కాంట్రాక్టరు భార్యకు చదువుచెప్పే ఉద్యోగాన్ని సంపాయించుకుంది. సుశీల ఓ కార్యాలయంలో రిసెప్షనిస్ట్‌ అయింది. వేదవల్లి -సాల్డాన్హా అనే మాస్టరు వద్ద సితార్ నేర్చుకోసాగింది.
2,16,288

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2120034" నుండి వెలికితీశారు