"కంకణ (కన్నడ సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
అక్కడ ఈ అమ్మాయిలకు అంబిక అత్తగారి దూరపు బంధువు సురేష్ పరిచయం అయ్యడు. కస్తూరి సురేష్ పట్ల ఆకర్షణకు లోనయ్యింది. అతని వీళ్ళందర్నీ [[బేలూరు]]కు తీసుకువెళ్ళాడు. సురేష్‌తో ఏర్పడిన సాన్నిహిత్యం కస్తూరిని ఊహాలోకాల్లో విహరింపజేసింది. అందరూ బేలూరు నుంచి శృంగేరి వెళ్దామనుకున్నారు. కానీ అక్కడి వాతావరణం కస్తూరికి పడకపోవడంతో ఆమెకు అకస్మాత్తుగా జబ్బు చేసింది. తన స్నేహితురాళ్ళను విహారయాత్ర కొనసాగించమని చెప్పి ఆమె అక్కడే ఉండిపోయింది. మెడికల్ గ్రాడ్యుయేట్ అయిన సురేష్ ఆమెకు వైద్యచికిత్స చేశాడు. ఆ సమయంలోనే ఆమెపట్ల తనకు కలిగిన ప్రేమను వ్యక్తం చేశాడు.
 
విహారయాత్రను ముగించుకుని అందరూ ఇళ్ళకు చేరుకున్నారు. రమ - ఒక కాంట్రాక్టరు భార్యకు చదువుచెప్పే ఉద్యోగాన్ని సంపాయించుకుంది. సుశీల ఓ కార్యాలయంలో రిసెప్షనిస్ట్‌ అయింది. వేదవల్లి -సాల్డాన్హా అనే మాస్టరు వద్ద సితార్ నేర్చుకోసాగింది. మరోప్రక్క ఆమెకు పెళ్ళి చూపుల బేరాలు కొనసాగుతూనే ఉన్నాయి. అమృత కుట్లూ అల్లికలతో కాలక్షేపం చేయసాగింది.
 
రమకు తన కుటుంబంలోని ఆర్థిక సమస్యలు ఎలా ఉన్నా తరచూ స్నేహితురాళ్ళ ఇళ్ళకు వెళ్తూ వాళ్ళ క్షేమసమాచారాలు విచారిస్తూనే ఉంది. ఒకరోజు ఆమెకు బెలూరులో జరిగిన కస్తూరి సురేష్‌ల ప్రేమాయణం గురించి తెలిసింది. తన స్నేహితురాలి క్షేమం కోరి ఆమెను హెచ్చరించి సురేష్‌ను మరచిపొమ్మని చెప్పింది. కస్తూరి అది అంత తేలికైన విషయం కాదని, తనకు పెళ్ళంటూ జరిగితే సురేష్‌తోనే జరగాలనీ తను అతనిపై పెంచుకున్న ఆశలను స్నేహితురాలికి వివరించింది. తనకు ఇంట్లోవాళ్ళు ఏదో సంబంధం చూస్తున్నట్లు ఈ విషయం తను సురేష్‌కు రాసినట్లు కూడా ఆమె రమతో చెప్పింది. సురేష్ తనను తప్పక స్వీకరిస్తాడని కస్తూరి నమ్మకం.
 
కానీ సురేష్ తేనె పూసిన కత్తి అన్న సంగాతి ఆ అమాయకురాలు గ్రహించలేకపోయింది. అతను అంబికకు తానొక పెద్దమనిషిలా ఉత్తరం వ్రాస్తూ కస్తూరి తనను ప్రేమిస్తున్నట్లుగ ఉత్తరం రాసిందని, ఇలా ఒక్కసారి పరిచయం అయిన వ్యక్తిని ప్రేమించేసేంత బలహీనురాలా నీ స్నేహితురాలు అంటూ దెప్పిపొడుస్తూ, కస్తూరి తనకు రాసిన ఉత్తరాన్ని కూడా ఆమెకు పంపించాడు.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2120105" నుండి వెలికితీశారు