కంకణ (కన్నడ సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 34:
 
రమ ప్రైవెటు ట్యూషన్లు చెప్పడం ప్రారంభించిన కొన్నాళ్ళకు ఒక ట్యుటోరియల్ ఇన్‌స్టిట్యూట్‌లో ఆమెకు టీచర్ ఉద్యోగం లభించింది. తన కుటుంబానికి ఎంతో సాయపడుతున్నానన్న ఆత్మ సంతృప్తితో పాటు, ఆమెకు విద్యార్థుల ఆదరాభిమానాలు కూడా లభించాయి. ముఖ్యంగా తన విద్యార్థులలో ఒకరైన నాగేంద్ర పట్ల ఆమెకు అభిమానం ఏర్పడింది. అతని హుందాతనం, వినయ విధేయతలు ఆమెను ఆకర్షించాయి. నాగేంద్ర్ కూడా ఒక పల్లెటూరులో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నా, తన ఉద్యోగంలో ఉన్నతావకాశాల కోసమని ఇన్‌స్టిట్యూట్‌లో చదువుకోడానికి వచ్చాడు.
 
రమ తను అంతర్గతంగా నాగేంద్రను ప్రేమిస్తున్నట్లు తెలుసుకోవడానికి ఎంతోకాలం పట్టలేదు.
 
ఒకరోజు దసరాపండుగ సందర్భంగా ఊళ్ళో ఏర్పాటు చేయబడిన ఎక్జిబిషన్‌కు రమ తన తమ్ముళ్ళను తీసుకుని బయలుదేరింది. అక్కడ ఆమెకు అమృత కనిపించింది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగ, సుశీల అడంబరమైన అలంకరణలతో విలాసంగా వెళ్తూ వుండడం చూశారు. సుశీల తప్పుదారిలో నడుస్తున్నట్లుగా రమతో చెప్పింది అమృత.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/కంకణ_(కన్నడ_సినిమా)" నుండి వెలికితీశారు