సూక్ష్మదర్శిని: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:Microscope_Zeiss_1879.jpg|thumb|right|200px|కార్ల్ జైస్ [[1879]] సూక్ష్మదర్శిని.]]
 
'''సూక్ష్మదర్శిని''' (Microscope) సామాన్యంగా [[కన్ను|కంటి]]కి కనిపించని పదార్ధాలను చూడడానికి ఉపయోగపడే సాధనము. 'సూక్ష్మం' అంటే చాలా చిన్నవి అని అర్ధం. దీనికి 400 సంవత్సరాల చరిత్ర ఉన్నది. అన్ని రకాలైన సూక్ష్మదర్శినులు [[కటకము|కటకాల]]ను ఉపయోగించి తయారుచేసినవి. ఇవి సామాన్య [[కాంతి]]ని యానకంగా పనిచేస్తాయి. అందువలన దీనిని కాంతి సూక్ష్మదర్శిని (Light Microscope) అని కూడా అంటారు.
 
సూక్ష్మదర్శిని రెండు దశలలో వస్తువు యొక్క ప్రతిబింబాన్ని అధికతరం చేస్తుంది. దీని కొరకు వస్తు కటకం (Objective lens), నేత్ర కటకం (Eye lens) తోడ్పడతాయి. వస్తు కటకాలు 3-4 పరిమాణాలలో ఉంటాయి. అవి 4x, 10x, 40x, 60x, 100x రెట్లు అధికతరం చేసే కటాకాలు. వీటి మూలంగా అల్ప శక్తి విధానంలో 100 రెట్లు, అధిక శక్తి విధానంలో 400 రెట్లు అధికరణను సాధిస్తుంది. ఆయిల్ ఇమ్మర్షన్ కటకం సాధారణంగా 1000 రెట్లు అధికరణ సాధిస్తుంది. ఇంతకన్నా అధికరణ ఎక్కువచేస్తే అస్పష్టత మరింత అధికతరమవుతుంది. ఇటువంటి వాటికోసం [[ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని]] ఉపయోగిస్తారు.
"https://te.wikipedia.org/wiki/సూక్ష్మదర్శిని" నుండి వెలికితీశారు