68,981
దిద్దుబాట్లు
(→కథ) |
(→కథ) |
||
జానకమ్మకు ముగ్గురు కొడుకులు - సూర్యం, చంద్రం, వాసులు. మంచిగా మర్యాదగా బ్రతకాలి అని ఆమె తన బోధించేది. ఉద్యోగాల కోసం తిరిగి తిరిగి వేసారి పోయిన ఆ యువకులు ముగ్గురూ చిన్న చిన్న తమాషాలు చేస్తూ డబ్బు సంపాదించడం మొదలు పెట్టారు. కాని అసలు బండారం బయటపడి జానకమ్మ చేత చీవాట్లు తిన్నారు.
లక్షాధికారి విశ్వేశ్వరరావు మేనకోడలు గీత, వడ్డీ వ్యాపారి గోవిందయ్య కూతుళ్ళు చంప, విజయలు స్నేహితురాళ్ళు. ఒకసారి పిక్నిక్లో కొందరు దుర్మార్గులు అల్లరిపెట్టగా సోదరులు ముగ్గురూ వారిని రక్షిస్తారు. స్నేహం కుదిరింది. వాసు - గీతల మనసులు కలిసాయి. ఇది విశ్వేశ్వరరావు బాబాయి కొడుకు బలరామ్‌కు కన్నెర్ర జేసింది. అతనికి, వాసుకు ఒకసారి ఘర్షణ జరిగింది కూడా. బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన కోటీశ్వరులుగా గోవిందయ్యకు పరిచయం చేయబడ్డారు సూర్యం, చంద్రం, వాసులు. కోటీశ్వరులు అల్లుళ్ళుగా దొరికారని గోవిందయ్య ఆనందానికి అంతులేదు. ఐతే ఈ ముగ్గురి అల్లరి చేష్టలకు అంతులేకపోయింది. వీళ్ళ అసలు గుట్టు తెలుసుకున్న గోవిందయ్య ఆ ముగ్గుర్ని తూలనాడి, హెచ్చరిక చేసి పంపించేశాడు. ప్రతీకారంగా ఆయన్ని పరాభవించాలనుకున్నాడు సూర్యం. వలపన్నాడు; కాని ఫలితం సూర్యం జైలు పాలయ్యాడు. సూర్యాన్ని విడిపించాలన్న చంద్రం వాసుల ప్రయత్నాలు విఫలమయ్యాయి. సూర్యం తన పెంపుడు కొడుకు మాత్రమేనని, అసలతను స్వయాన విశ్వేశ్వరరావు కొడుకేనని జానకమ్మ విశ్వేశ్వరరావుతో చెప్పి సూర్యాన్ని విడుదల చేయించింది.
|
దిద్దుబాట్లు