దామోదరం సంజీవయ్య: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి →ఉద్యోగాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: డిసెంబర్ → డిసెంబరు using AWB |
||
పంక్తి 25:
==ఉద్యోగాలు==
ఆ తరువాత చిన్నయ్య ఆర్థిక సహాయముతో [[అనంతపురం]] [[ప్రభుత్వ సీడెడ్ జిల్లాల కళాశాల]]లో గణితము మరియు ఖగోళ శాస్త్రములు అధ్యయనము చేశాడు. [[1942]]లో బీ.ఏ పూర్తి చేసిన తర్వాత జీవనోపాధి కొరకు అనేక చిన్నా చితక ఉద్యోగాలు చేశాడు. అప్పుడు [[రెండవ ప్రపంచ యుద్ధం|రెండవ ప్రపంచ యుద్ధము]] వలన ఉద్యోగాలు దొరకడము చాలా కష్టముగా ఉంది. సంజీవయ్య కర్నూలు పట్టణ రేషనింగ్ ఆఫీసులో గుమస్తాగా 48.80 రూపాయల జీతముతో ఉద్యోగములో చేరాడు. 1944 లో కొంతకాలము మద్రాసు కేంద్ర ప్రజా పనుల శాఖ (CPWD) [[కార్యాలయము]]<nowiki/>లో సహాయకునిగా పనిచేశాడు. 1945 జనవరిలో కేంద్ర ప్రజాపనుల శాఖా తనిఖీ అధికారిగా బళ్లారిలో పనిచేశాడు. ఈ గజెటెడ్ హోదా కల ఉద్యోగము
సంజీవయ్య [[1946]]లో అప్పటి [[బళ్లారి జిల్లా]] జడ్జి కే.ఆర్.కృష్ణయ్య చెట్టి ప్రోత్సాహముతో [[చెన్నై|మద్రాసు]] లా కాలేజీలో 'ఎఫ్.ఎల్' (F.L) లో చేరాడు. అప్పట్లో కాలేజిలో స్కాలర్షిప్ప్లు ఇచ్చే పద్ధతి ఉండేది కాదు. అందువలన సంజీవయ్య మద్రాసు జార్జ్‌టౌన్ లోని ప్రోగ్రెస్సివ్ యూనియన్ ఉన్నత పాఠశాలలో పార్ట్ టైం గణిత అధ్యాపకునిగా పనిచేశాడు. అక్కడ ఇచ్చే 90 రూపాయల జీతముతో హాస్టలు ఖర్చులు భరించేవాడు.
|