ధూమపానం: కూర్పుల మధ్య తేడాలు

35 బైట్లు చేర్చారు ,  6 సంవత్సరాల క్రితం
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, added underlinked tag, typos fixed: ) → ) using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, added underlinked tag, typos fixed: ) → ) using AWB
పంక్తి 1:
{{Underlinked|date=మే 2017}}
 
'''పొగ త్రాగడం ''' లేదా '''ధూమ పానం ''' అనగా [[పొగాకు]] సేవించే అలవాటు. ఇది మిక్కిలి ప్రమాదకరమైనది.
==నేపధ్యము==
కాల్చినా, నమిలినా, పక్కనుంచి పొగ పీల్చినా హానిచేసే పొగాకు ఉత్పత్తులు దేశార్థికానికీ తీరని నష్టం కలిగిస్తున్నట్లు పలు నివేదికాంశాలు స్పష్టీకరిస్తున్నాయి. మనదేశంలో 'పొగాకు వ్యాధుల' చికిత్స నిమిత్తం ఒక్క 2011లోనే ఆర్థిక వ్యవస్థపై పడిన భారం లక్షకోట్ల రూపాయలకు మించిపోయింది. ఆ ఏడాది స్థూల జాతీయోత్పత్తిలో 1.16శాతంగా లెక్కతేలిన మొత్తం, అప్పట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజారోగ్య పద్దుకింద చేసిన ఖర్చుకన్నా ఎక్కువ! పొగాకు ఉత్పత్తులపై వసూలవుతున్న సుంకాలకన్నా, వాటి వాడకంవల్ల దాపురిస్తున్న మహమ్మారి రోగాల చికిత్సకు చేస్తున్న ఖర్చే ఎన్నో రెట్లు అధికమని 2004నాటి అధ్యయన నివేదిక నిగ్గుతేల్చింది. దేశవ్యాప్తంగా పొగాకు ఉత్పత్తుల వినియోగం మూలాన ఆయా కుటుంబాలమీద రూ.40వేల కోట్లకుపైగా వ్యయభారం పడుతున్నట్లు ఆనాడు కేంద్ర ప్రభుత్వమే వెల్లడించింది. ధూమపానం, ఇతర పొగాకు ఉత్పత్తుల వాడకం పుణ్యమా అని నష్టం మరింత తీవరించినట్లు కొత్త నివేదిక తెలియజెబుతోంది! 'భారత ప్రజారోగ్య ఫౌండేషన్ (పీహెచ్ఎఫ్ఐ) ' అంచనాల ప్రకారం, పొగాకు సేవనంతో అకాలమరణాల కారణంగా దేశం ఏటికేడు భారీయెత్తున నష్టపోతూనే ఉంది. పొగాకు వాడకాన్ని ఉద్యమస్థాయిలో నిరుత్సాహపరచకపోతే 2020నాటికి ఏటా కోటీ పది లక్షలమంది ప్రాణాలు గాలిలో కలిసిపోక తప్పదని ఫౌండేషన్ నివేదిక హెచ్చరిస్తోంది.
== అనర్ధాలు==
పొగాకు అలవాటు కారణంగా ప్రతి 8 నిమిషాలకు ఒకరు చనిపోతున్నారు. ఏటా 4.9 మిలియన్ మరణాలు ఇదే కారణంగా సంభవిస్తున్నాయి. 2030 నాటికి ఈ సంఖ్య 10 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా. దేశంలో 10.9 శాతం మంది ఏదో రూపంలో పొగాకు తీసుకుంటున్నారు. ఇందులో 82 శాతం మంది దీని వల్ల సంక్రమించే వ్యాధులతో బాధపడుతున్నారు. 9 లక్షల మంది ప్రతి ఏటా మృత్యువాత పడుతున్నారు. 90 శాతం వూపిరితిత్తుల కేన్సర్లకు పొగ తాగడమే ప్రధాన కారణం. 35 శాతం నోటి క్యాన్సర్లు పొగాకు నమలడం ద్వారా వస్తున్నాయి. పొగ తాగే వారితోపాటు దానిని పీల్చడం వల్ల కుటుంబంలో ఇతరుల ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం చూపనుంది. మిగతా వారితో పోల్చితే పొగాకు అలవాటున్న వారిలో 2-3 రెట్లు గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. పాశ్చాత్య ప్రభావం, ప్రపంచీకరణ ఫలితంగా మహిళల్లోనూ ఈ అలవాటు పెరుగుతోంది.
43,014

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2121467" నుండి వెలికితీశారు