నిడేరియా: కూర్పుల మధ్య తేడాలు

2,802 బైట్లు చేర్చారు ,  14 సంవత్సరాల క్రితం
*ఇవి కణజాల నిర్మాణస్థాయి గల మెటాజోవా జీవులు.
*కొన్ని ఏకాంత, మరికొన్ని సహనివేశ జీవులు. శారీరానికి మధ్య పాయువు / నోరు ఉండి, చుట్టూ స్పర్శకాలు వలయంగా అమరి ఉంటాయి.
*ఇవి ద్విస్తరిత నిర్మాణాన్ని ప్రదర్శిస్తాయి. వెలుపలి పొర - బహిత్వచం, లోపలి పొర - అంతఃత్వచం. వీటి మధ్యన నిర్మాణ రహితంగా, కణరహితంగా, జెల్లీవంటి[[జెల్లీ]]వంటి శ్లేష్మస్తరం ఉంటుంది.
*శరీరం వలయ సౌష్టవంగా ఉంటుంది. మధ్య అక్షం ద్వారా ఏ ఆయత తలంలో ఖండించిన రెండు సమభాగాలు ఉంటాయి - ఏకాక్ష విషమధ్రువ సౌష్టవం. సీ అనిమోన్ లో ద్విపర్శ్వ వలయ సౌష్టవం ఉంటుంది.
*సీలెంటిరాన్ లేదా జఠర ప్రసరణ కుహరం అనే విశాలమైన మధ్య కుహరం ఉంటుంది. దీనిమూలంగా ప్రాధమిక నామం 'సీలెంటరేటా' వచ్చింది. తరువాత జీవులలో దంశకణాలు లేదా కుట్టుకణాలు ఉండటంతో వీటిని 'నిడేరియా' అని పేరు పెట్టారు. ఆహార పదార్ధాల జీర్ణం, జీర్ణమైన ఆహారం సరఫరా జఠరప్రసరణ కుహరంలో జరుగుతుంది.
*సీలెంటరాన్ నోటితో వెలుపలికి వెరుచుకొంటుంది. ఇదే నోరు, పాయువు విధులను నిర్వహిస్తుంది.
*సీలెంటరాన్ లో కణబాహ్య జీర్ణక్రియ, అంతఃస్త్వచ పోషక కండర కణాలలో కణాంతర జీర్ణక్రియ జరుగుతుంది.
*శరీరకుడ్యంలో ఉన్న దంశకణాలు (కుట్టుకణాలు) రక్షణకు, సంసజనకానికి, ఆహారాన్ని పట్టుకోవడానికి (భక్షణ) ఉపయోగపడతాయి.
*ప్రత్యేకంగా ప్రసరణ, శ్వాస, విసర్జక నిర్మాణాలు లేవు.
*నాడీ కణాలు అధ్రువతంగా ఉండి, విస్తరిత నాడీవల కలిగి ఉంటయి.
*కోరకీభవనం ద్వారా (జెమ్నేషన్) అలైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకొంటాయి.
*అభివృద్ధి అప్రత్యక్షంగా ఉంటుంది. ప్లాన్యులా అనే స్వేచ్ఛగా ఈదే శైలికామయ డింభక దశ ఉంటుంది.
 
==వర్గీకరణ==
===హైడ్రోజోవా===
===స్కైఫోజోవా===
===ఆంథోజోవా===
 
 
[[వర్గం:జంతు శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/212268" నుండి వెలికితీశారు