బాలగంగాధర తిలక్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: డిసెంబర్ → డిసెంబరు, → using AWB
పంక్తి 23:
 
== భారత జాతీయ కాంగ్రెస్ తో సంబంధాలు ==
తిలక్ 1890లో కాంగ్రెస్ లో సభ్యుడుగా చేరాడు. కానీ త్వరలోనే ఆయనకు కాంగ్రెస్ మితవాద రాజకీయాలపై నమ్మకం పోయింది. స్వరాజ్యం కోసం పోరాటమే సరైన మార్గమని ఆయన నమ్మాడు. అప్పటివరకు [[కాంగ్రెస్]] ప్రతి సంవత్సరం డిసెంబర్డిసెంబరు చివరివారంలో మూడు రోజులపాటు సమావేశమై బ్రిటిష్ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ విధానాలను "pray, petition, protest" చెయ్యడానికే పరిమితమైంది. తిలక్ దాని గురించి చాలా ఘాటైన విమర్శలు చేశాడు: "మీరు సంవత్సరానికొకసారి మూడు రోజులపాటు సమావేశమై కప్పల మాదిరి బెకబెకలాడడం వల్ల ప్రయోజనం లేదు." అని, "అసలు కాంగ్రెస్ సంస్థ అడుక్కునేవాళ్ళ సంఘం (బెగ్గర్స్ ఇన్స్టిట్యూషన్)" అన్నాడు. కాంగ్రెస్ సమావేశాలను ''3-డే తమాషా''గా అభివర్ణించాడు. "స్వరాజ్యం నా జన్మహక్కు. దాన్ని నేను పొంది తీరుతాను." అని గర్జించాడు. [[1907]]లో మహారాష్ట్రలోని సూరత్‌లో జరిగిన సమావేశంలో [[కాంగ్రెసు|కాంగ్రెస్]] చీలిపోయింది. మితవాదులు కాంగ్రెస్ పై తమ పట్టును నిలబెట్టుకున్నారు. అతివాదులుగా పిలవబడే తిలక్, ఆయన మద్దతుదారులు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేశారు. తిరిగి [[1916]]లో [[లక్నో]]లో జరిగిన సమావేశంలో అంతా ఒకటయారు. అదే సమావేశంలో కాంగ్రెస్ కు, [[ముస్లిం లీగు]]కు మధ్య లక్నో ఒప్పందం కుదిరింది.
 
== విద్యావిధానం ==
పంక్తి 35:
 
== హోంరూల్ లీగ్ ==
[[1916]] ఏప్రిల్ లో హోంరూల్ లీగ్ను స్థాపించి దాని లక్ష్యాలను వివరిస్తూ మధ్యభారతదేశంలో గ్రామగ్రామానా తిరిగాడు. [[అనీబిసెంటు]] అదే సంవత్సరం [[సెప్టెంబర్]]లో మొదలుపెట్టి హోంరూల్ ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేసింది. ఆ ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్న సమయంలో ఒక కోర్టుకేసులో ఆయన [[లండను]]కు వెళ్ళవలసి వచ్చింది. అప్పుడే, అంటే [[1917]] ఆగస్టులో అప్పటి సెక్రటరీ ఆఫ్ స్టేట్ మాంటేగు "బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగమైన [[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లో బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి వీలుగా అన్ని పాలనాంశాల్లో భారతీయులకు అధిక ప్రాధాన్యాన్నివ్వడమే ప్రభుత్వ విధానమని" బ్రిటిష్ ప్రభుత్వం తరపున ప్రకటించాడు. బాధ్యతాయుత ప్రభుత్వమంటే ఎవరికి బాధ్యత వహించే ప్రభుత్వమో, అధిక ప్రాధాన్యమంటే ఎంత ప్రాధాన్యమో, అసలు అది ఎప్పుడిస్తారో ఏదీ స్పష్టంగా లేదు. కానీ [[బ్రిటిషు|బ్రిటిష్]] ప్రభుత్వ నిజాయితీని నమ్మిన అనీబిసెంటు ఆ ప్రకటనతో ఉద్యమాన్ని అపేసి ప్రభుత్వానికి తన మద్దతు ప్రకటించింది. అలా ఇద్దరు నాయకులదీ చెరొకదారీ కావడంతో హోంరూల్ ఉద్యమం చల్లబడిపోయింది. కానీ ప్రజల్లో తిలక్ రగిలించిన స్ఫూర్తి మాత్రం కొనసాగింది. అందుకే [[1920]]లో ([[ఆగస్టు]] 1వ తేదీ) తిలక్ చనిపోయినప్పుడు జాతీయోద్యమం [[చుక్కాని]] లేని నావ అవుతుందని చాలా మంది భయపడ్డారు.
 
"[[మహాత్మా గాంధీ|గాంధీ]] అని ఇంకొకాయన ఉన్నాడు గానీ....అబ్బే! తిలక్ ముందర ఏపాటి?" అనుకున్నారు. కానీ "నాయకులు చరిత్రను సృష్టించరు. చరిత్రే నాయకులను సృష్టిస్తుంది." అనే మాటను నిజం చేస్తూ అతి సామాన్యుడిగా [[జీవితం]] ప్రారంభించిన గాంధీ తిలక్ మరణంతో ఏర్పడ్డ శూన్యాన్ని అసామాన్యంగా భర్తీ చెయ్యడమే గాక మహాత్ముడి స్థాయికి ఎదిగాడు.
"https://te.wikipedia.org/wiki/బాలగంగాధర_తిలక్" నుండి వెలికితీశారు