"మహబూబ్ నగర్ జిల్లా" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అక్టోబరు 6, 2012 → 2012 అక్టోబరు 6 (2), 14 జనవరి 2004 → 2004 జనవరి 14, , → , using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అక్టోబరు 6, 2012 → 2012 అక్టోబరు 6 (2), 14 జనవరి 2004 → 2004 జనవరి 14, , → , using AWB)
{{వేదిక|తెలంగాణ|Telangana.png}}
[[దస్త్రం:Mahbubnagar mandals outline.svg|left|200px|<center>మహబూబ్‌నగర్ జిల్లా</center>]]
భౌగోళికంగా ఈ జిల్లా [[తెలంగాణ]] ప్రాంతంలో దక్షిణాదిగా ఉంది. విస్తీర్ణం పరంగా తెలంగాణాలో ఇదే అతిపెద్దది. 16°-17° ఉత్తర అక్షాంశం మరియు 77°-79° తూర్పు రేఖాంశంపై జిల్లా ఉపస్థితియై ఉంది.<ref>http://mahabubnagar.nic.in/nic/nic/index.php</ref> 18432 చ.కి.మీ. విస్తీర్ణం కలిగిన ఈ జిల్లాకు దక్షిణంగా [[తుంగభద్ర నది]] సరిహద్దుగా ప్రవహిస్తున్నది. [[కృష్ణా నది]] కూడా ఈ జిల్లా గుండా ప్రవేశించి [[ఆలంపూర్]] వద్ద తుంగభద్రను తనలో కలుపుకుంటుంది. ఈ జిల్లా గుండా [[ఉత్తరం|ఉత్తర]], [[దక్షిణం]]గా 44వ నెంబరు (పాత పేరు 7 వ నెంబరు) [[జాతీయ రహదారి]] మరియు [[సికింద్రాబాదు]]-[[ద్రోణాచలం]] రైల్వే లైను వెళ్ళుచున్నది. అమ్రాబాదు గుట్టలుగా పిల్వబడే కొండల సమూహం జిల్లా ఆగ్నేయాన విస్తరించి ఉంది. [[2001]] [[జనాభా]] గణన ప్రకారం ఈ జిల్లా జనసంఖ్య 35,13,934<ref>Handbook of Statistics, Mahabubnagar Dist-2009, published by CPO Mahabubnagar</ref>. జిల్లా వాయువ్యంలో వర్షపాతం తక్కువగా ఉండి తరుచుగా కరువుకు గురైతుండగా, ఆగ్నేయాన పూర్తిగా దట్టమైన అడవులతో నిండి ఉంది. అమ్రాబాదు, అచ్చంపేట, కొల్లాపూర్ మండలాలు [[నల్లమల అడవులలో]] భాగంగా ఉన్నాయి. నడిగడ్డగా పిల్వబడే కృష్ణా, తుంగభద్ర నదుల మధ్య ప్రాంతం కూడా నీటిపారుదల సమస్యతో ఉండగా, [[జూరాలా]] , దిండి ప్రాజెక్టు పరిసర ప్రాంతాలు సస్యశ్యామలంగా ఉన్నాయి.
 
==చరిత్ర==
* '''రాజా బహదూర్ వెంకట్రాం రెడ్డి''' : ప్రముఖ స్వాతంత్ర్యసమరయోధుడైన [[రాజా బహదూర్ వెంకట్రాం రెడ్డి]] మహబూబ్ నగర్ జిల్లాకు చెందినవాడు. నిజాంకు కొత్వాల్‌గా పనిచేసిన అనుభవం ఉంది. తరువాత గోల్కొండ పత్రికకు సంపాదకుడిగా పనిచేశాడు. [[హైదరాబాదు]] . ప్రజాచైతన్యం కల్గించడానికి అనేక విద్యాసంస్థలను స్థాపించాడు.
* '''వందేమాతరం రామచంద్రారావు''' : పాలమూరు జిల్లానుంచి స్వాతంత్ర్య సంగ్రామంలో చురుగ్గా పాల్గొన్న ప్రముఖ నేతలలో [[వందేమాతరం రామచంద్రారావు]] ఒకడు. ఇతని అసలు పేరు రామచంద్రయ్య. తొలుత [[గద్వాల]] సంస్థానంలో సబ్‌ఇన్స్‌పెక్టర్ ఉద్యోగంలో చేరి, ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి హిందూమహాసభలో చేరినాడు. పలుసార్లు జైలుశిక్ష అనిభవించాడు. విచారణ సమయంలో ఊరు, తండ్రిపేరు అడగగా అన్నింటికీ వందేమాతరం అనే సమాధానం ఇచ్చాడు. అందుచే జైలునుంచి విడుదల అనంతరం అందరూ వందేమాతరం రామచంద్రారావు అని పిల్వడం ప్రారంభించారు.
* '''బి.సత్యనారాయణరెడ్డి''' : 1927లో మహబూబ్‌నగర్ జిల్లా అన్నారంలో జన్మించాడు. స్వాతంత్ర్యోద్యమంలో మరియు నిరంకుశ నిజాం వ్యతిరేకోద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. 1990లో ఉత్తరప్రదేశ్ గవర్నరుగా, ఆ తర్వాత ఒడిషా గవర్నరుగా పనిచేశాడు. ఇదే కాలంలో బీహార్, పశ్చిమ బెంగాల్ ఇంచార్జి గవర్నరుగా కూడా విధులు చేపట్టాడు. అక్టోబరు2012 6,అక్టోబరు 2012న6న మరణించాడు
* '''హాస్టల్ రామారావు''' : స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని ప్రముఖ పాత్ర వహించిన పాలమూరు వ్యక్తి హాస్టల్ రామారావు అసలు పేరు సంతపూర్ రామారావు. [[కొల్లాపూర్]] మండలం అతని స్వస్థలం. స్వతంత్ర [[భారతదేశం]]లో కలిసేందుకు [[హైదరాబాదు]] సంస్థానం నిరాకరించడంతో నిజాం ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి[[1947]]లో అరెస్టు వారెంట్‌కు గురై రెండేళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళినాడు. స్వాతంత్ర్యం తరువాత [[నాగర్ కర్నూల్]]లో హరిజనుల కోసం హాస్టల్ ప్రారంభించి హరిజనోద్ధరణకు పాటుపడినందులకు అతని పేరు హాస్టల్ రామారావుగా స్థిరపడింది.
* '''గడియారం రామకృష్ణ శర్మ''' : పాలమూరు జిల్లాకు చెందిన రచయితలలో [[గడియారం రామకృష్ణ శర్మ]] ప్రముఖుడు. ఆయన రచించిన శతపత్రం పుస్తక రచనకు కేంద్ర [[సాహిత్య అకాడమీ]] అవార్డు లభించింది <ref>http://www.eenadu.net/district/districtshow1.asp?dis=mahaboobnagar#1 తీసుకున్న తేది 27.12.2007</ref>. ఇతడు [[1919]]లో [[అనంతపురం]] జిల్లాలో జన్మించి పాలమూరు జిల్లాలోని [[ఆలంపూర్]]లో స్థిరపడ్డాడు. [[2006]] [[జూలై]]లో మరణించాడు. అతడు రచించిన పుస్తకాలలో మాధవిద్యారణ్య చరిత్ర ప్రముఖమైనది.
==విద్యారంగం==
మహబూబ్ నగర్ జిల్లాలో 1875 లోనే [[మొగిలిగిద్ద]] గ్రామంలో ప్రభుత్వ పాఠశాల స్థాపించబడింది. జిల్లాలో [[1955]]-[[1956|56]] నాటికి 1160 ప్రాథమిక పాఠశాలలు, 20 ప్రాథమికోన్నత పాఠశాలలు, 5 ఉన్నత పాఠశాలలు ఉండగా, [[2006]]-[[2007|07]] నాటికి ఈ సంఖ్య పెరిగి 2860 ప్రాథమిక, 987 ప్రాథమికోన్నత, 729 ఉన్నత పాఠశాలలు, 82 జూనియర్ కళాశాలకు చేరింది.<ref>ఈనాడు దినపత్రిక జిల్లా ఎడిషన్ తేది 26.01.2008 పేజీ సంఖ్య 8</ref> [[2008]]-[[2009|09]] నాటికి ఈ సంఖ్య 3094 ప్రాథమిక, 890 ప్రాథమికోన్నత, 926 ఉన్నత పాఠశాలలు, 147 జూనియర్ కళాశాలకు చేరింది.
ఇవే కాకుండా 45 డీగ్రీ కళాశాలలు, 9 పీజీ కళాశాలలు, 39 బీఎడ్ కళాశాలలు, 7 డైట్ కళాశాలలు, 19 ఐటీఐలు, 3 పాలిటెక్నిక్ కళాశాలలు, 3 ఇంజనీరింగ్ కళాశాలలు, 6 ఫార్మసీ కళాశాలలు, 3 ఎంబీఏ కళాశాలలు, 3 ఎంసీఏ కళాశాలలు, ఒక మెడికల్ కళాశాల, ఒక వ్యవసాయ కళాశాల ఉన్నాయి. 2008 లో [[పాలమూరు విశ్వవిద్యాలయం]] స్థాపించబడింది.పాలమూరు విశ్వవిద్యాలయం దేశంలోనే 'లార్జెస్ట్ బేర్ ఫుట్ వాక్'అనే అంశంలో గిన్నిస్ రికార్డు సాధించిన తొలి విశ్వవిద్యాలయంగా వాసికెక్కింది. జాతీయసేవాపథకం విభాగంలో ఈ రికార్డు ఆంగ్ల భాషలో గిన్నిస్ రికార్డు గ్రహీత అయిన డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి ఆధ్వర్యంలో 2010 నవంబర్ 12, 2010 న 2,500 మంది పాల్గొని నిర్వహించారు.ఈ రికార్డు సాధించడం ద్వారా రాష్ట్రానికి చెందిన ప్రశంస బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు పాలమూరు విశ్వవిద్యాలయాన్ని 'మహా మహా'అనే బిరుదునిచ్చి గౌరవించారు.
 
==సాహిత్యం==
సంస్థానాల కాలంలోనే పాలమూరు జిల్లా సాహిత్యంలో ప్రసిద్ధి చెందింది. గద్వాల సంస్థానాధీశులు ఎందరో సాహితీవేత్తలను పోషించుకున్నారు. స్వయంగా గద్వాల పాలకులు సాహిత్యం కూడా రచించారు. సంస్థానాధీశుల కాలంలో విద్వత్ గద్వాలగా పేరుగాంచింది. స్వాతంత్ర్యోద్యమ కాలంలో [[సురవరం ప్రతాపరెడ్డి]] గోల్కొండ కవుల పేరుతో గ్రంథాన్ని వెలువరించాడు. ఆలంపూర్ ప్రాంతానికి చెందిన గడియారం రామకృష్ణశర్మ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందినాడు. తెలుగులో తొలి రామాయణం "రంగనాథ రామాయణం" రచించినది జిల్లాకు చెందిన గోనబుద్ధారెడ్డి.<ref>పాలమూరు సాహితీ వైభవం, రచన ఆచార్య ఎస్వీ రామారావు, ముద్రణ 2010, పేజీ 8</ref> హైదరాబాదు ముఖ్యమంత్రిగా పనిచేసిన బూర్గుల రామకృష్ణారావు కూడా అనేక కావ్యాలు, అనువాదాలు, కవితలు రచించారు.<ref>పాలమూరు ఆధునిక యుగ కవుల చరిత్ర, రచన ఆచార్య ఎస్వీ రామారావు, ముద్రణ సెప్టెంబరు 2012, పేజీ 14</ref> [[గడియారం రామకృష్ణ శర్మ]], [[కపిలవాయి లింగమూర్తి]] లాంటి సాహితీమూర్తులు పాలమూరు జిల్లాకు చెందినవారు.
16 అక్తొబర్ 2000 లో సీనియర్ జర్నలిస్ట్ కొటకొండ యెడ్ల విజయరాజు అద్వరయములో నారాయణపెటలో వార్తతరంగాలు తెలుగు పత్రిక ప్రారంబించడము జరిగింది.అప్పటి మంత్రి యెల్కొటి యల్లరెడ్ది, మాజి యెమ్మెల్యె చిట్టం నర్సిరెడ్డి,కొదంగల్ యెమ్మెల్యె సుర్యనారాయణ,బిజెపి నాయకుడు నాగురవు నామజి,అప్పటీ మునిసిపాల్ చైర్మన్ గడ్డం సాఇబన్న తదితరులు పాల్గొన్నరు.
142004 జనవరి 200414 లో మహబూబ్ నగర్ జిల్లా కెంద్రంగ వార్తతరంగాలు పత్రికను దిన పత్రికగా మార్చడము జరిగింది.ప్రస్తతము రాస్ట్రా రాజధాని నుండి కూడా పత్రిక ప్రింట్ అవుతుంది.
మన కాలాపు మహానియుడూ ప్రజ కవి గోరెటీ వేంకన్న పాలమురు బిడ్డే ఆన్నసంగథి మరువొద్దు.
 
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2124900" నుండి వెలికితీశారు