మాగంటి బాపినీడు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆగష్టు → ఆగస్టు using AWB
పంక్తి 2:
'''మాగంటి బాపినీడు''' స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న అగ్రశ్రేణి నాయకుడు. తెలుగులో [[విజ్ఞాన సర్వస్వము|విజ్ఞాన సర్వస్వాన్ని]] "[[ఆంధ్ర సర్వస్వము]]" అన్న పేరుతో ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చి ప్రచురించాడు. [[ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం]] కోసం పోరాడిన తొలితరం నాయకులలో ఒకడు. ఇతని భార్య [[మాగంటి అన్నపూర్ణాదేవి]] కూడా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నది. ఆమె మంచి [[రచయిత్రి]], సమాజ సేవిక.
 
బాపినీడు 1895లో ఆగష్టుఆగస్టు 14న [[చాటపర్రు]] గ్రామంలో ఒక [[వ్యవసాయం|వ్యవసాయ]] కుటుంబంలో జన్మించాడు. [[కె. వెంకటరత్నంరెడ్డి]] వంటి సంఘసంస్కర్తల ప్రభావం, డాక్టర్ [[భోగరాజు పట్టాభి సీతారామయ్య]] వంటి రాజకీయ నాయకుల ప్రభావం అతనిపై బలంగా పడింది. ముందు చూపు కలిగిన అతని కుటుంబం [[కలకత్తా]]లో అతని విద్యాభ్యాసానికి ఏర్పాటు చేసింది. అక్కడ అనేక రచయితల పరిచయం లభించింది. తరచు [[శాంతినికేతన్]] సందర్శించేవాడు. తరువాత అతను "ఇండియన్ డిఫెన్సు కార్ప్స్"లో చేరాడు. అలాంటి మిలిటరీ శిక్షణ పొందిన మొదటి [[ఆంధ్రుడు]] అతనే.
[[కలకత్]]తాలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనేవాడు. [[బెంగాల్]] ఆంధ్రా అసోసియేషన్‌కు కార్యదర్శిగా పని చేశాడు. తరువాత అతను అన్నపూర్ణాదేవిని పెండ్లాడాడు.
 
"https://te.wikipedia.org/wiki/మాగంటి_బాపినీడు" నుండి వెలికితీశారు