మావో జెడాంగ్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సెప్టెంబర్‌ → సెప్టెంబరు, యూరప్ → ఐరోపా, లో → లో (15), ను using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సెప్టెంబర్ 9,1976 → 1976 సెప్టెంబర్ 9, సెప్టెంబర్ → సెప్టెంబర using AWB
పంక్తి 22:
}}
 
'''మావో జెడాంగ్''' (Mao Zedong) (జననం: డిసెంబర్డిసెంబరు 26, [[1893]]-మరణం: సెప్టెంబర్1976 సెప్టెంబరు 9,1976) ను మావో సే టుంగ్ (Mao Tse-tung) అని కూడా పలుకుతుంటారు. [[1949]]లో [[చైనా]]లో కమ్యూనిష్టు ప్రభుత్వం ఏర్పడి [[పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా]] (PRC) స్థాపనకు మూలమైన సుదీర్ఘ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించాడు మావో. అప్పటి నుండి [[1976]]లో మరణించే వరకు ఈయన చైనాను పరిపాలించాడు. ఆధునిక ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రభావ వంతమైన వ్యక్తులలో మావో కూడా ఒకరు. మావో చైనా యొక్క సైనిక, పారిశ్రామిక, వ్యావసాయిక, మేధోపరమైన మరియు సాంస్కృతిక పరమైన అన్ని ప్రణాళికలను నియంత్రించాడు.
 
కమ్యూనిష్టులు [[చైనా]]లో అధికారంలోకి వచ్చిన తరువాత మావో ప్రపంచమంతటా సుపరిచితుడు అయ్యాడు. చైనాలో పిన్నలు, పెద్దలు ఆయన నినాదాలను మరియు ఆయన రచనలను అధ్యయనం చేసారు. [[గెరిల్లా యుద్ధం]] మరియు సామ్యవాద విప్లవాలలో రైతాంగం యొక్క పాత్ర మొదలైన అంశాల గురించి ఆయన రచనలు చైనా వెలుపల చాలా ప్రభావం చూపాయి. [[మావో]] ఒక కవి కూడా.
పంక్తి 32:
[[చైనా]] ఆ రోజులలో అనేక మంది ప్యూడల్ యుద్ధ ప్రభువుల ఆధీనంలో చిన్న చిన్న భాగాలుగా విభజింపబడి ఉండేది. వీరందరినీ తుదముట్టించి చైనాను ఏకీకృతం చేయుటకు కమ్యూనిష్టులు మొదట [[సన్ యెట్ సెన్]] నాయకత్వంలోని ''[[కొమింటాంగ్]]'' అనబడే ఒక జాతీయ పార్టీతో కలసి కృషి చేశారు. కానీ [[1925]]లో సన్ యెట్ సెన్ మరణించిన తరువాత కొమింటాంగ్ పార్టీకి [[చియాంగ్ కైషెక్]] నాయకుడయ్యాడు. ఇతనితో కమ్యూనిష్టులకు సయోధ్య కుదరలేదు. వీరి మధ్య ఘర్షణ త్వరలోనే యుధ్దంగా మారింది. దీనితో మావో మరి కొంతమంది కమ్యూనిష్టు నాయకులతో కలసి తమ సైన్యాన్ని [[1928]]లో జియాంగ్జి రాష్టానికి తరలించాడు. [[1931]] నుండి చియాంగ్ ఈ సైన్యం మీద అనేకసార్లు దాడులు చేసి కమ్యూనిష్టులను తీవ్రంగా నష్టపరిచాడు. దానితో [[1934]]లో మావో కమ్యూనిష్టు సైన్యాన్ని షాంగ్జీ (షెన్సీ) రాష్ట్రానికి తరలించాడు. ఈ తరలింపు చరిత్రలో ''[[లాంగ్ మార్చ్]] ''గా ప్రసిద్ధి చెందినది. ఇది ఒక సంవత్సర కాలం పైగా పట్టిన 9,700 కిలో మీటర్ల సుదీర్ఘమైన నడక. మార్గమధ్యంలో అనేక మంది చనిపోయారు.
 
[[1931]]లో [[జపాన్]] [[చైనా]] లోని [[మంచూరియా]] ప్రాంతం మీద దండెత్తినది. [[1937]]లో జపాన్ పూర్తి స్థాయి యుద్ధానికి తెరతీసింది. కమ్యూనిష్టులు కొమింటాంగ్ పార్టీ జాతీయ సైన్యంతో మరలా కలసి జపాన్‌ను ఎదుర్కొన్నారు. [[రెండవ ప్రపంచ యుద్ధం|రెండవ ప్రపంచ యుద్ధ]] సమయంలో కొమింటాంగ్ సైన్యాలు దేశం లోపలి ప్రాంతాలకు తరిమి వేయబడటంతో మావో తన గెరిల్లా యుద్ధ తంత్రంతో [[1945]] కల్లా చైనా లోని అధిక ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు. [[1946]]లో మంచూరియా ప్రాంతంలో కమ్యూనిష్టులకు జాతీయ సైన్యానికి యుద్ధం ప్రారంభమైనది. [[1949]] అక్టోబర్అక్టోబరు కల్లా కమ్యూనిష్టులు చైనాను పూర్తిగా ఆక్రమించుకుని [[పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా]]ను స్థాపించారు. కొమింటాంగ్ పార్టీ [[తైవాన్]] వరకే తన అధికారాన్ని పరిమితం చేసుకున్నది.
 
అధికారంలోకి రాగానే మావో [[సోవియట్ యూనియన్]]తో స్నేహం చేసి వారి సహాయంతో చైనా సైన్యాన్ని బలోపేతం చేసాడు. [[1950]]-53 మధ్య జరిగిన [[కొరియా యుద్దం]]లో సామ్యవాద దేశమైన [[ఉత్తర కొరియా]]కు మావో సహాయం చేసాడు.
"https://te.wikipedia.org/wiki/మావో_జెడాంగ్" నుండి వెలికితీశారు