మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: డిసెంబర్ → డిసెంబరు (2), ధృవ → ధ్రువ, విద్యార్ధు → విద్యా using AWB
పంక్తి 1:
[[బొమ్మ:Telengana.png|thumb|ఆంధ్ర ప్రదేశ్ లో తెలంగాణా (తెలుపు రంగుతో సూచించబడినది) ]]
ఆంధ్ర, [[తెలంగాణ]] ప్రాంతాలు కలిసి [[ఆంధ్ర ప్రదేశ్‌ అవతరణ|ఆంధ్ర ప్రదేశ్]] ఏర్పాటు కావడంలో కీలకమైనది [[పెద్దమనుషుల ఒప్పందం]]. [[1956]], [[ఫిబ్రవరి 20]] న కుదిరిన ఈ ఒప్పందంలో తెలంగాణ అభివృద్ధికి, తెలంగాణ సమానత్వ పరిరక్షణకు సంబంధించిన నిబంధనలు ఉన్నాయి. ఆంధ్ర, హైదరాబాదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖ మంత్రులు, రెండు ప్రాంతాల కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు ఈ ఒప్పందంపై సంతకాలు చేసారు. ఈ ఒప్పందాన్ననుసరించి [[1956]], [[నవంబర్ 1]] న [[ఆంధ్రప్రదేశ్]] ఏర్పడింది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన [[నీలం సంజీవరెడ్డి]] ముఖ్యమంత్రి అయ్యారు.
 
అయితే, ఈ ఒప్పందం అమలు విషయమై కొద్దికాలంలోనే తెలంగాణా ప్రజల్లో అసంతృప్తి బయలుదేరింది. ఒప్పందాన్ననుసరించి ఉప ముఖ్యమంత్రి పదవిని తెలంగాణా వాసికి ఇవ్వలేదు; అసలు ఆ పదవినే సృష్టించలేదు. అయితే [[1959]]లో [[దామోదరం సంజీవయ్య]] ముఖ్యమంత్రి కాగానే ఉప ముఖ్యమంత్రిగా తెలంగాణా ప్రాంతానికి చెందిన [[కె.వి.రంగారెడ్డి|కొండా వెంకట రంగారెడ్డి]] (కె.వి.రంగారెడ్డి) ని నియమించాడు. అయితే మళ్ళీ [[1962]] నుండి [[1969]] వరకు ఉపముఖ్యమంత్రి పదవి లేదు. మళ్ళీ 1969లో తెలంగాణా ప్రాంతానికి చెందిన [[జె.వి.నర్సింగరావు]]ను ఉపముఖ్యమంత్రిగా నియమించారు.
పంక్తి 20:
తెలంగాణా ఉద్యమం '''తెలంగాణా హక్కుల పరిరక్షణ ఉద్యమం''' గా మొదలైంది. తెలంగాణా రక్షణలను అమలు చెయ్యాలని కోరుతూ [[1969]], [[జనవరి 9]] న [[ఖమ్మం]] పట్టణంలో బి.ఎ. స్టూడెంట్‌, నేషనల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ నాయకుడైన రవీంధ్రనాథ్‌ గాంధీచౌక్‌ దగ్గర నిరవధిక దీక్ష ప్రారంభించాడు. ఆరోజు జరిగిన ఊరేగింపులో హింసాత్మక ఘటనలు జరిగాయి. మరుసటి రోజు ఉద్యమం [[నిజామాబాదు]]కు పాకింది. జనవరి 10 న హైదరాబాదులోని [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]]లో జరిగిన విద్యార్థుల సమావేశంలో - తెలంగాణా రక్షణల అమలుకై జనవరి 15 నుండి సమ్మె చెయ్యాలని ప్రతిపాదించారు.
 
అయితే, [[జనవరి 13]] న అదే విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక సమావేశంలో విద్యార్థులలోని ఒక వర్గం "తెలంగాణా విద్యార్ధులవిద్యార్థుల కార్యాచరణ సమితి"గా ఏర్పడి, ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధనే తమ ధ్యేయంగా ప్రకటించారు. అదే రోజున పురప్రముఖులు కొందరు "తెలంగాణా పరిరక్షణల కమిటీ"ని ఏర్పాటు చేసారు.
 
జనవరి 18 న విద్యార్థుల్లోని రెండు వర్గాలు (తెలంగాణా రక్షణల కోసం ఉద్యమించిన వారు, ప్రత్యేక తెలంగాణా కోరేవారు) వేరువేరుగా హైదరాబాదులో ఊరేగింపులు జరిపారు. ఈ రెండు ఊరేగింపులు ఆబిద్స్ లో ఎదురైనపుడు ఘర్షణ చెలరేగింది. పోలీసులు లాఠీఛార్జి చెయ్యవలసి వచ్చింది. అదేరోజు శాసనసభలోని ప్రతిపక్ష పార్టీలు తెలంగాణా రక్షణల అమలు కొరకు ప్రభుత్వాన్ని వత్తిడి చేసాయి.
పంక్తి 55:
అదనపు ఉద్యోగాల విషయమై తెలంగాణా ఉద్యోగ సంఘాలు నిరసన వ్యక్తం చెయ్యగా, ముల్కీ నిబంధనల పై ఆంధ్ర ప్రాంతంలో నిరసనగా సమ్మెలు జరిగాయి.
 
1969, [[మార్చి 7]]: ముల్కీ నిబంధనల అమలుపై మునుపు తనిచ్చిన స్టేను ధృవీకరిస్తూధ్రువీకరిస్తూ, అదనపు పోస్టుల సృష్టించడాన్ని కూడా నిలిపివేసింది.
 
1969, [[మార్చి 29]]: సుప్రీంకోర్టు ఇలా తీర్పు ఇచ్చింది:
పంక్తి 80:
[[అక్టోబర్ 10]] నుండి తెలంగాణా అంతటా, చెన్నారెడ్డి పిలుపుమేరకు సత్యాగ్రహాలు మొదలయ్యాయి. ఇందులో 18 ఏళ్ళలోపు విద్యార్థులు పాల్గొనరాదని నిబంధన పెట్టారు. ఆ రోజునుండి మల్లికార్జున్ నిరాహారదీక్ష మొదలు పెట్టాడు. [[నవంబర్ 3]] వరకు కొనసాగిన ఈ దీక్ష పోలీసులు ఆయనను అరెస్టు చేసి, ఆసుపత్రిలో చేర్చడంతో ముగిసింది.
 
1969 [[నవంబర్ 26]] చెన్నారెడ్డి ఒక ప్రకటన చేస్తూ విద్యార్థులు పరీక్షలలోను, గ్రామీణులు వ్యవసాయపు పనులలోను నిమగ్నమై ఉన్నందున, ఉద్యమంలో స్తబ్దత వచ్చిందని అన్నాడు. మరుసటిరోజు మరో ప్రకటనలో ప్రస్తుతానికి ఉద్యమాన్ని వాయిదా వేస్తున్నట్లూ, మళ్ళీ జనవరి 1 నుండి ప్రారంభిస్తున్నట్లు తెలియజేసాడు. ఈ ప్రకటనతో ఉద్యమం ముగిసినట్లైంది. డిసెంబర్డిసెంబరు 6న తెలంగాణా ప్రజాసమితి నాయకులు టి.ఎన్.సదాలక్ష్మి, మరో ముగ్గురు ఒక సంయుక్త ప్రక టనలో చెన్నారెడ్డిని ప్రజాసమితి అధ్యక్ష పదవి నుండి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ప్రజాసమితిలోని మిగిలిన నాయకులెవరూ వీరికి మద్దతు నివ్వలేదు.
 
ఈ విధంగా 1969 సెప్టెంబర్ నుండి, 1969 డిసెంబర్డిసెంబరు వరకు రాజకీయనాయకుల ఎత్తులు పైయెత్తుల మధ్య, ఉద్యమం తీవ్రత తగ్గుతూ వచ్చి చివరికి పూర్తిగా చల్లారిపోయింది. తెలంగాణా ప్రజాసమితి మరో రెండేళ్ళు రాజకీయాల్లో ఒక శక్తిగా చురుగ్గానే ఉంది. 1971 లో పార్లమెంటుకు జరిగిన మధ్యంతర ఎన్నికలలో 10 సీట్లు సాధించింది. అయితే ఆ ఎన్నికల్లో ఇందిరా గాంధీకి సంపూర్ణ ఆధిక్యత రావడంతో తెలంగాణా ప్రజాసమితి మద్దతు కీలకం కాలేదు. [[1971]] [[సెప్టెంబర్ 24]] న బ్రహ్మానంద రెడ్డి రాజీనామా చేసాక కొద్దిరోజులకు చెన్నారెడ్డి తెలంగాణా ప్రజా సమితిని రద్దు చేసాడు.
 
==ఇతర విశేషాలు==