రుద్రమ దేవి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గంను → గాన్ని , లో → లో , కూడ → కూడా , దృతి → ధృతి, ప్రతిష using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నవంబర్ → నవంబరు (3), భారత దేశము → భారతదేశము using AWB
పంక్తి 13:
రుద్రమదేవికి గల ఇతర బిరుదులు: రాయగజకేసరి, ఘటోధృతి.
 
ప్రఖ్యాత పథికుడు [[మార్కో పోలో]] [[ఛైనా]] దేశమునుండి తిరిగివెళ్ళుతూ దక్షిణభారత దేశముదక్షిణభారతదేశము సందర్శించి రుద్రమదేవి గురించి, ఆమె పాలన గురించి బహువిధముల పొగిడాడు. మోటుపల్లి రేవునుండి కాకతీయుల సముద్ర వ్యాపారము గురించి కూడా వివరముగా వ్రాశాడు<ref>The Travels of Marco Polo: The Complete Yule-Cordier Edition, Translated by Henry Yule, 1993,Courier Dover Publications; ISBN 0486275876</ref>.
 
అయితే ఇంకా...కాస్త విపులంగా చెప్పాలంటే ...
పంక్తి 38:
మన రుద్రమ అసమాన పరాక్రమశాలి. కాకతీయ పాలకుల వైభవానికి సమున్నత కేతనం. రుద్రమ్మ భుజశక్తి, ధీయుక్తితో శత్రువుల పాలిట సింహ స్వప్నమైంది. అంతఃశత్రువులు, బయటి శత్రువుల కుట్రలు, కుతంత్రాలెన్నో సమర్థంగా ఎదుర్కొన్న వీరవనిత. సామ్రాజ్యాన్ని దక్షిణాన [[తమిళనాడు]]లోని [[కంచి]] నుంచి ఉత్తరాన చత్తీస్ఘడ్ బస్తర్ సీమ వరకు, పడమరన బెడదనాడు నుంచి తూర్పున సముద్రం వరకు, ఈశాన్యంలో [[గంజాం]].. అంటే అస్సోం వరకు కాకతీయ సామ్రాజ్యాన్ని విస్తరింపజేసింది. బలవంతులదే రాజ్యమన్న మధ్యయుగాల్లోనే రుద్రమ దక్షిణాపథంలో సువిశాల మహాసామ్రాజ్యాన్ని నెలకొల్పింది. ఆమె సాహసానికీ, ధీరత్వానికీ, తెగువకూ, పాలనా దక్షతకూ మారు పేరుగా నిలిచింది. తెలంగాణ మహిళ పాలనా పటిమను, మన జాతి ఖ్యాతిని విశ్వవిఖ్యాతం చేసింది.
==ఎప్పుడు చనిపోయింది?==
రుద్రమ తన ప్రసిద్ధ సేనాని గోన గన్నారెడ్డితో కలిసి కర్ణాటక, ఆంధ్ర సరిహద్దులో పలు దుర్గాలు వశపరుచుకుంది. గోన గన్నారెడ్డి వారి రాజ్యరక్షామణియైన విఠలనాథ దండనాథుడు మాలువ, హాలువ మొదలైన దుర్గాలు సాధించిన తర్వాత సర్వరాష్ట్ర సమస్త ప్రజారక్షణ కోసం [[రాయచూరు]]లో దుర్గం నిర్మించినట్లు అతని శాసనం (1294) చెబుతోంది. రాయచూరు విజయం రుద్రమ దేవి కడపటి విజయమని భావిస్తున్నారు. కావున 1295 ప్రాంతమున మహారాజ్ఞి రుద్రమ శివసాయుజ్యం చెందిందని చరిత్రకారులు చెబుతున్నారు. కానీ ఇటీవల వెలుగులోకి వచ్చిన నల్లగొండ జిల్లా చందుపట్ల శాసనంలో రుద్రమదేవి 1289 నవంబర్నవంబరు 27న మరణించినట్లు అవగతమవుతున్నది. దీనిని ఇతర శాసనముల సాక్ష్యముతో సమన్వయించి నిర్ధారించవలసి ఉంది.
==అంబదేవుని దొంగదెబ్బ==
అనేకసార్లు ఓటమి పాలైన సామంతరాజు అంబదేవుడు రుద్రమదేవిపై కక్షగట్టాడు. రుద్రమకు వ్యతిరేకంగా సామంతులను సమీకరించాడు. అదునుకోసం చూస్తున్న అంబదేవుడికి సమయం కలిసి వచ్చింది. రుద్రమ రాజ్యంపైకి పాండ్యులు, చోళులు, ఇతర సామంతులు ముప్పేట దాడికి దిగారు. దాన్ని అదనుగా తీసుకున్న అంబదేవుడు కుట్రలు, కుతంత్రాలతో ఇతర సామంత రాజులను ఏకం చేశాడు. రుద్రమకు అండగా నిలవాల్సిన తమ సేనలను రుద్రమపైకి ఎక్కుపెట్టాడు. అంబదేవుడి కుట్ర తెలుసుకున్న రుద్రమ అపర భద్రకాళి అయి కత్తి పట్టి కదన రంగాన దూకింది.
పంక్తి 45:
కాకతీయుల పేరు చెప్పగానే ముందుగా స్మరణకు వచ్చే రాణి రుద్రమదేవి చరిత్ర. కాకతీయుల్లోనే రాయగజకేసరి బిరుదాంకితురాలై కీర్తింపబడిన రుద్రమదేవి జీవిత చరమాంకం ఏ విధంగా ముగిసిందో చరిత్రలో ఎక్కడా రాయలేదు. కానీ నల్లగొండ జిల్లా [[నకిరేకల్]] మండలంలోని చందుపట్ల గ్రామం రాణీ రుద్రమాదేవి జీవిత చరమాంకానికి సంబంధించిన చారిత్రక అవశేషాలను దాచుకొంది. రాణీ రుద్రమాదేవి ఇదే గ్రామంలో చనిపోయిందని తెలిపే శిలాశాసనాలు చాలాకాలం తర్వాత బయటపడ్డాయి.
==రుద్రమదేవి మరణశాసనం ==
ఉస్మానియా యూనివర్శిటీలో.. తెలుగు రీసెర్చ్ స్కాలర్ గా పనిచేస్తున్న సైదులు.. కాకతీయ రుద్రమాదేవి మరణానికి సంబంధించిన చారిత్రిక ఆధారాల కోసం అన్వేషించసాగాడు. ఇందులో భాగంగానే.. చందుపట్ల గ్రామంలో మట్టిలో కూరుకుపోయిన శాసనాన్ని గుర్తించి పురావస్తు శాఖాధికారుల సహాయంతో.. వెలికితీయించి అది రుద్రమదేవి మరణశాసనంగా గుర్తించారు. విరోధనామ సంవత్సరం ద్వాదశి రోజున అంటే.. 1289వ సంవత్సరం, నవంబర్నవంబరు 27వ తేదీన రాణీ రుద్రమదేవి వీరమరణం పొందినట్లుగా శాసనంపై లిఖించినట్లు వెల్లడైందని తేలింది.
==అంబదేవుడి రుద్రమ చేతిలో వీరమరణం ==
నల్లగొండ సమీపంలోని పానగల్లుకు వస్తోన్న క్రమంలోనే చందుపట్ల కాపర్తి అయిన అంబదేవుడి చేతిలో వీరమరణం పొందినట్లు శిలాశాసనం ద్వారా వెల్లడవుతోంది. రాణి రుద్రమతోపాటు.. ఆమె సైన్యాధ్యక్షుడు మల్లిఖార్జున నాయుడు కూడా అక్కడ చనిపోయినట్లు ఆధారాలు వెల్లడిస్తున్నాయి. అయితే.. ఈ శాసనాన్ని రాణిరుద్రమ సేవకుడు పువ్వుల ముమ్మడి అనే వ్యక్తి వేయించినట్లు తెలుస్తోంది. ఈ శాసనం బైటపడేవరకు.,. రాణి రుద్రమదేవి మరణించిన తేదీల విషయం ప్రపంచానికి తెలియదు. ఈ శాసనం ఆధారంగా 1289 నవంబర్నవంబరు 27న రుద్రమదేవి చనిపోయినట్లుగా నిర్ధారణ అయ్యింది.
 
"https://te.wikipedia.org/wiki/రుద్రమ_దేవి" నుండి వెలికితీశారు