"భారతదేశంలో మధ్య ప్రాచీన శిలాయుగం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
===పనిముట్ట్టు తయారీకి కావలిసిన రాయిని ఎంచుకోవడంలో మార్పు===
ఈ కాలం నాటి పనిముట్లు సాధారణంగా చెర్ట్ (Chert), జాస్పర్ (Jasper), కాల్సేడనీ (Chalcedony), క్వార్ట్జ్ (Quartzite) వంటి కఠిన శిలల నుండి తయారు చేయబడ్డాయి. అంటే వీరు ఒకవైపు పూర్వ దశలో ఉపయోగించిన క్వార్జైట్ (Quartzite), క్వార్ట్జ్ (Quartz), బసాల్ట్ (Basalt) వంటి శిలలను కొనసాగిస్తూనే అదనంగా చెర్ట్ (Chert), జాస్పర్ (Jasper), కాల్సేడనీ (Chalcedony) వంటి ఇసుకరాయిలను కూడా ఉపయోగించారు. అయితే వీరికి ఎముకతో గాని, దంతాలతో గాని పనిముట్లు చేయడం ఇంకా తెలీదనే చెప్పాల్సివుంటుంది.
 
==భారత దేశంలో మధ్య ప్రాచీన శిలాయుగానికి చెందిన ప్రధాన ఆవాసాలు==
భారత దేశమంతటా మధ్య ప్రాచీన శిలాయుగ ఆవాసాలు వైవిధ్య పూరితమైన పర్యావరణ వ్యవస్థలలో బయల్పడాయి. పీఠభూములలోను (చోటా నాగపూర్, దక్కన్ పీఠభూములలో), మైదానాల్లోనూ, తీర వ్యవస్థలలోను వ్యాపించి వున్నాయి.
 
===నెవాసన్ సంస్కృతి (Nevasa Culture)===
పూర్వ ప్రాచీన శిలాయుగ సంస్కృతి, ఉత్తర ప్రాచీన శిలాయుగ సంస్కృతి లవలె కాకుండా భారతదేశంలో మధ్య ప్రాచీన శిలాయుగ సంస్కృతి స్పష్టంగా గుర్తించబడలేదు. అయినప్పటికీ భారతదేశంలో మధ్య ప్రాచీన శిలాయుగ సంస్కృతిని నెవాస సంస్కృతి అని వ్యవహరిస్తారు. నెవాస ప్రాంతం గోదావరికి ఉపనది అయిన ప్రవర నది తీరంలో వుంది. మహారాష్ట్ర లోని ఈ నెవాసా (Nevasa) ప్రాంతంలో 'ప్రవర' నదీ లోయ ప్రాంతంలో పెచ్చుతో చేసిన పనిముట్లు [గోకుడు రాళ్ళు (Scrapers), చెక్కుడు రాళ్ళు , బ్యూరిన్‌లు, రంధ్రకాలు (Borers) వంటివి] అధిక సంఖ్యలో దొరికాయి. నెవాసా లో ప్రాచీన శిలాయుగాలకు చెందిన రెండు దశలకు (పూర్వ మరియు మధ్య) చెందిన పరికరాలు కూడా లభించాయి.
 
 
==మూలాలు==
7,316

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2125565" నుండి వెలికితీశారు