"భారతదేశంలో మధ్య ప్రాచీన శిలాయుగం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
పూర్వ ప్రాచీన శిలాయుగ సంస్కృతి, ఉత్తర ప్రాచీన శిలాయుగ సంస్కృతి లవలె కాకుండా భారతదేశంలో ''మధ్య'' ప్రాచీన శిలాయుగ సంస్కృతి స్పష్టంగా గుర్తించబడలేదు. అయినప్పటికీ భారతదేశంలో మధ్య ప్రాచీన శిలాయుగ సంస్కృతిని నెవాస సంస్కృతి అని వ్యవహరిస్తారు. నెవాస ప్రాంతం గోదావరికి ఉపనది అయిన ప్రవర నది తీరంలో వుంది. 1956 లో సంకాలియా చేసిన అన్వేషణలో మహారాష్ట్ర లోని నెవాసా (Nevasa) ప్రాంతంలో 'ప్రవర' నదీ లోయ ప్రాంతంలో మధ్య ప్రాచీన శిలాయుగానికి చెందిన 'పెచ్చుతో చేసిన పనిముట్లు' [గోకుడు రాళ్ళు (Scrapers), చెక్కుడు రాళ్ళు , బ్యూరిన్‌లు, రంధ్రకాలు (Borers) వంటివి] అధిక సంఖ్యలో దొరికాయి. నెవాసా లో ప్రాచీన శిలాయుగాలకు చెందిన రెండు దశలకు (పూర్వ మరియు మధ్య) చెందిన పరికరాలు కూడా పుష్కలంగా లభించాయి.
 
==='''ఆంద్రప్రదేశ్‌లో మధ్య ప్రాచీన శిలాయుగ సంస్కృతికి చెందిన ముఖ్య ప్రదేశాలు'''===
ఆంధ్రపదేశ్‌లో అనేక ప్రాంతాలలో ముఖ్యంగా కృష్ణా, గోదావరి, పెన్నా, తుంగభద్ర, స్వర్ణముఖి మొదలగు నదీలోయలలోను, పాలేరు, గుండ్లేరు, గుంజాన, సగిలేరు, కుందేరు, రాళ్ళకాలువ, చెయ్యేరు మొదలగు సెలయేటి తీరాలలోను మధ్య ప్రాచీన శిలాయుగ సంస్కృతికి చెందిన అనేక పనుముట్లు లభించాయి.
{| class="wikitable"
|-
!జిల్లా
|'''మధ్య ప్రాచీన శిలాయుగ సంస్కృతికి చెందిన పనిముట్లు బయల్పడిన ప్రదేశాలు'''
|-
|కృష్ణ||[[తిరుమల గిరి (జగ్గయ్యపేట)]], [[తుమ్మలపాలెం (ఇబ్రహీంపట్నం)]], [[లింగగూడెం (పెనుగంచిప్రోలు)]]
|-
|గుంటూరు||[[కారంపూడి]] (పల్నాడు), [[నాగార్జునసాగర్]], [[నాగార్జున కొండ]]
|-
|ప్రకాశం||[[గిద్దలూరు]], [[సింగరాయకొండ]], కాట్రేటిపురం (కందుకూరు), [[దోర్నాల]], [[కనిగిరి]]
|-
|నెల్లూరు||పగడాలపల్లి (గూడూరు), రాచర్లపాడు, [[సోమశిల (అనంతసాగరం మండలం)|సోమశిల]], [[ఉదయగిరి]], [[కావలి]]
|-
|కడప||[[ముద్దనూరు]] ,[[మైదకూరు]], నందిపల్లి, [[నారాయణ నెల్లూరు]], [[పాలకొండ]], [[ఎగువ తంబళ్లపల్లె]], [[తుమ్మచెట్లపల్లి]], [[వేముల]],
|-
|కర్నూలు||[[శాతనకోట|సాతానికోట]], కుడవెల్లి వీరాపురం (నందికొట్కూరు), మురవకొందాడ (నందికొట్కూరు), [[శ్రీశైలం]], [[వెల్దుర్తి]]
|-
|చిత్తూరు||[[రేణిగుంట]], [[చంద్రగిరి]]
|}
==మూలాలు==
7,316

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2125607" నుండి వెలికితీశారు