భారతదేశంలో మధ్య ప్రాచీన శిలాయుగం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
అయితే పై మూడు దశలలో ఏ ఒక్క దానికి కూడా ప్రత్యేక పరిధి అంటూ ఏదీ లేదు. పరిణామ క్రమలో పాత సంప్రదాయాలు కొనసాగుతూ వుంటుంటే వాటితో పాటు కొత్త సంప్రదాయాలు కూడా ఆవిర్భవించి పాతవాటితో పాటూ కొనసాగాయి. అంటే మధ్య శిలాయుగం ప్రాచీన శిలాయుగాన్ని పూర్తిగా కనుమరుగు చేయదు. మధ్య శిలాయుగాన్ని నవీన శిలాయుగం పూర్తిగా నెట్టి వేయదు. ప్రాచీన శిలాయుగం చివరి దశ, మధ్య శిలాయుగం మొదటి దశ రెండూ కలసి కొనసాగాయి. మధ్య శిలాయుగం చివరి దశ, నవీన శిలాయుగం మొదటి దశ రెండూ కలసి కొనసాగాయి. ఉదాహరణకు బెలాన్ నదీ లోయ (ఉత్తర ప్రదేశ్), నాగర్జన కొండ (ఆంద్ర ప్రదేశ్) లాంటి ప్రాంతాలలో అయితే ప్రాచీన శిలాయుగ సంస్కృతి అన్ని దశల నుండి నవీన శిలాయుగ సంస్కృతుల వరకు శిలాయుగ సంస్కృతి అవిచ్చన్నంగా కొనసాగింది.
 
ప్రాధమికంగా మధ్య ప్రాచీన శిలాయుగం అనేది పెచ్చుతో చేసిన పనిముట్లు (Flaked Tools) ప్రాబల్యం వహించిన దశ కాబట్టి, దేశ కాల పరిస్థితుల కారణంగా భారతదేశంలోని అన్ని ప్రాంతాలలోను ఈ దశ ఒకే కాలంలో వ్యాపించ లేదు. అషూలియన్ సంస్కృతికి చెందిన చేతి గొడ్డళ్ళు క్రమేణా పాదాన్యం కోల్పోతూ ఆ స్థానాన్ని పెచ్చుతో చేసిన పనిముట్లు ఆక్రమించడం అనే పరివర్తన నిదానంగా జరిగడం వలన భారత దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా కాలక్రమం కనిపిస్తుంది. ఉదాహరణకు హెచ్. డి. సంకాలియా (H. D. Sankaliya) దక్షిన భారతదేశంలో మధ్య ప్రాచీన శిలాయుగం 25,000 సంవత్సరాలనాటిదని తెలిపారు.<ref>{{cite book|last1=Kambhampati|first1=Satyanarayana|title=ఆంధ్రుల సంస్కృతి-చరిత్ర తొలి భాగం [A Study of the History and Culture of the Andhras]|publisher=Hyderabad Book Trust|location=Hyderabad|page=3|edition=1993}}</ref> క్లార్క్, విలియమ్స్ ప్రకారం ఉత్తర, మధ్య భారతదేశంలో మధ్య ప్రాచీన శిలాయుగం 40,000 నుండి 50,000 సంవత్సరాల క్రితం వరకు వుందని <ref>{{cite book|last1=M.L.K.Murthy|first1=D.R.Raju|title=ఆంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర-సంస్కృతి (ప్రాక్ పురాయుగం - క్రీ.పూ.500 వరకు)|publisher=ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్ & ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం (A.P)|location=Hyderabad|page=41|edition=2013|ref=మధ్య ప్రాచీన శిలాయుగ సంస్కృతులు}}</ref>, మిశ్రా మధ్య ప్రాచీన శిలాయుగాన్ని భారతదేశానికి అంతటకు అనువర్తిస్తే 1,25,000 to 40,000 ఏళ్ల నాటిదని తెలియ చేసారు.<ref>{{cite book|last1=M.L.K.Murthy|first1=D.R.Raju|title=ఆంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర-సంస్కృతి (ప్రాక్ పురాయుగం - క్రీ.పూ.500 వరకు)|publisher=ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్ & ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం (A.P)|location=Hyderabad|page=41|edition=2013|ref=మధ్య ప్రాచీన శిలాయుగ సంస్కృతులు}}</ref> చరిత్ర కారుడు ఆర్.యస్. శర్మ ప్రకారం భారతదేశంలో మధ్య ప్రాచీన శిలాయుగం కాలావధి క్రీ.పూ. 1,50,000 నుండి 35,000 వరకు అని తెలియచేసారు. <ref>{{cite book|last1=R.S|first1=Sharma|title=India's Ancient Past|publisher=Oxford University Press|location=New Delhi|page=52|edition=2016}}</ref>
 
==భారత దేశంలో మధ్య ప్రాచీన శిలాయుగ సంస్కృతి - ముఖ్య లక్షణాలు==