విశాల నేత్రాలు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ప్రధమ → ప్రథమ using AWB
పంక్తి 24:
ఈ గ్రంథ రచనలో శ్రీరామకృష్ణ మఠాధిపతులు శ్రీరామకృష్ణస్వామి రచించిన ఆంగ్లగ్రంథం '''లైఫ్ ఆఫ్ రామానుజ''' చాలా ఉపకరించిందని రచయిత పేర్కొన్నారు. [[రామానుజుడు|రామానుజుల]] జీవితం, వైష్ణవమతాల గురించిన సంస్కృతాంధ్ర భాషల్లోని గ్రంథాలను ఆయన పరిశీలించి గ్రంథానికి అవసరమైన నేపథ్యం సమకూర్చుకున్నారు.<ref name="1963 print">[http://www.new.dli.ernet.in/cgi-bin/metainfo.cgi?&title1=Visaala%20Netraalu&author1=Sri%20P%20Ganapati%20Sastri&subject1=THE%20ARTS&year=1963&language1=telugu&pages=364&barcode=2990100071745&publisher1=Prem%20Chand%20Publications%20Vijayawada&vendor1=NONE&scanningcentre1=ttd,%20s.v%20digital%20library&slocation1=NONE&sourcelib1=Saraswata%20Vidya%20Nikethanam%20Vetapalem&scannerno1=0&digitalrepublisher1=Digital%20Library%20Of%20India&digitalpublicationdate1=2005-09-01&rights1=&format1=Tagged%20Image%20File%20Format&url=/data_copy/upload/0071/750%20target= విశాల నేత్రాలు గ్రంథానికి ముందుమాట "రెండుమాటలు":పిలకా గణపతిశాస్త్రి:1963 ప్రచురణ]</ref>
=== అంకితం ===
సైనమైడ్ ఇండియా లిమిటెడ్, మద్రాసు ప్రాంతీయ మేనేజర్‌గా పనిచేసిన ఇ.కె.కుమార్‌కు ఈ గ్రంథాన్ని అంకితమిచ్చారు. <ref name= "1963 print"/>
 
== ఇతివృత్తం ==
పంక్తి 40:
రాజభవంతిని తలపించే శృంగారమంజరి భవంతిలోకి ఒక అర్ధరాత్రి వేళ కావలి వాళ్ళ కళ్లుగప్పి, దేహానికి మసిపూసుకుని రంగనాయకుడు ప్రవేశించడంతో కథ ప్రారంభమవుతుంది. చకచకా మలుపులు తిరుగుతూ హేమసుందరి, రంగానాయకుడూ శ్రీరంగం చేరెంతవరకూ అత్యంత వేగంగా సాగే కథనం, అక్కడినుంచి కూసింత మందగిస్తుంది. కథానాయకుడు తొలి లక్ష్యాన్ని చేరుకోవడం, ఆ తర్వాతి లక్ష్యం ఏమిటన్నది పాఠకులకి తెలియకపోవడం ఇందుకు కారణాలని చెప్పాలి.
 
కాంచీ రాజ్య పాలన, క్రమశిక్షణ, శాంతిభద్రతలపై పాలకుల ప్రత్యేక శ్రద్ధ వంటి విషయాలతో పాటు, కుమార్తెల ద్వారా వీలైనంత ఎక్కువ డబ్బు సంపాదించాలని ఆశించే వృద్ధ వేశ్య శృంగారమంజరి, తన చెల్లెలే తనకి పోటీ వస్తోందని భయపడే మాణిక్యవల్లి పాత్రలు ప్రధమార్ధాన్నిప్రథమార్ధాన్ని ఆసక్తిగా చదివిస్తాయి. రెండోసగంలో శ్రీరంగేశుడి మీద భక్తి, రామానుజ యతి మీద గౌరవం చూపిస్తూనే, రంగనాయకుడు వ్యసనాలకి బానిసవ్వడం, నేరం చేయడానికి వెనుకాడకపోవడం కథని మలుపులు తిప్పుతాయి.
 
రంగనాయకుడి మీద యతి చూపే అభిమానం, ఆశ్రమంలో మిగిలిన శిష్యులకి కంటగింపు కావడం, ఓ దశలో యతి ఆశ్రమం విడిచిపెట్టడానికి సిద్ధపడడం కథని ముగింపు వైపు నడుపుతాయి.<ref>పిలకా గణపతి శాస్త్రి రచించిన "విశాల నేత్రాలు" నవల</ref>
 
== శైలి, శిల్పం ==
ఎంతో లలితమైన కథావస్తువుతో, ఆ కాలానికి తగినట్టు ప్రత్యేక రచనతో పిలకా గణపతిశాస్త్రి విశాల నేత్రాలు తీర్చిదిద్దడం పాఠకుల్ని విడువక చదివించిందని రచయిత, విమర్శకుడు వి.రాజారామమోహనరావు పేర్కొన్నారు. రచనాపరంగా కొన్ని ప్రత్యేక పద్ధతులు అవలంబించారు. పాఠకులకు తిరిగి చెప్పదలచుకున్న అంశాలను, అంతకుముందే జరిగిపోయినా తిరిగి ప్రస్తావించారు. నవలలోని వర్ణనలు, చాలాచోట్ల వాతావరణ విశదీకరనకే కాక, పాత్రల మనస్థితిని తెలిపేలా తీర్చిదిద్దారు.<ref>వి.రాజారామమోహనరావు రచించిన "నవలాహృదయం"లో విశాల నేత్రాలు వ్యాసం; పేజీ.54 </ref>
 
== ప్రాధాన్యత ==
పంక్తి 53:
== ప్రాచుర్యం ==
ఈ నవల ధారావాహికగా వెలువడే రోజుల్లో వారం వారం పత్రిక కోసం పాఠకులు ఆత్రుతగా ఎదురుచూసేవారని పలువురు సాహిత్య విమర్శకులు పేర్కొన్నారు. గణపతిశాస్త్రి కూర్చిన అనేక రకాల వర్ణనలను, సౌందర్య వివరాలను అపురూపమైన చిత్రాలుగా బాపు మలిచేవారు. ఈ నేపథ్యంలో అన్ని విధాలుగా నవల పాఠకలోకంలో ఒక సంచలనంగా నిలిచింది. అనంతర కాలంలో పుస్తకరూపాన్ని సంతరించుకున్న విశాల నేత్రాలు పలుమార్లు పునర్ముద్రితమైంది.<br />
ఈ నవలకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ పురస్కారం లభించింది. 2003 ప్రాంతాలలో "ధనుర్దాసు" అన్న పేరుతో దూరదర్శన్ ఈ నవలను చిత్రీకరించి ప్రసారం చేశారు. ఈ నవలను సినిమాగా తీసేందుకు కూడా ప్రయత్నాలు సాగాయి. ప్రముఖ సినీనటుడు, నిర్మాత ఉప్పలపాటి కృష్ణంరాజు పలుమార్లు విశాల నేత్రాలు చిత్రంగా తీయడం తన కల అంటూ పేర్కొన్నారు. ఆయన సినిమాకు అనుగుణంగా పూర్తిస్థాయి స్క్రిప్టు రాయించుకుని, ప్రభాస్ కథానాయకునిగా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేసుకున్నారు. కారణాంతరాల వల్ల ఆ ఆలోచన కార్యరూపం దాల్చలేదు. "విశాలమైన నేత్రాలతో గణపతిశాస్త్రి వర్ణనలకు తగ్గ కథానాయిక దొరకక ఈ కథ చిత్రరూపం దాల్చలేదని" పలు ముఖాముఖీల్లో పాల్గొన్న ఆయన త్వరలోనే విశాలనేత్రాలు సినిమాగా వస్తుందని కూడా చెప్తున్నారు.<ref>[http://archive.andhrabhoomi.net/specials/Vennela%20-%20interviews/content/avineethi] కృష్ణంరాజు ఇంటర్వ్యూ</ref><ref>[http://teluggodu.blogspot.in/2012/01/blog-post_8194.html] 2012 జనవరిలో కృష్ణంరాజు ఇంటర్వ్యూ</ref>
 
== బయటి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/విశాల_నేత్రాలు" నుండి వెలికితీశారు