"కాశీ" కూర్పుల మధ్య తేడాలు

515 bytes added ,  3 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: 17 జూన్ 2014 → 2014 జూన్ 17, ధ్వంశ → ధ్వంస using AWB)
చి
}}
 
'''కాశీ''' లేదా ''[[వారాణసి]]'' (''Kasi, Benaras, Varanasi'') [[భారతదేశము|భారతదేశపు]] అతి ప్రాచీన నగరాల్లో ఒకటి. [[హిందూమతము|హిందువులకు]] అత్యంత పవిత్రమైన [[పుణ్య క్షేత్రము]]. ఇది [[ఉత్తరప్రదేశ్]] రాష్ట్రంలోవుంది. ఇక్కడ ప్రవహించే [[గంగానది]]లో స్నానం ఆచరిస్తే సర్వపాపాలు నశించి పునర్జన్మ నుంచి విముక్తులౌతారని హిందువుల నమ్మకం. వరుణ, అసి అనే రెండు నదులు ఈ నగరం వద్ద [[గంగ|గంగానదిలో]] కలుస్తాయి. అంచేత, ఈ క్షేత్రానికి [[వారణాసి]] (వారణాసి అని అంటుంటారు) అని కూడా నామాంతరం ఉంది. [[బ్రిటిషు]]వారి వాడుకలో [[వారణాసి]], [[బెనారస్]] అయింది.
'''''కాశ్యాన్తు మరణాన్ ముక్తి:''''' - "కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది" - అని [[హిందూమతం|హిందువులు]] విశ్వసిస్తారు. [[ద్వాదశ జ్యోతిర్లింగాలు|ద్వాదశ జ్యోతిర్లింగాల్లో]] ఒకటైన '''విశ్వేశ్వర లింగం''' ఇక్కడ ఉంది. [[బౌద్ధులకుబౌద్ధులు|బౌద్ధు]]<nowiki/>లకు, [[జైనులకుజైనులు|జైను]]<nowiki/>లకు కూడా ఇది పుణ్యక్షేత్రం. వారాణసి ప్రపంచంలోనే [[:en:List of oldest continuously inhabited cities|అవిచ్ఛిన్నంగా జనావాసం ఉన్న నగరాలలోఅత్యంత పురాతనమైనది]] అని భావిస్తున్నారు.<ref name=bsfw /><ref>{{cite web |url=http://www.britannica.com/eb/article-9074835/Varanasi |title=Varanasi |publisher=[[Encyclopædia Britannica Online]] |accessdate=2008-03-06}}</ref>
 
[[గంగా నది|గంగానది]], [[హిందూమతము]], హిందూస్తానీ సంగీతము, పట్టు వస్త్రాల నేత, [[హిందీ]] మరియు [[సంస్కృత]] పండితుల పీఠం - ఇవి వారాణసి నగరపు సంస్కృతీ చిహ్నాలలో ప్రముఖంగా స్ఫురణకు వస్తాయి. [[హరిశ్చంద్రుడు]], [[గౌతమ బుద్ధుడు]], [[వేదవ్యాసుడు]], [[తులసీదాసు]], [[శంకరాచార్యుడు]], [[కబీర్ దాసు]], [[ప్రేమ్‌చంద్|మున్షీ ప్రేమ్‌చంద్]], [[లాల్ బహదూర్ శాస్త్రి]], పండిట్ [[రవిశంకర్]], [[బిస్మిల్లా ఖాన్]], [[కిషన్ మహరాజ్]] వంటి ఎందరో పౌరాణిక, చారిత్రిక, సాంస్కృతిక ప్రముఖులు వారాణసి నగరం లేదా దాని పరిసర ప్రాంతాలతో ప్రగాఢమైన అనుబంధం కలిగి ఉన్నారు. వారణాసికి గంగానది ఆవలివైపున రామనగరం ఉంది. వారాణసి సమీపంలో [[సారనాథ్]] బౌద్ధ క్షేత్రం ఉంది.
 
విశ్వేశ్వరాలయం, అన్నపూర్ణాలయం, [[విశాలాక్షి]] ఆలయం, వారాహీమాతాలయం, తులసీ మానస మందిరం, సంకట మోచనాలయం, కాల భైరవాలయం, దుర్గా మాత దేవాలయం, భారతమాత మందిరం - ఇలా కాశీలో ఎన్నో దేవాలయాలున్నాయి. దశాశ్వమేధ ఘట్టం, హరిశ్చంద్ర ఘట్టం వంటి పలు స్నాన ఘట్టాలున్నాయి. [[కాశీ హిందూ విశ్వవిద్యాలయం]] ఇక్కడి ప్రస్తుత విద్యా సంస్థలలో ముఖ్యమైనది. వారాణసిని "మందిరాల నగరం", "దేశపు ఆధ్యాత్మిక రాజధాని", "దీపాల నగరం", "విద్యా నగరం", "సంస్కృతి రాజధాని" వంటి వర్ణనలతో కొన్ని సందర్భాలలో ప్రస్తావిస్తుంటారు.<ref>{{cite web |url=http://www.bhu.ac.in/varanasi.htm |title=Varanasi: The eternal city |publisher=[[Banaras Hindu University]] |accessdate=2007-02-04}}</ref>
అమెరికన్ రచయిత [[మార్క్ ట్వేన్]] ఇలా వ్రాశాడు - "బెనారస్ నగరం చరిత్ర కంటే పురాతనమైనది. సంప్రదాయంకంటే పురాతనమైనది. గాధలకంటే ముందుది. వీటన్నింటినీ కలిపినా బెనారస్ నగరం కంటే తరువాతివే అవుతాయి."<ref>{{cite book |last=Twain |first=Mark | authorlink = Mark Twain |title=Following the Equator: A journey around the world |url=http://www.literaturecollection.com/a/twain/following-equator/ |accessdate=2007-02-07 |origyear=1897 |year=1898 |publisher=Hartford, Connecticut, American Pub. Co. |isbn=0404015778 | oclc = 577051 |chapter=L | chapterurl = http://www.literaturecollection.com/a/twain/following-equator/51/}}</ref>
[[దస్త్రం:People on a ghat in Varanasi.jpg|right|thumb|300px|వారాణసిలో ఒక స్నాన ఘట్టం]]
== వారాణసి పేరు ==
[[దస్త్రం:Ganges India.jpg|thumb|right|250px| వారాణసి నగరానికి, గంగానదికి అవినాభావ సంబంధం ఉంది.]]
గంగానదితో[[గంగా నది|గంగానది]]<nowiki/>తో రెండు చిన్న నదులు "వరుణ", "ఆస్సి" అనే రెండు నదుల సంగమాల మధ్య ఉన్నందున "వారణాసి" అనే పేరు వచ్చిందని ఒక అభిప్రాయం. వారాణసి నగరానికి ఉత్తరాన వరుణ సంగమ స్థానం, దక్షిణాన అస్సి (ఇది చిన్న నది) నది సంగమ స్థానం ఉన్నాయి.<ref>{{cite book |first=Alexander |last=Cunningham | coauthors = Surendranath Majumdar Sastri |authorlink=అలెగ్జాండర్ కన్నిగామ్ |title=Ancient Geography of India |publisher=Munshiram Manoharlal |pages=131-140 |origyear=1924 |date=2002 |isbn=8121510643 | oclc = 54827171}}</ref>
మరొక అభిప్రాయం ప్రకారం "వరుణ" నదికే పూర్వకాలం "వారాణసి" అనే పేరు ఉండేది. కనుక నగరానికి కూడా అదే పేరు వచ్చింది.<ref>M. Julian, ''Life and Pilgrimage of Hsuan Tsang'', 6, 133, 2, 354.</ref> కాని ఈ రెండవ అభిప్రాయం అధికులు విశ్వసించడంలేదు.<ref>{{cite web |url=http://tdil.mit.gov.in/CoilNet/IGNCA/kv_0002.htm |title=Varanasi Vaibhav ya Kaashi Vaibhav - Kashi Ki Rajdhani Varanasi Ka Namkaran |publisher=సాంకేతిక మంత్రిత్వ శాఖ, [[భారత ప్రభుత్వము]] |date=2003 |accessdate=2007-02-04 |language=హిందీ}}</ref>
 
సుమారు 5,000 సంవత్సరాల క్రితం [[శివుడు]] వారాణసి నగరాన్ని స్థాపించాడని పౌరాణిక గాథల సారాంశం.<ref name=bsfw>{{cite book |last=Lannoy |first=Richard |title=Benares Seen from Within |publisher=[[University of Washington Press]] |pages=Back Flap |date=October 1999 |isbn=029597835X | oclc = 42919796}}</ref>. ఇది [[హిందువుల ఏడు పవిత్ర నగరాలు|హిందువుల ఏడు పవిత్ర నగరాలలో]] ఒకటి. [[ఋగ్వేదం]], [[రామాయణం]], [[మహాభారతం]], [[స్కాంద పురాణం]] వంటి అనేక ఆధ్యాత్మిక గ్రంథాలలో కాశీనగరం ప్రసక్తి ఉంది.
 
వారాణసి నగరం సుమారు 3,000 సంవత్సరాల నుండి ఉన్నదని అధ్యయనకారులు భావిస్తున్నారు.<ref>{{cite news |url=http://news.bbc.co.uk/2/hi/south_asia/4784056.stm |title=The religious capital of Hinduism |first=Debabani | second = Majumdar |publisher=[[BBC]] |date= 2006-03-07 |accessdate=2007-02-04}}</ref> విద్యకు, పాండిత్యానికి, శిల్పం, వస్త్రం, సుగంధ ద్రవ్యాలవంటి వస్తువుల వ్యాపారానికి వారాణసి కేంద్రంగా ఉంటూ వచ్చింది. [[గౌతమ బుద్ధుడు|గౌతమ బుద్ధుని]] కాలంలో ఇది [[కాశీ రాజ్యం|కాశీ రాజ్యానికి]] రాజధాని. చైనా యాత్రికుడు [[యువాన్ చువాంగ్]] ([[:en:Xuanzang|Xuanzang]])ఈ నగరాన్ని గొప్ప ఆధ్యాత్మిక, విద్యా, కళా కేంద్రంగా వర్ణించాడు. ఇది గంగానదీ తీరాన 5 కిలోమీటర్ల పొడవున విస్తరించిందని వ్రాశాడు.
[[దస్త్రం:Benares (Varanasi, India) - 1922.jpg|right|thumb|250px|1922లో వారణాసి (బెనారస్).]]
 
<!-- 1033లో [[మొహమ్మద్ ఘజనీ]] దండయాత్రలతో ప్రాంభమై అనేక ఆలయాలు ధహవంసం చేయబడ్డాయి. కొన్ని పునర్నిర్మించబడ్డాయి, మళ్ళీ కూలగొట్టబడ్డాయి. [[అక్బర్]] చక్రవర్తి కాలంలో ఆగిపోయిన ఈ విధ్వంసం మళ్ళీ [[ఔరంగజేబు]] కాలంలో కొనసాగింది. ఈ కాలంలో ఎందరో పండితులు వారాణసిని వదలి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. Sentemses translated from enwiki essay, but masked because (a) Citation not given (b) writing only this matter without covering other historical aspects makes this section unbalanced-->
18వ శతాబ్దంలో వారాణసి ఒక ప్రత్యేక రాజ్యమయ్యింది. తరువాత [[బ్రిటిషు|బ్రిటిష్ పాలన]] పాలన సమయంలో ఈ నగరం ఆధ్యాత్మిక, వాణిజ్య కేంద్రంగా కొనసాగింది. 1910లో "రామ్‌నగర్" రాజధానిగా బ్రిటిష్ వారు ఒక రాష్ట్రాన్ని ఏర్పరచారు. కాని ఆ రాష్ట్రానికి వారాణసి నగరంపైన మాత్రం పాలనాధికారం లేదు. ఆ వంశానికి చెందిన కాశీ నరేష్ మహారాజ్ ఇప్పటికీ రామ్ నగర్ కోటలోనే నివసిస్తున్నాడు.
 
=== పురాణకథనాలు ===
కాశీ శివస్థాపితమని పురాణకథనాలు వివరిస్తున్నాయి. కురుక్షేత్ర యుద్ధం తరువాత పాండవులు భాతృహత్య మరియు బ్రహ్మహత్యా పాతకాల నుండి విముక్తులవడానికి సప్తముక్తిపూరాలలో ఒకటైన కాశీ పట్టణానికి విచ్చేసారు.[[అయోధ్య]], [[మథుర]], [[గయ]],[[కాశి]], [[ఉజ్జయిని|అవంతిక]], [[కంచి]], [[ద్వారక]] నగరాలను సప్తముక్తి పురాలని హిందువుల విశ్వాసం. ఆరంభకాల పూరాతతత్వ పరిశోధనలు వారణాశి పరిసరప్రాంతాలలో 11-12 శతాబ్ధాలలో నివాసాలు ఆరంభమయ్యాయని తెలియజేస్తున్నాయి. ఇది ఆర్యౌల మత మరియు తత్వశాస్త్రాలకు మూలమని విశ్వసించబడుతుంది. ప్రపంచంలో నిరంతరంగా నివాసయోగ్యమైన ప్రదేశాలలో కాశీ ప్రథమ స్థానంలో ఉందని భావిస్తున్నారు. పురాతత్వ అవశేషాలు వారణాశి వేదకాల ప్రజల అవాసమని వివరిస్తున్నాయి. కాశీ పట్టణం గురించి ప్రథమంగా [[అథర్వణ వేదం|అధర్వణ వేదంలోవేదం]]<nowiki/>లో వర్ణించబడింది. అధర్వణవేదం సుమారుగా వేదకాల ప్రజలిక్కడ నివసించారని భాస్తున్న సమయానికి సరొపోతున్నాయి. ఈ ప్రాంతంలో [[స్థానికులు]] నివసించారాని చెప్పడానికి తగిన ఆధారాలు లభిస్తున్నాయి. 8వ శతాబ్దంలో 23వ జైనగురువు మరియు ఆరంభకాల తీర్ధగురువు అయిన పర్ష్వ జన్మస్థానం వారణాసి అనడానికి ఆధారాలు లభిస్తున్నాయి.
 
=== ఆర్ధికం ===
వారణాశి పారిశ్రమికంగా కూడా అభివృద్ధి చెందింది. వారణాశి మస్లిన్ మరియు పట్టు వస్త్రాలకు, [[సుగంధ ద్రవ్యము|సెంటు]], దంతపు వస్తువులు మరియు శిల్పాలకు ప్రసిద్ధి. గౌతమబుద్ధుడు (జననం 567 క్రీ.పూ)నివసించిన కాలంలో కాశీ రాజ్యానికి కాశీ రాజధానిగా ఉండేది. క్రీ.పూ 528 బుద్ధిజం కాశీలో స్థాపించబడిందని అంచనా. [[గౌతమ బుద్ధుడు|గౌతమబుద్ధుడు]] కాశీలోని సారనాధ్ వద్ద " ధర్మచక్రం కదిలింది (టర్నింగ్ ది వీల్ ఆఫ్ లా ) " మొదటిసారిగా గంభీరఉపన్యాసం ప్రజలకు అందించాడు. [[చైనా]] యాత్రికుడు హూయంత్సాంగ్ క్రీ.శ 635లో వారణాశిని దర్శించాడు. కాశీ పశ్చిమతీరంలో ఐదు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన వారణాశి మతం మరియు కళలకు కేంద్రంగా ఉండేదని హూయంత్సాంగ్ వర్ణించాడు. 7వ శతాబ్దంలో హూయంత్సాంగ్ వారణాశిలో నివసించాడు. హూయంత్సాంగ్ వారణాశిని " పోలనైస్ " అని పేర్కొన్నాడు. 30 సన్యాదులకు సంబంధించిన 30 ఆలయాలను కూడా ఆయన వర్ణించాడు. 8వ శతాబ్దంలో శకరాచార్యుడు శివారధన విధానాలను సాధికారంగా ఆరంభించిన తరువాత వారణాశి మతపరంగా మరింత ప్రసిద్ధి చెందింది.
=== ప్రముఖులు ===
[[మౌర్య సామ్రాజ్యం|మౌర్యుల]] కాలంలో [[తక్షశిల]] మరియు [[పాటలీపుత్ర]] మద్య ఉన్న రహదారితో[[రహదారి]]<nowiki/>తో కాశీపట్టణం అనుసంధానించబడి ఉంది. 1194లో వారణాశి నగరం కుతుబుద్దీన్ ఐబక్ స్వాధీనమైంది. కుతుబుద్దీన్ ఐబక్ ఆదేశంతో నగరంలోని సుమారు 1000 ఆలయాలను ధ్వశం చేయబడ్డాయి. ముస్లిం ఆక్రమణలో నగరం దాదాపు 3 శతాబ్ధాల కాలం క్షీణావస్థను చవిచూసింది. ఆఫ్గన్ దండయాత్ర తరువాత నగరంలో సరికొత్తగా ఆలయాలు నిర్మించబడ్డాయి. ఫెరోజ్ షాహ్ కాలంలో 1376లో వారణాశిలోని మరికొన్ని ఆలయాలు ధ్వశం చేయబడ్డాయి. ఆఫ్గన్ రాజు సికిందర్ లోడి హిదువుల ఆణిచివేతను కొనసాగిస్తూ 1496లో మిగిలిన హిందూ ఆలయాలను ధ్వశం చేయించాడు. ముస్లిం పాలన కాలంలోనే మరికవైపు వారణాశి మేధావులకు మరియు తాత్వికులకు కేంద్రంగా మారింది.
మద్యకాలంలో వారణాశి మతసంప్రదాయాలకు మరియు విద్యకు కేంద్రమై విలసిల్లింది. భక్తి ఉద్యమకాలంలో వారణాశిలో 1389లో రామభక్తుడైన [[కబీరుదాసు]] జన్మించాడు. కబీరరుదాసు రచించిన భక్తిరసపూరిత కీర్తనలు 15 వ శతాబ్దంలో భారతదేశంలో[[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లో కీర్తించబడ్డాయి. అలాగే 15 వ శతాబ్దంలో సంఘసంస్కర్త, యోగి, కవి, యాత్రికుడు మరియు మతగురువు అయిన రవిదాసు వారణాశిలో జన్మించాడు. రవిదాసు జీవనోధి కొరకు తోళ్ళపరిశ్రమలో పనిచేసాడు. అలాగే భారతదేశం మరియు [[దక్షిణాసియా]] అంతటి నుండి అనేక ప్రఖ్యాత విద్యావేత్తలు, బోధకులు వారణాశిని సందర్శించారు. 1507లో గురునానక్ దేవ్ శివరాత్రి సందర్భంగా వారణాశిని సందర్శించాడు. ఈ సంఘటన సిక్కుమత స్థాపనలో అత్యంత ప్రాముఖ్యత వహించింది.
=== స్వాతంత్రానికి ముందు చరిత్ర ===
16వ శతాబ్దంలో మొగల్ చక్రవర్తి ఆక్బర్ పాలనలో వారణాశిలో సరికొత్త సంస్కృతి మొదలైంది. ఆక్బర్ చక్రవర్తి ఆధ్వర్యంలో వారణాశిలో శివునికి మరియు విష్ణుమూర్తికి రెండు పెద్ద ఆలయాలను నిర్మించబడ్డాయి. పూనా రాజు 200 మీటర్ల (660 అడుగులు) ఎత్తైన అంపూర్ణాదేవి నమందిరం నిర్మించాడు. అలాగే పూనా రాజు పాలనలో శివా - విష్ణులకు అంకితమివ్వబడిన అక్బారి వంతెన కూడా నిర్మించబడింది. 16వ శతాబ్దం నుండి వారణాశికి యాత్రికుల రాక ప్రారంభమైంది. 1665లో ఫ్రెంచి యాత్రికుడైన " జీన్ బాప్టిస్ట్ ట్రావర్నియర్ " ఈ నగరాన్ని సందర్శించి వారణాశిలోని గంగాతీరంలో ఉన్న " బిందు మహాదేవాలయం " సౌందర్యాన్ని వర్ణించాడు. చక్రవర్తి షేర్ షాహ్ సూరి కాలంలో వారణాశి రహదారి పునరుద్దరినబడి కొలకత్తా నుండి పెషావర్ వరకు పొడిగించబడింది. తరువాత బ్రిటిష్ పాలనా కాలంలో ఈ రహదారి ప్రఖ్యాతమైన " గ్రాండ్ ట్రంక్ రోడ్డుగా " అవతరుంచింది. 1656లో ఔరంగజేబు పలు ఆలయాలు ధ్వంసం చేయబడి మసీదులు నిర్మించబడ్డాయి. నగరం తిరిగి సంస్కృతి పరంగా వెనుకబడింది. అయినప్పటికీ [[ఔరంగజేబు]] మరణానంతరం భారాదేశంలో తిరిగి హిందూ రాజ్యాలు తలెత్తి వర్ద్ధిల్ల సాగాయి. ప్రస్తుతం వారణాశిలో ఉన్న ఆలయాలు హిందూ రాజులైన రాజపుత్రులు మరియు మరాఠా రాజులచేత నిర్మించబడ్డాయి. ప్రస్తుతం వారణాసిలోని పలు నిర్మాణాలు 18వ శతాబ్ధానికి చెంది ఉన్నాయి. బెనారస్ రాజు లేక కాశీ నరేష్ తో సహా ఈ రాజులు బ్రిటిష్ పాలనా సమయంలో (క్రీ.శ 1775-1945) కూడా కొనసాగారు. 1737లో మొగల్ చక్రవర్తుల ఆధ్వర్యంలో " బెనారస్ రాజ్యం ( కింగ్డం అఫ్ బెనారస్) " పేరుతో సాధికారంగా ఏర్పాటు చేయబడి 1947 వరకు కొనసాగింది. 18వ శతాబ్దంలో మహమ్మద్ షాహ్ ఆధ్వర్యంలో గంగాతీరంలో ఉన్న మాన్ మందిరం ఘాట్ వద్ద ఒక " అబ్జర్వేటరీ " కేంద్రాన్ని నిర్మించబడింది. ఇది జ్యీతిషశాస్త్ర విషయాల పరిశీలనకు అనుకూలమైంది. 18వ శతాబ్దంలో ఈ ప్రాంతానికి బ్రిటిష్ గవర్నర్లైన వారెన్ హేస్టింగ్, వారణాశిలో సంస్కృత కళాశాలను స్థాపించిన జూనాథాన్ డంకన్ కాలంలో వారణాశి పర్యాటకం మరింత వర్ధిల్లింది. 1867లో వరణాశిలో పురపాలక సంఘస్థాపన జరిగిన తరువాత వారణాశి నగరంలో మరింత అభివృద్ధి కొనసాగింది.
 
=== ప్రత్యేక సంఘటనలు ===
1897లో మార్క్ ట్వైన్, వారణాశి గురించి వర్ణిస్తూ " బెనారస్ చరిత్రకంటే పురాతనమైనది. సంప్రదాయాలకంటే పాతది, పురాణాలకంటే పురాతనమైనది అలాగే అన్నింటికంటే అత్యంత పురాతనమైనది. 1910లో బ్రిటిష్ ప్రభుత్వం వారణాశిని భారతీయ భూభాగంగా చేసి రామనగరాన్ని రాజధానిగా చేసి తన న్యాయపరిధి నుండి తొలగించింది. అయినప్పటికీ తరువాత కూడా గంగాతీరంలో వారణాశి భుభాగంలో ఉన్న రామనగర్ కోటలో కాశిరాజు నివసిస్తూ ఉన్నాడు. ప్రస్థుతం రామనగర్ కోటలో కాశిరాజులకు చెందిన వస్తుసంగ్రహాలతో [[సంగ్రహాలయం|మ్యూజియం]] నిర్వహించబడుతుంది. 18వ శతాబ్దం నుండి ఈ కోటలో కాశీరాజులు నివసిస్తూ వచ్చారని ప్రాంతీయ వాసులు వివరిస్తున్నారు. రాజు మతపరంగా అధ్యక్ష స్థానంలో ఉంటాడు అలాగే ప్రజలు రాజుని శివుని అవతారంగా భావిస్తారు. రాజు స్వయంగా అన్ని మతసంప్రదాయాల సంప్రదాయాలకు ఆధిపత్యం వహిస్తుంటాడు.
 
1857 లో వారణాశిలో బ్రిటిష్ సామ్రాజ్యానికి చెందిన భారతీయ సైనికులు స్వాతంత్ర సమరయోధుల మీద జరిగిపిన దమనకాండలో సామూహిక హత్యలు జరిగాయి. వారణాశిలో [[అనీబిసెంట్]] దియోసాఫీ సిద్ధ్హంతం ప్రతిపాదించడమేగాక " సెంట్రల్ హిందూ కాలేజ్ " స్థాపన కూడా చేసింది. తరువాత సెంట్రల్ హిందూ కాలేజ్ 1916 నుండి " బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం " గా మారింది. ఇది మతాతీతంగా విద్యాసేవలు అందిస్తుంది. అనీబిసెంట్ సెంట్రల్ హిందూ కాలేజ్ ని అన్ని మతాలకు చెందిన మనుషులు కేంద్రీకృతమై సహోదరత్వంతో కృషిచేసి భారతీయ సంస్కృతిని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో స్థాపించింది. అలాగే భారతీయ సమూహాలలో ఉన్న మూఢవిశ్వాసాలను తొలగించడం అనీబిసెంట్ లక్ష్యాలలో భాగమే.
== భౌగోళికం ==
 
వారాణసి నగరం [[ఉత్తర ప్రదేశ్]] రాష్ట్రం తూర్పు భాగంలో గంగా మైదానంలో, గంగానది ఒడ్డున ఉంది. ఇక్కడ గంగానది వంపు తిరిగి ఉంది. ఇది వారాణసి జిల్లాకు కేంద్రం కూడాను. వారాణసి నగం, దాని పరిసర ప్రాంతాలు ("Varanasi Urban Agglomeration") కలిపి మొత్తం 112.26&nbsp;చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉన్నాయి.<ref name=heritageUNESCO>{{cite web |url=http://www.sasnet.lu.se/EASASpapers/46RanaSingh.pdf |title=Varanasi as Heritage City (India) on the scale the UNESCO World Heritage List: From Contestation to Conservation |accessdate=2006-08-18 |last=Singh |first=Rana P.B. |format=[[Portable Document Format|PDF]] |work=EASAS papers |publisher=Swedish South Asian Studies Network}}</ref> ఈ నగరం ప్రాంతం 82° 56’తూ. - 83° 03’తూ. రేఖాంశాల మధ్య మరియు 25° 14’ఉ. - 25° 23.5’ఉ. అక్షాంశాల మధ్య ఉంది.<ref name=heritageUNESCO/> గంగానది వరదలతో (low level floods) ఈ ప్రాంతం నేల సారవంతంగా ఉంటుంది.
 
వారాణసి నగరం మాత్రం [[గంగ]], [[వరుణుడు|వరుణ]] నదుల మధ్య ఉంది. ఈ నగరం సముద్ర మట్టం నుండి 80.71&nbsp;మీటర్ల ఎత్తులో ఉంది.<ref name=varanasiairtrip>{{cite web |url=http://www.atrip4india.com/india-cities/varanasi.htm |title=Varanasi |accessdate=2006-08-18 |work=India-cities |publisher=Atrip4india.com}}</ref> పెద్దగా ఉపనదులు, పిల్ల కాలువలు లేనందున ఇక్కడి భూమి అధికంగా పొడిగా ఉంటుంది.
 
వారాణసి నగరం రెండు సంగమ స్థానాల మధ్య ఉన్నట్లుగా చెప్పబడుతుంది. (1) గంగ, వరుణ నదుల సంగమం (2) గంగ, అస్సి నదుల సంగమం. అస్సి నది చాలా చిన్నది (కాలువ వంటిది) ఈ రెండు సంగమాల మధ్య దూరం సుమారు 2.5 కిలోమీటర్లు. ఈ రెండు సంగమ స్థానాల మధ్య (5 కిలోమీటర్ల) యాత్ర "పంచ క్రోశి యాత్ర" పవిత్రమైనదిగా భావిస్తారు. యాత్రానంతరం సాక్షి వినాయకుని మందిరాన్ని దర్శిస్తారు.
 
=== వాతావరణం ===
వారాణసి వాతావరణం తేమగా ఉన్న సమోష్ణ వాతావరణం (humid subtropical climate). వేసవి, శీతాకాలం ఉష్ణోగ్రతల మధ్య అంతరం చాలా ఎక్కువగా ఉంటుంది. ఏప్రిల్-అక్టోబరు మధ్య వేసవి కాలంలో ఋతుపవనాల వల్ల అప్పుడప్పుడు వర్షాలు పడుతుంటాయి. హిమాలయ ప్రాంతంనుండి వచ్చే చలి తెరగలు (Cold waves) కారణంగా డిసెంబరు - ఫిబ్రవరి మధ్య శీతాకాలంలో చలి బాగా ఎక్కువగా ఉంటుంది. వేసవిలో నగరం ఉష్ణోగ్రతలు 32 - 46&nbsp;°C మధ్య, చలికాలంలో 5° - 15&nbsp;°C మధ్య ఉంటాయి.<ref name=varanasiairtrip/> సగటు వర్షపాతం 1110&nbsp;మిల్లీమీటర్లు<ref name=delhitourism>{{cite web |url=http://www.delhitourism.com/varanasi-tourism/ |title=Varanasi tourism |accessdate=2006-08-18 |publisher=DelhiTourism.com}}{{Verify credibility|date=February 2008}}</ref> చలికాలంలో దట్టమైన [[పొగ మంచు]], [[వేసవి కాలం|వేసవి]] కాలంలో [[:en:Loo (wind)|వడ గాడ్పులు]] ఉంటాయి.
 
నగరంలో వాతావరణ (గాలి) కాలుష్యం ఇప్పటికి అంత తీవ్రమైన సమస్య కాదు. కాని నీటి కాలుష్యం మాత్రం బాగా ఎక్కువగా ఉంది. ఇందువలనా, నది పైభాగంలో కడుతున్న ఆనకట్టల వలనా గంగానదిలో నీటి మట్టం తగ్గుతున్నది. నది మధ్యలో మట్టి మేటలు బయటపడుతున్నాయి.
మిషనరీ పనిలో ఉన్నారు, మిగిలిన వారు పరిశ్రమలోని ఇతర పనులలో ఉన్నారు.
 
వారణాశిలో తయారీ వ్యవస్థలో పట్టునేత[[పట్టు]]<nowiki/>నేత ఆధిక్యత వహిస్తుంది. వారణాశిలో సాధారణంగ నేతపని కుటీరపరిశ్రమగా ఉంటుంది. నేవారిలో అధికంగా మోమిన్ అంసారీ ముస్లిములు ఉన్నారు.
వారణాశి పలుచని పట్టువస్త్రాలు మరియు బనారస్ పట్టు చీరలు భారతదేశం అంతటా పఖ్యాతి వహిస్తున్నాయి. వివాహాది శుభకార్యాలలో ధరించే ఈ పట్టు చీరలు వెండి మరియు అంగారు జరీనూలుతో అలకృతమై ఉంటాయి. మిగిలిన భారతదేశం కంటే వారణాశిలో అత్యధికంగా బాలలను కట్టుబానిసలుగా పట్టుపరిశ్రమలో వాడుకుంటున్నారు. సమీపకాలంలో
అభివృద్ధి చెందుతున్న పవర్ లూంస్ మరియు కంప్యూటర్ డిజైన్లు అలాగే చైనా పట్టువస్త్రాల పోటీ వంటి సమస్యలు సంప్రదాయక పట్టునేత పరిశ్రమను కలవరానికి గురిచేస్తూ ఉంది.
1,87,257

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2127965" నుండి వెలికితీశారు