ఆత్రేయ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ప్రతిష్ట → ప్రతిష్ఠ, → using AWB
పంక్తి 34:
| weight =
}}
'''ఆచార్య ఆత్రేయ'''గా సినీరంగ ప్రవేశం చేసిన '''కిళాంబి వెంకట నరసింహాచార్యులు''' ([[మే 7]], [[1921]] - [[సెప్టెంబర్ 13]], [[1989]]) తెలుగులో సుప్రసిద్ధ నాటక, సినిమా పాటల, మాటల రచయిత, నిర్మాత మరియు దర్శకులు. దాదాపు 400 సినిమాలకు మాటలు, పాటలు రాసిన గొప్పకవి.<ref>[http://www.sakshi.com/news/opinion/heartstrings-poet-atreya-64765 మనసులు దోచిన కవి ఆత్రేయ Written by Nagesh | Updated: September 13, 2013]</ref> అత్రేయకి ప్రముఖ నటుడు [[కొంగర జగ్గయ్య]] ఆప్తమిత్రుడు.ఆత్రేయ వ్రాసిన పాటలు,నాటకాలు,నాటికలు,కథలు మొదలగు రచనలన్నీ ఏడు సంపుటాలలో సమగ్రంగా ప్రచురించి [[జగ్గయ్య]] తన మిత్రుడికి గొప్ప నివాళి అర్పించాడు అని చెప్పవచ్చు. ఆచార్య [[ఆత్రేయ]] [[తెలుగు సినిమా]] గేయరచయితగా, సంభాషణకర్తగా పేరుపొందినా నిజానికి ఆయన మాతృరంగం నాటకాలే. నాటక [[రచయిత]]<nowiki/>గా ఆయన స్థానం సుస్థిరం. మనసుకవిగా సినిమా వారు పిలుచుకునే '''ఆత్రేయ''' నాటకాల్లో చక్కని ప్రయోగాలు చేసి నాటక రంగాన్ని మలుపుతిప్పారు.
==జీవిత సంగ్రహం==
[[1921]] [[మే 7]] న [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]]లోని [[సూళ్ళూరుపేట]] మండలంలో గల [[మంగళంపాడు]] గ్రామంలో జన్మించాడు. తండ్రి [[కృష్ణమాచార్యులు]]. తల్లి సీతమ్మ. చిన్నప్పటినుండి నాటకంలోని పద్యాలను రాగయుక్తంగా చదివేవారు. సమాజంలో మధ్య తరగతి కుటుంబ సమస్యలను తీసుకుని మనోహరమైన నాటకాలుగా మలిచారు. వీరి 'ప్రవర్తన', '[[ఎన్.జి.వో]]' నాటకాలు [[ఆంధ్ర నాటక కళా పరిషత్తు|ఆంధ్ర నాటక కళా పరిషత్]] అవార్డులను గెలుచుకున్నారు. విశేషంగా రాష్ట్రవ్యాప్తంగా వందల సంఖ్యలో ప్రదర్శనలు జరిగాయి. అలాగే '[[కప్పలు]]' బాగా ప్రాచుర్యం పొందిన నాటకం. రాయలసీమ క్షామ పరిస్థితులను వివరించే 'మాయ' నాటకం, స్వాతంత్ర్యానంతరం దేశంలో చెలరేగిన హిందూ ముస్లిం హింసాకండను 'ఈనాడు' అనే మూడంకాల నాటకం మరియు విశ్వశాంతిని కాంక్షించే 'విశ్వశాంతి' నాటకాన్ని రచించారు. విశ్వశాంతి నాటకానికి కూడా రాష్ట్ర స్థాయి బహుమతి లభించింది. 'సామ్రాట్ అశోక','గౌతమ బుద్ధ' మరియు 'భయం' నాటకాలు కూడా వ్రాసారు.
పంక్తి 55:
*మరోచరిత్ర సినిమాకి రాసిన పాటలు<br> ఏ తీగ పువ్వునో...ఏ కొమ్మ తేటినో...<br>పదహారేల్లకు...నీలో నాలో<br>బలే బలే మగాడివోయ్ ...నీ అన నీ దానినోయ్...అనే పాటలు ఇప్పటికి శ్రోతలని అలరిస్తూనే ఉన్నాయి.
* [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]], [[శారద]]లు నటించిన "[[ఇంద్రధనుస్సు]]" సినిమాలోని పాట "'''నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమ వాసివి'''" అనే పాట ఆత్రేయకు అత్యంత ఇష్టమైన పాటగా చెబుతారు. ఆయనే ఒకసారి ఏదో సందర్భంలో ఈ పాట నా జీవితానికి సంబంధించిన పాట అని చెప్పారు.
*ఆత్రేయ వాస్తవిక జీవితంలో భగ్నప్రేమికుడయ్యుంటాడు. అందుకనే ఆయన రాసిన పాటల్లో విషాద గీతాలు, ముఖ్యంగా మనసును గూర్చి రాసిన పాటల్లో అంతటి విషాదం గోచరిస్తూ ఉండేవేమో. ఇంతకీ మనసును గూర్చి ఆత్రేయ రాసినన్ని పాటలు వేరొకరు రాసి ఉండలేదు. అందుకనే ఆతడిని [[మనసు]] కవి అనేవారు. బహుశా అందుచేతనే అయ్యుంటుంది, [[డాక్టర్ చక్రవర్తి]] సినిమాలోని "'''మనసున మనసై బ్రతుకున బ్రతుకై'''" పాటని ఆత్రేయనే రాసారని అనుకునేవారు. కానీ ఈ పాటని రాసినది వాస్తవానికి [[శ్రీశ్రీ]]గా లబ్ధప్రతిష్టుడైనలబ్ధప్రతిష్ఠుడైన శ్రీరంగం శ్రీనివాసరావు.
*వీరిద్దరికీ సంబంధించినదే ఇంకొక సంగతుంది. అదేమంటే ...... సినిమాలో "'''కారులో షికారికెళ్ళే పాలబుగ్గల పసిడిచాన'''" పాటని శ్రీ.శ్రీ. రాసారేమో అనుకునేవారు. కాని ఈపాటని రాసింది మాత్రం ఆత్రేయ.
*ఆత్రేయ పాటల రచయిత మాత్రమే కాకుండా, అనేక సినిమాలకు మాటల రచయితగా కూడా ఉన్నారు. ముఖ్యంగా [[ప్రేమనగర్]] సినిమా విజయంలో ఆత్రేయ రాసిన పాటలు, మాటలు ముఖ్యభూమిక వహించిందంటే అతిశయోక్తి కాదు. అందులో, మచ్చుకు ప్రేమ్ నగర్ సినిమాకు రాసిన మాటలు కొన్ని :
పంక్తి 118:
* [http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=evaru%20don%27ga&author1=aatreiya%20aachaarya&subject1=GENERALITIES&year=1955%20&language1=Telugu&pages=155&barcode=2030020025556&author2=&identifier1=&publisher1=deishii%20pres&contributor1=&vendor1=til&scanningcentre1=rmsc,%20iiith%20&slocation1=OSU&sourcelib1=OU%20&scannerno1=&digitalrepublisher1=&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=IN_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=%20&url=/data7/upload/0191/440 ఆత్రేయ వ్రాసిన ఎవరు దొంగ నాటకం]
* [http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/august2008/telugu_tejo_murthulu.php మన "సు" కవి - ఆచార్య ఆత్రేయ]
 
[[వర్గం:1921 జననాలు]]
[[వర్గం:1989 మరణాలు]]
"https://te.wikipedia.org/wiki/ఆత్రేయ" నుండి వెలికితీశారు