గండికోట యుద్ధం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: దేశమునకు → దేశానికి using AWB
పంక్తి 11:
==మీర్ జుమ్లా==
 
మీర్ జుమ్లా పారశీక ([[ఇరాన్]]) దేశమునకుదేశానికి చెందిన ఒక తైల వర్తకుని కుమారుడు. [[గోలకొండ]] రాజ్యముతో వజ్రాల వ్యాపారము చేస్తున్న ఒక వర్తకుని వద్ద గుమాస్తాగా పనిచేసి, వజ్రాల గురించి జ్ఞానము సంపాదించి [[భారతదేశము]] చేరాడు. స్వయముగా వజ్రాలవ్యాపారిగా మారి, గనులు సంపాదించి, ఎన్నో [[ఓడ]]లు సమకూర్చుకొని గొప్ప ధనవంతుడయ్యాడు. తదుపరి గోలకొండ సుల్తాను [[అబ్దుల్లా కుతుబ్ షా]] ప్రాపకము సంపాదించి దర్బారులో [[వజీరు]] స్థానానికి ఎదిగాడు. [[మచిలీపట్టణము]]లో స్థావరము ఏర్పరచుకొని తెలుగు దేశములోని వజ్రసంపదపై గురిపెట్టాడు<ref>The Life of Mir Jumla, J. N. Sarkar, Rajesh Publications, Delhi, 1979, pp. 4-5</ref>.
 
[[విజయనగర]] సామ్రాజ్యంలో వజ్రాల గనులున్న [[రాయలసీమ]]పై ఈతని కన్ను పడింది. విజయనగర రాజులకు విశ్వాసపాత్రులైన [[పెమ్మసాని నాయకులు]] పాలిస్తున్న [[గండికోట]], జుమ్లా ఆశలకు పెద్ద అడ్డుగా నిలచింది. [[గోలకొండ]] దర్బారులో మంత్రిగానున్న పొదిలి లింగన్న ప్రోద్బలంతో క్రీ.శ. 1650లో పెద్ద సైన్యంతో మీర్ జుమ్లా గండికోటపై దండెత్తాడు. అతనికి సహాయముగా ఆధునిక యుద్ధతంత్రం తెలిసిన మైల్లీ అను [[ఫ్రెంచ్]] ఫిరంగుల నిపుణుడు ఉన్నాడు<ref>The French in India, Rose Vincent, 1990, Popular Prakashan, p.9, ISBN 0861322592</ref>.
పంక్తి 17:
==యుద్ధం==
 
అనేక దినాల భీకరయుద్ధం తరువాత కూడా కోట వశము కాలేదు. ఫ్రెంచివారి ఫిరంగుల ధాటికి కోట గోడలు బీటలు వారాయి. [[గండికోట]] అప్పగిస్తే [[గుత్తి]] దుర్గానికి అధిపతి చేస్తానని జుమ్లా బేరసారాలు చేశాడు. [[మంత్రి]] చెన్నమరాజు సంధి చేసుకొమ్మని సలహా ఇచ్చాడు. కాని తిమ్మా నాయుడు అంగీకరించలేదు. విజయమో వీరస్వర్గమో రణభూమిలోనే తేలగలదని నాయుని అభిప్రాయం<ref>Dr Ghulam Yazdani Commemoration Volume, H. K. Sherwani, 1966, Dr Abul Kalam Azad Oriental Research Institute, Delhi</ref>. క్లాడ్ మైలీ అతి కష్టముమీద మూడు భారీ ఫిరంగులను కొండ మీదికి చేర్చాడు. ఈ ఫిరంగుల ధాటికి కోట గోడలు బద్దలయ్యాయి. యుద్ధం మలుపు తిరిగింది.
 
వేలాది యోధులు కోటను పరిరక్షిస్తూ ఫ్రెంచ్ ఫిరంగుల దాడిలో మరణించారు. తిమ్మానాయుని బావమరిది శాయపనేని నరసింహ నాయుడు వీరోచితముగా పోరాడుతూ కోట సంరక్షణ గావిస్తూ అసువులు బాశాడు. చెల్లెలు [[పెమ్మసాని గోవిందమ్మ]] సతీసహగమనము చేయకుండా, అన్న వారిస్తున్నా వినకుండా కాసెగట్టి, అశ్వారూఢయై తురుష్క, ఫ్రెంచ్ సైనికులతో తలపడింది. భర్త మరణానికి కారకుడైన అబ్దుల్ నబీ అను వానిని వెదికి వేటాడి సంహరించింది. అదే సమయములో నబీ వేసిన కత్తి వేటుకు కూలి, వీరమరణము పొందింది. కోటలో వందలాది స్త్రీలు అగ్నిప్రవేశము చేసారు. ఎండు మిరపకాయలు పోగులుగా పోసి నిప్పుబెట్టి ఆందులో దూకారు. హతాశుడైన చినతిమ్మ రాయబారానికి తలొగ్గక తప్పలేదు. గండికోటకు బదులుగా [[గుత్తి కోట]]ను అప్పగించుట ఒప్పందం కుదిరింది. కోట బయటకు వచ్చిన నాయునికి పొదిలి లింగన్న కుతంత్రముతో విషం ఇప్పిస్తాడు. అదే సమయములో గుత్తికోటకు బదులు హనుమనగుత్తి అను చిన్న గ్రామానికి అధిపతినిచేస్తూ ఫర్మాను ఇవ్వబడింది. మోసము తెలుసుకున్న చినతిమ్మ ఫర్మాను చింపివేసి బాలుడైన కొడుకు పిన్నయ్యను బంధువుల కప్పగించి రాజ్యము దాటిస్తాడు. తిమ్మానాయుడు విషప్రభావము వల్ల మరణించాడు.<ref>గండికోట యుద్ధం, కొసరాజు రాఘవయ్య, 1977, కమ్మజన సేవాసమితి, గుంటూరు</ref>
"https://te.wikipedia.org/wiki/గండికోట_యుద్ధం" నుండి వెలికితీశారు