జరుక్ శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

జనన మరణాల
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: షుమారు → సుమారు, ) → ) using AWB
పంక్తి 1:
'''జరుక్ శాస్త్రి''' గా పేరొందిన '''జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి''' [[1914]], [[సెప్టెంబర్ 7]]న [[బందరు]]లో జన్మించారు<ref>{{cite journal|last1=కాట్రగడ్డ రాజగోపాలరావు|title=స్వర్గీయ శ్రీ జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి (సంపాదకీయం)|journal=ప్రతిభ|date=1968-08-02|volume=1|issue=19|page=3|url=http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=853699|accessdate=20 May 2015}}</ref>. [[తెలుగు]] సాహిత్యంలో పేరడీలకు జరుక్ శాస్త్రిని ఆద్యుడిగా భావిస్తారు. అయితే, పేరడీ వంటి కొత్త ప్రక్రియలే కాక సాహిత్యంలోని అన్ని ప్రక్రియలతోనూ ఈయనకి పరిచయం ఉంది. ఈయన [[కృష్ణా పత్రిక]], [[ఆంధ్రపత్రిక]], వాణి - వంటి పత్రికల్లో తరుచుగా వ్యాసాలు వ్రాస్తూ ఉండేవారు. [[ఆంధ్రపత్రిక]], [[వాణి]] పత్రికల్లో సంపాదకవర్గ సభ్యులుగా కూడా పనిచేసారు. [[తెనాలి రామకృష్ణుడు|తెనాలి రామకృష్ణుని]] తరువాత తెలుగునాట జన్మించిన అంతటి ప్రతిభామూర్తి, వికటకవి - శ్రీ జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి అని అంటారు. ఆయన రచనల్లో కొన్ని - "జరుక్ శాస్త్రి పేరడీలు" పేరుతోనూ, కథలు కొన్ని "శరత్ పూర్ణిమ" పేరుతోనూ నవోదయ పబ్లిషర్స్ వారు సంకలనాలుగా వెలువరించారు. ఆయన [[1968]]లో హృద్రోగంతో కన్నుమూసారు.
 
జరుక్ శాస్త్రిగా ప్రసిద్ధులైన వీరు [[చిట్టి గూడురు]] సంస్కృత కళాశాలలో ఉభయభాషా ప్రవీణులయ్యారు. ఆంధ్రపత్రిక ఉపసంపాదకులుగా కొంతకాలం పనిచేశారు. [[మదరాసు]], [[విజయవాడ]] ఆకాశవాణి కేంద్రాలలో స్క్రిప్టు రైటర్ గా పనిచేశారు. నవ్యాంధ్ర సాహిత్యోద్యమంలో ప్రధాన పాత్ర వహించారు. పేరడీ శాస్త్రిగా మంచి పేరు. దేవయ్య స్వీయచరిత్ర (నవల) ప్రచురించారు. ఆనంద వాణిలో ' తనలో తాను ' శీర్షిక నిర్వహించారు. సమకాలీన కవుల రచనలకు పేరడీలు వ్రాసి మెప్పు పొందారు. 1968 జూలై 20న ఉదయం షుమారుసుమారు 4 గం|| [[విజయవాడ]]లో పరమపదించారు. వీరి కుమారులు ప్రసాద్ ఆకాశవాణి [[కర్నూలు]] కేంద్రంలో అకౌంటెంటు.
 
==రచనలు==
పంక్తి 7:
# శబరి (నాటకం)
# కన్యకాపరమేశ్వరి (నాటకం)
# అక్షింతలు (పేరడీ)
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/జరుక్_శాస్త్రి" నుండి వెలికితీశారు