ఎం.ఎస్. సుబ్బులక్ష్మి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎జీవితం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వుంది. → ఉంది. using AWB
పంక్తి 45:
== జీవితం ==
[[దస్త్రం:Ms subbulakshmi.jpg|thumb|right|200px|మీరా చిత్రంలో సుబ్బలక్ష్మి]]
సుబ్బలక్ష్మిలోని ప్రతిభను గుర్తించిన తల్లి [[మధురై]] నుంచి [[చెన్నై]]కి మకాం మార్చటంతో ఆమె జీవితంలో మరో అధ్యాయం ప్రారంభమైంది. ఆమె 1933 లో మద్రాస్ సంగీత అకాడెమీలో తన మొట్ట మొదటి సంగీత కచేరీకి శ్రీకారం చుట్టింది. సంగీతపరంగా సుబ్బలక్ష్మి జీవితంలో ఇది ఒక మలుపైతే తన గురువు, మార్గదర్శి, [[ఆనంద వికటన్]] పత్రిక సీనియర్ ఎగ్జిక్యూటివ్, స్వాతంత్ర్య సమరయోధుడు, జాతీయవాది అయిన '''త్యాగరాజన్ సదాశివన్''' తో 1940 లో ఆమె ప్రేమవివాహం అయింది. సదాశివన్ తొలిభార్య కుమార్తె రాదను పెంచుకున్నారు. ఆ వివాహంతో మరో ముఖ్యమైన మలుపు. 1938 సంవత్సరంలో '' సేవాసదనం '' సినిమా ద్వారా సుబ్బలక్ష్మి సినీ సంగీత ప్రపంచంలో అడుగుపెట్టింది. సదాశివన్ సినీ నిర్మాత కూడా కావడంతో సుబ్బలక్ష్మి సినీ సంగీత జీవితానికి ఎటువంటి అడ్డంకులు ఎదురు కాలేదు. [[తమిళ]] సినిమాలలో గాయనిగా తెరపై కూడా కనిపించి ప్రేక్షకులను అలరించింది. 1940 వ సంవత్సరంలో ''శకుంతలై'' అన్న తమిళ సినిమాలో ఆమె తొలిసారిగా గాయక నటిగా తెరపై కనిపించింది. 1945 వ సంవత్సరంలో నిర్మించబడిన 'మీరా' చిత్రం [[హిందీ]]లో పునర్నిర్మించబడి కూడా విజయవంతం కావడంతో సుబ్బలక్ష్మి పేరు భారతదేశమంతటికీ సుపరిచితమయింది. 'మీరా' సినిమాలోని ఆమె నటనకు, గాన మాధుర్యానికి జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలు లభించాయి. అది ఆమె ఆఖరి సినిమా. భక్తిగాయనిగా సుబ్బలక్ష్మి పేరు ప్రఖ్యాతులు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించడంలో సదాశివన్ కృషి ఎంతో వుందిఉంది.
 
== ఆమె గాత్రం, సోత్రం, గానం, గీతం ==