43,014
edits
({{వేదిక|తెలుగు సినిమా}}) |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వైవిద్య → వైవిధ్య, → , ( → ( (5) using AWB) |
||
lyrics = [[పింగళి నాగేంద్రరావు]]|
}}
విజయా సంస్థ నిర్మించిన చిత్రలలో ఆఖరి విజయవంతమైన చిత్రం '''గుండమ్మ కథ'''. అప్పటిలో ఇది అగ్రశ్రేణి నటులతో నిర్మించిన మల్టీ స్టారర్, కాని "గుండమ్మ కథ" అని సూర్యకాంతం పాత్ర పేరుమీద సినిమా పేరు పెట్టడమే గొప్ప
==ఇతివృత్తం==
గుండమ్మ ([[సూర్యకాంతం]]) భర్త చనిపోయిన ఇల్లాలు, ఆమెకు గయ్యాళిగా ఊళ్ళో పేరుంటుంది. ఆమె స్వంత కూతురు సరోజ ([[జమున (నటి)|జమున]]), సవతి కూతురు జమున ([[సావిత్రి (నటి)|సావిత్రి]]). ఇంటెడు చాకిరీ సవతి కూతురు మీద పడుతుంది. స్వంత కూతురు సరోజ మాత్రం ఏ పనిపాటలూ రాకుండా పెంకిగా తయారవుతుంది. సరోజకు గుండమ్మ పెళ్ళిచేయాలని భావించినప్పుడల్లా ఆమె తమ్ముడు గంటయ్య ([[రమణారెడ్డి]]) ఆమె గయ్యాళి అనీ, ఆమె కూతురు బద్ధకస్తురాలనీ చెప్పి, చూపించి పెళ్ళి చెడగొడతూంటాడు. ఎలాగైనా హత్యచేసి జైల్లో ఉన్న తన కొడుకు ([[రాజనాల]])కి విడుదలయ్యాకా అతనికి ఇచ్చి చేయాలని, అలా చేయాలంటే గుండమ్మ ప్రయత్నాలన్నీ వ్యర్థం కావాలని అతని పథకం. పెళ్ళిళ్ళ పేరయ్య ద్వారా ఒక జమీందారు రామభద్రయ్య ([[ఎస్.వి.రంగారావు]]) ఇద్దరు కొడుకులకు, గుండమ్మ ఇద్దరు కూతుళ్ళను ఇచ్చి పెళ్ళిచేయవచ్చునన్న సంబంధం వస్తుంది. రామభద్రయ్య ఆ ఊరు, తండ్రి పేరు వినగానే ఆయన చనిపోయిన తన స్నేహితుడేనని చెప్తాడు. దాంతో రామభద్రయ్య పెళ్ళి సంబంధం కుదుర్చుకోవడానికి వచ్చి అ యింటి పరిస్థితి అర్ధం చేసుకొంటాడు.
పెద్దకుమార్తె అన్ని విధాలా మంచి గృహిణి అయ్యేదే అయినా ఆమెకు మంచి సంబంధం చేయడం గుండమ్మకు ఇష్టం లేదు, ఏదోక అనాథ, పనివాడు లాంటి బాపతు వ్యక్తికి ఇచ్చిచేసి ఇద్దరినీ ఇంట్లో శాశ్వతంగా పనివాళ్ళను చేసుకోవాలని ఆలోచన. ఇక రెండవ కూతురు పెంకెతనం, బద్ధకం ఉన్నా అవన్నీ తల్లి పెంపకం లోపం వల్ల వచ్చినవేనని పిల్ల మాత్రం మంచిదేనని రామభద్రయ్య నమ్మకం. కానీ ఆమెను కూడా ఎవరైనా ఇల్లరికం వచ్చేవారికి ఇచ్చి చేయాలని ఆశిస్తూంటుంది గుండమ్మ. ఇలా ఇద్దరూ తన కొడుకులకు సరిపోయే పెళ్ళికూతుళ్ళే అయినా గుండమ్మ, ఆమె దగ్గర చేరిన గంటయ్య ఈ పెళ్ళిళ్ళు పడనివ్వరన్న ఆలోచనతో తన కొడుకులు ఆంజనేయ ప్రసాద్ ([[ఎన్.టి.రామారావు]]), రాజా ([[అక్కినేని నాగేశ్వరరావు]])లను పిలిచి పరిస్థితులు వివరిస్తాడు.
వారి పథకం ప్రకారం పెద్దకొడుకు ఆంజనేయప్రసాద్ అంజిగా గంటయ్య ద్వారా గుండమ్మ ఇంట్లో పనివాడిగా చేరతాడు. పొగరున్నా మాంచి పనిమంతుడుగా గుండమ్మను ఆకట్టుకుంటాడు, గంటయ్యని దెబ్బకుదెబ్బ మాటకు మాటతో అదుపుచేస్తూంటాడు. మరోవైపు గుండమ్మ సవతి కూతురు లక్ష్మిని సాటి పనివాడిగా, మంచి మనసున్నవాడిగా ఆకర్షిస్తాడు. గుండమ్మకు ఓ కూతురుతో పాటుగా కొడుకు ([[హరనాథ్]]) కూడా ఉంటాడు. అతనూ, ఓ అమ్మాయి ([[ఎల్.విజయలక్ష్మి]])తో ప్రేమించుకుంటూంటారు. ఆమెకు అన్నయ్యగా రామభద్రయ్య రెండో కొడుకు రాజా ప్రవేశించి, గుండమ్మ స్వంతకుమార్తె సరోజను ఆకట్టుకుంటాడు.
సరోజ మంకుపట్టు పట్టడంతో రాజా వివరాలు తెలుసుకుని అతను ఆస్తిపరుడేనని అంజి చెప్పగా గుండమ్మ పెళ్ళికి అంగీకరిస్తుంది. కానీ ఆమెకన్నా పెద్దదైన గుండమ్మ లక్ష్మి పెళ్ళి సంగతి ఏం చేయాలన్న ఆలోచన వస్తుంది. అదే సమయానికి అంజి తనకు పెళ్ళిచేయకపోతే పనిచేయనని మొండికేస్తాడు. గుండమ్మ లక్ష్మి పెళ్ళి విషయంలో సతమతం కావడం అదనుగా తీసుకుని, "నీకు ఇప్పుడు రెండు సమస్యలు, ఒకటి నా పెళ్ళి, మరోటి బుల్లెమ్మ పెళ్ళి. నాకో పెళ్ళికూతుర్ని తెచ్చి, బుల్లెమ్మకో పెళ్ళికొడుకుని తెచ్చి-తంటాలు ఏం పడతావు కానీ మా ఇద్దరికీ పెళ్ళి చేసెయ్" అని సలహాఇవ్వడంతో పనిచేస్తూండే అనాథ అన్న తనకు కావాల్సిన లక్షణాలు అంజిలో దొరకడంతో అంజికి తన సవతి కూతురిని ఇచ్చి పెళ్ళిచేసేస్తుంది. అలానే తన స్వంత కూతురిని రాజాకు ఇచ్చి చేస్తుంది.
సినిమాలో నటించిన ఇద్దరు కథానాయకులు ఎన్టీఆర్, ఏఎన్నార్ అప్పటికే తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ హీరోలు. సినిమా విడుదల సమయంలో టైటిల్స్ లో ఎవరి పేరు ముందువేయాలి, ఎవరి పేరు తర్వాత వేయాలి వంటి సందేహాలు వచ్చాయి. అయితే దీన్ని పరిష్కరించేందుకు అసలు తెరపై పేర్లే వేయకుండా ఫోటోలు చూపించాలని నిర్ణయించుకున్నారు. మొదట ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, సావిత్రి, జమున, ఎస్వీ రంగారావుల ఫోటోలు ఒకేసారి తెరపై వేసి, తర్వాత ఒకేసారి సూర్యకాంతం, ఛాయాదేవి, రమణారెడ్డి, హరనాథ్, ఎల్.విజయలక్ష్మిల ఫోటోలు వేశారు.<ref name="ఈనాడు ఆదివారం.. 50 వసంతాల" />
=== చిత్రీకరణ ===
గుండమ్మ కథ సినిమాని విజయా నిర్మాతలకు చెందిన వాహినీ స్టూడియోస్ లో నిర్మించారు. సినిమాకు డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా [[మార్కస్ బార్ట్లే]] వ్యవహరించారు. చిత్రీకరణలో అవసరమైన సెట్ లను కళాదర్శకులుగా వ్యవహరించిన గోఖలే, కళాధర్ వేశారు. మేకప్ ఎం.పీతాంబరం, టి.పి.భక్తవత్సలం వేశారు.<ref name="movie titles">గుండమ్మ కథ సినిమా టైటిల్స్</ref>
=== నిర్మాణానంతర కార్యక్రమాలు ===
|
edits