గుత్తి రామకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), కు → కు , తో → తో (3), → (11), , → , using AWB
పంక్తి 39:
==జీవితవిశేషాలు==
===బాల్యం, విద్యాభ్యాసం===
ఇతడు [[1915]], [[జూలై 13]]న [[అనంతపురం]] పాతవూరులోని అంబారపు వీధిలో గుత్తి వెంకటప్ప, నారాయణమ్మ దంపతులకు జన్మించాడు. ఇతడు జన్మించిన తరువాత ఇతని తండ్రి సన్యాసం స్వీకరించి ఆధ్యాత్మిక జీవనం గడిపి, ఎక్కడెక్కడో తిరిగి చివరకు [[హంపి]]లో మరణించాడు. అప్పటికి రామకృష్ణ వయసు 3 సంవత్సరాలు. తండ్రి మరణంతో ఇతడు తన మేనమామ వెంకటరమణప్ప వద్ద పెరిగాడు. ఇతని ప్రాథమిక విద్యాభ్యాసం [[అనంతపురం]] మునిసిపల్ హైస్కూలులో నడిచింది. చదివే రోజులలో ఇతడు క్లాసు పుస్తకాల కంటే ఇతర పుస్తకాలు ఎక్కువగా చదివేవాడు. [[అనంతపురం]] కాలేజీలో దఫేదారుగా పనిచేసిన ఇతని మేనమామ ఇతనికి లైబ్రరీ నుండి మంచి మంచి పుస్తకాలు తెచ్చి ఇచ్చేవాడు. హైస్కూలు చదివే రోజులలోనే వీరేశలింగం రచనలు 10 వాల్యూములు చదివాడు. ఇతడికి చిన్ననాటి నుండే ఆంగ్లేయులంటే ద్వేషం అబ్బింది. అందుకే ఇతడు ఇంగ్లీషు భాష పట్ల కూడా ద్వేషంతో ఆ సబ్జెక్టు చదివేవాడు కాదు. ఫలితంగా ఎస్.ఎల్.సి. పరీక్షలో ఇంగ్లీషు పరీక్ష తప్పాడు. 1936-39లో [[మచిలీపట్నం]]లోని [[ఆంధ్ర జాతీయ కళాశాల, మచిలీపట్నం|ఆంధ్ర జాతీయ కళాశాల]]లో నెలకు 8 రూపాయల ఉపకార వేతనంతో చదివాడు. అక్కడ [[అడివి బాపిరాజు]], [[కాటూరి వేంకటేశ్వరరావు]]లు ఇతని గురువులు. 1937లో ఆచార్య [[ఎన్.జి.రంగా]] రైతాంగ విశ్వవిద్యాలయంలో సమ్మర్ స్కూల్‌లో చదివాడు.
 
===హరిజన హాస్టల్===
చదువు ముగించుకుని [[అనంతపురం]] వచ్చి [[ఐదుకల్లు సదాశివన్]] తో కలిసి హరిజన హాస్టల్ నిర్వహించాడు. [[ఎర్రమల కొండప్ప]], [[1934]]లో [[గాంధీ]] [[అనంతపురం]] వచ్చిన సందర్భంలో దానంగా ఇచ్చిన రెండెకరాల స్థలాన్ని హరిజనోద్ధరణ కోసం కేటాయించగా ఆ స్థలంలో కొట్టాలు వేసి హరిజన హాస్టల్‌ను ప్రారంభించారు. ఇతడు [[ఐదుకల్లు సదాశివన్| సదాశివన్]] తో కలిసి గ్రామగ్రామం తిరిగి తిండిగింజలు సేకరించి హాస్టల్ పిల్లలకు భోజన వసతి కల్పించాడు.
===రాజకీయ జీవితం===
ఇతడు [[కల్లూరు సుబ్బారావు]], [[పప్పూరు రామాచార్యులు]], [[ఎర్రమల కొండప్ప]] మొదలైనవారి నాయకత్వంలో పనిచేశాడు. కాంగ్రెస్‌ పార్టీలో ఉంటూ కమ్యూనిస్టు భావాలవైపు ఆకర్షితుడయ్యాడు. 1939లో [[తరిమెల నాగిరెడ్డి]], [[నీలం రాజశేఖరరెడ్డి]], [[ఐదుకల్లు సదాశివన్]] లతో కలిసి [[అనంతపురం జిల్లా]]లో మొట్టమొదటి కమ్యూనిస్ట్ సెల్ ప్రారంభించాడు. 1941లో ఆకాశవాణి రహస్యపత్రిక నడపడంలో మొదటి [[ముద్దాయి]] [[ఐదుకల్లు సదాశివన్]] తో పాటు మరో ఇద్దరిని విచారణ నిమిత్తం బేడీలు వేసి కొన్ని నెలలు జిల్లా అంతటా తిప్పి [[బళ్ళారి]] , [[అల్లీపురం]] జైళ్లలో ఒక సంవత్సరం [[శిక్ష]] విధించారు. ఆ ఇద్దరిలో గుత్తి రామకృష్ణ ఒకడు. జైలులో కూడా ఇతడు తోటి ఖైదీలలో కమ్యూనిస్టు భావాలను రేకెత్తించాడు. అక్కడ జరిగిన కాల్పులలో ఇతడు ఒక [[కన్ను]]ను కోల్పోయాడు. సంవత్సరం తరువాత మొదటగా విడుదలైన గుత్తి రామకృష్ణ [[వి.కె.ఆదినారాయణ రెడ్డి]]తో కలిసి జిల్లా అంతటా తిరిగి కమ్యూనిస్టు భావాలను ప్రచారం చేశాడు. విద్యార్థి, రైతు ఉద్యమాలలో కూడా చురుకుగా పనిచేశాడు. ఇతడు పోలీసుల అరెస్టు నుండి తప్పించుకునేందుకు 1943లో వ్యాపారం నెపం వేసుకుని [[శ్రీలంక|సిలోన్]] వెళ్ళి ఒక సంవత్సరం తలదాచుకున్నాడు.
 
===వ్యాపారం===
కమ్యూనిస్టు రాజకీయాలనుండి తప్పించాలనే ఉద్దేశంతో ఇతని బంధువులు ఇతడిని [[సిలోన్]] కు ఉల్లిగడ్డల (ఉల్లిపాయల) వ్యాపారానికి పంపించారు. ఆ రోజులలో [[అనంతపురం జిల్లా]]లో ఉల్లిగడ్డలు విస్తారంగా పండించేవారు. [[సిలోన్]] లో ఉల్లిగడ్డలకు మంచి గిరాకీ ఉండేది. ఇతడు [[కొలంబో]]లో ఉంటూ [[అనంతపురం]] నుండి ఉల్లిగడ్డలు తెప్పించి విక్రయించేవాడు. [[కొలంబో]]లో ములాస్ అనే వ్యాపారికి మిలటరీ కాంట్రాక్ట్ ఉండేది. రామకృష్ణ ములాస్‌కు ఉల్లిగడ్డలు సప్లై చేసేవాడు. [[సిలోన్]] లో ఉంటూ ఇతడు కమ్యూనిస్టు పార్టీ సభలకు హాజరౌతూ పార్టీతో సంబంధాలు పెంచుకున్నాడు. దానితో ఇతనిపై పోలీసు నిఘా పెరిగింది. ఈ దశలో కాంట్రాక్టర్ ములాస్ ఇతడిని [[అనంతపురం జిల్లా]]కు తన ఏజెంట్‌గా వెళ్లమని ప్రతిపాదన చేశాడు. దానికి ఇతడు అంగీకరించి [[అనంతపురం]] తిరిగి వచ్చి [[ధర్మవరం]] కేంద్రంగా చేసుకుని పలుప్రాంతాల నుండి ఉల్లిగడ్డలు సేకరించి [[కొలంబో]]కు పంపించసాగాడు.
 
===వివాహం===
పంక్తి 53:
 
===కృష్ణా బుక్ స్టాల్===
ఆ రోజుల్లో [[అనంతపురం]]లో రెండే పుస్తక విక్రయ కేంద్రాలుండేవి. జనరల్ పుస్తకాలు పద్మాబుక్‌స్టాల్ లో మాత్రమే లభించేవి. [[లెనిన్]] రచనలు రష్యన్ ఎడిషన్ అసలు ధర 3 రూపాయలు కాగా 8 రూపాయలకు అమ్మేవారు. ఇది గమనించిన [[తరిమెల నాగిరెడ్డి]] పార్టీ తరఫున పుస్తకాల షాపు పెట్టాలని తీర్మానించాడు. ఆ పనిని గుత్తి రామకృష్ణకు అప్పగించారు. పార్టీ ప్రోత్సాహ సహకారాలతో 1947లో కృష్ణాబుక్‌స్టాల్ ఇతడు ప్రారంభించాడు. అయితే సంవత్సరం తిరగకముందే ఇతడిని డిటెన్యూగా [[కడలూరు]] జైలుకు పట్టుకెళ్లి మూడు సంవత్సరాలు శిక్ష విధించారు. దీనితో బుక్‌స్టాల్ మూతపడింది. 1952లో [[కారాగారము|జైలు]] నుండి విడుదలయిన తర్వాత రెండవసారి కృష్ణా బుక్‌స్టాల్ ను ప్రారంభించాడు. కమ్యూనిస్టు పుస్తకాలతో పాటు ఇతర [[సాహిత్యం|సాహిత్య]] పుస్తకాలు, [[వేదాలు]], [[పురాణములు|పురాణాలు]] మొదలైన అన్ని పుస్తకాలను అమ్మేవాడు. 15 ఏళ్లపాటు ఈ పుస్తకాల షాపు బాగా నడిచింది. కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా చరిత్రలో అది ఒక స్వర్ణయుగం. కృష్ణా బుక్ స్టాల్ పార్టీకి సమన్వయ కేంద్రంగా ఉండేది. ఇతడు కమ్యూనిస్ట్ పార్టీ కో ఆర్డినేటర్‌గా పనిచేశాడు. [[తరిమెల నాగిరెడ్డి]], [[నీలం రాజశేఖరరెడ్డి]], నీలం రామసుబ్బారెడ్డి, [[పైడి లక్ష్మయ్య]] తదితర నాయకులు, పలువురు మేధావులకు కృష్ణా బుక్‌సెంటర్ ఒక అడ్డాగా మారింది. పట్టణంలో జరిగే అనేక రాజకీయ, సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ రూపుదిద్దుకునేవి. ఆవిధంగా జిల్లా రాజకీయ, సాంస్కృతిక వికాసంలో కృష్ణా బుక్‌స్టాల్ పాత్ర అమోఘమైనది. 1964లో కమ్యూనిస్టు పార్టీలో చీలిక వచ్చిన నేపథ్యంలో ఈ కృష్ణాబుక్ స్టాల్ మూతపడింది.<ref>స్వాతంత్ర్య సమరయోధుడు గుత్తి రామకృష్ణ - అనంతనేత్రం, [[అనంతపురం జిల్లా]] ప్రత్యేక సంచిక, వార్త దినపత్రిక పేజీ 116 </ref>.
 
==పాత్రికేయ జీవితం==
ఇతడు స్వాతంత్ర్యానికి పూర్వమే బ్రిటీష్ హయాంలోనే స్వతంత్రభారత్, ఆకాశవాణి పత్రికలకు జిల్లా సమస్యల గురించి వ్యాసాలు, వార్తలు వ్రాస్తూ ప్రజా సమస్యలను ప్రతిబింబింప జేసేవాడు. [[ప్రజాశక్తి]], [[విశాలాంధ్ర]], దక్కన్ క్రానికల్, [[ఆంధ్రభూమి]], [[ఆంధ్రజ్యోతి]], [[ఈనాడు]], జనశక్తి, ఉజ్జ్వల, జనత మొదలైన పత్రికలకు తొలి విలేఖరిగా పనిచేశాడు. దాదాపు 70 సంవత్సరాలు పత్రికా [[విలేఖరి]]<nowiki/>గా పనిచేశాడు. భారత [[లంబాడి|బంజార]] సంఘం ప్రోత్సాహంతో బంజారా పత్రికను [[అనంతపురం]] నుండి రెండేళ్లపాటు సంపాదకుడిగా ఉండి నడిపాడు. జనప్రభ దినపత్రికకు కూడా సంపాదకుడిగా పనిచేశాడు.
 
==కథలు==
"https://te.wikipedia.org/wiki/గుత్తి_రామకృష్ణ" నుండి వెలికితీశారు