గోల్కొండ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వుంది. → ఉంది. (9), లు నుండి → ల నుండి, దృడ → దృఢ using AWB
పంక్తి 13:
గోల్కొండ నాలుగు వేర్వేరు కోటల సముదాయం, ఒకదానిని చుట్టి మరొకటి నిర్మించబడ్డాయి. కోటను పెంచుటలో, పటిష్ఠపరుచటలో కుతుబ్‌షాహిలదే ప్రధాన పాత్ర. మొదటి నిజాం వశమైన కాలంలో కోట వెలుపలి భాగాన తూర్పు దిక్కున ఒక గుట్ట ఉండేది. దానిని శత్రువు ఆక్రమిస్తే తరలించుట కష్టమని భావించిన నిజాం గుట్టను కోటలోపలికి కలుపుతూ చుట్టూ గోడను నిర్మించాడు. దుర్గం చుట్టూ గుట్టలు పెట్టని కోటలవలె ఉన్నాయి. ఈ కోట 87 అర్ధ చంద్రాకారపు బురుజులతోకూడిన 10 కి.మీ. పొడవు గోడను కలిగి ఉంది; కొన్ని బురుజులలో ఇంకా ఫిరంగులను నిలిపిఉంచారు. ఇంకా 8 సింహద్వారములు, 4 ఎత్తగలిగే వంతెనలు (draw bridge), బోలెడన్ని రాచమందిరాలు, మసీదులు, గుళ్ళు, అశ్వశాలలు మొదలగునవి చాలా ఉండేవి. సింహద్వారములలో అన్నిటికంటే కిందది మరియు అన్నిటికంటే బయట ఉండే ఫతే దర్వాజా (విజయ ద్వారము) నుండే మనము గోల్కొండ కోటను చూడటానికి వెళ్తాము. ఔరంగజేబు విజయము తరువాత ఈ ద్వారము గుండానే తన సైన్యమును నడిపించాడు. ఏనుగుల రాకను ఆడ్డుకోవటానికి ఆగ్నేయము వైపున పెద్ద పెద్ద ఇనుప సువ్వలు ఏర్పాటు చేసారు. ఫతే దర్వాజా నిర్మించటానికి ధ్వనిశాస్త్రమును ఔపోసన పట్టినట్లున్నారు. గుమ్మటం కింద ఒక నిర్ణీత ప్రదేశమునందు చప్పట్లు కొడితే కిలోమీటరు ఆవల గోల్కొండలో అతి ఎత్తయిన ప్రదేశములో ఉన్న "బాలా హిస్సారు" వద్ద చాలా స్పస్టముగా వినిపిస్తుంది. ఈ విశేషమును ఒకప్పుడు ఇక్కడి నిర్వాసితులు ప్రమాదసంకేతములు తెలుపుటకు ఉపయోగించేవారు. ఇప్పుడు మాత్రం సందర్శకులకు వినోదం పంచేదిగా మిగిలిపోయింది.
==బారాదరి==
ఇది మూడు అంతస్తులలో నిర్మించబడిన రాజుగారి సభా మండపము. దీని నుండి ''గోషామహల్‌ బారాదరి హైదరాబాదు'' భూమార్గము కూడా వుందిఉంది. దీని పై అంతస్తులో రాజ సింహాసనము వుందిఉంది. దీని నుండి 30 మైళ్ళ విస్తీర్ణములో అతి సుందరము, శోభాయమానముగా కన్పిస్తుంది. ఇది సముద్ర మట్టమునకు 400 అడుగుల నుండి 2000 అడుగులుంటుంది. దీని నుండి తూర్పుగా కుతుబ్‌షా వంశపు శిథిలమైన భవనములు, లంగర్‌హౌజ్‌ చెరువు, హైదరాబాద్‌ నగరమున ముఖ్య కట్టడమైన చార్‌మినార్‌, మక్కా మసీదు, ఉస్మానియా వైద్యశాల చూడొచ్చు. తూర్పు-దక్షిణ మూలగా మీర్‌ ఆలమ్‌ చెరువు, ఫలక్‌నుమా భవనము, దక్షిణముగా మకై దర్వాజా, హిమయత్‌నగర్‌, దీనికి దక్షిణమున పడమర మూలగా తారామతి, ప్రేమామతి భవనములు, ఉస్మాన్‌ సాగర్‌ చెరువు (గండిపేట) పడమరగా ఉన్నాయి. తూర్పు - ఉత్తర మూలగా హుసేన్‌ సాగర్‌ చెరువు, సికింద్రాబాదు నగరము, ఉస్మానియా యూనివర్సిటీని చూడవచ్చు. ఉత్తర-పడమర మూలగా కుతుబ్‌షా రాజుల గోపురములు పెట్లాబురుజు చూడొచ్చు. ఉత్తరముగా గోల్కొండ కోట పట్టణము, హకీం పేట, బేగంపేట విమానాశ్రయాన్ని చూడొచ్చు.
 
==దర్వాజలు==
పంక్తి 31:
==కుతుబ్‌షా రాజుల స్నానము==
[[File:Golconda... board. bath place of dead bodies.JPG|thumb|right|కోటలో బాలహిస్సార్ లోపలికెళ్ళగానె కుడి ప్రక్కన శవ స్నానాల గది.]]
బాలాహిసార్‌ గేటు నుండి లోనికి ప్రవేశించేటపుడు కుడి చేతి వైపు ఈ స్నానముల గది వుందిఉంది. కొంచెము నగీనా తోటకు కుడి చేతి వైపు పక్కన వేడి నీళ్ళు... చన్నీళ్ళు వచ్చేలా నేల మార్గమున గొట్టములను అమర్చి కట్టినది. ఈ కుళాయిలను చెరువు నుండి నింపేవారు. ఈ నీటిని అతి ముఖ్యమైన సందర్భములలో ఉపయోగించేవారు. ఎవరయినా రాజ వంశస్తులు దివంగతులైనపుడు ఇక్కడ వేడి నీటితో స్నానము చేయించి శవపేటికను ఉత్తరపు ద్వారము నుండి బయటకు తీసుకెళ్లేవారు.
==కఠోరా హౌస్‌==
కుతుబ్‌షాహీలు స్నానం చేసేందుకు ప్రత్యేక ఏర్పాటు ఇది కోటలోని 'బాలాహిసార్‌' కు ఉత్తర దిశగా నిర్మితమై ఉంది. ఇది 200 గజముల పొడవు, అదే వెడల్పులో, 5 గజముల లోతుగా నిర్మించిన నీటిని నిలువచేసే స్థలం. దీనిని ఒక చెరువు నుండి వచ్చే నీటితో నింపేవారు. దీనికి పడమర దిశలో ఉన్న గేటు దగ్గర శబ్దం చేస్తే అది అన్ని వైపులకు ప్రతిధ్వనిస్తుంది. ఈ నీటి హౌస్‌ను రాజులు, మరి కొందరు ప్రముఖులు వినోద స్థలముగా ఉపయోగించేవారు.
 
==నగీనా బాగ్‌==
తోటకు దక్షిణముగా ఆర్కులలో రాజకుమారులు, రాజకుమార్తెలు ఊగేందుకు ఊయలలు అమర్చబడి ఉన్నాయి. ఇప్పటికీ వాటి గుర్తుగా ఆర్కులోని రాళ్ళలో రంధ్రములు కన్పిస్తాయి. నగీనా గార్డెన్‌ నుండి వెళ్ళే సన్నని మార్గంలో ఎడమ చేతివైపు ఒక కట్టడము వుందిఉంది. ఇది రక్షకభటుల కోసం నిర్మించిన భవనము. కుతుబ్‌షా వంశపు రాజులలో ఏడవవాడు, ఆఖరివాడు అయిన అబ్దుల్‌ హసన్‌ తానీషా పరిపాలనలో, రక్షక భటులకోసం కట్టబడిన భవన మార్గములోనే ఆయన మంత్రివర్యులైన అక్కన్న మాదన్నల కోసం నిర్మించిన కార్యాలయ భవనం వుందిఉంది.
==బడీ బౌలి==
బాలాహిసార్‌ మెట్లకు కుడిపక్కగా ఒక పెద్ద బావి వుందిఉంది. దీనిని బడీ బౌలి అని పిలిచేవారు. ఈ బావిలో ఒక మూల రాయి వుందిఉంది. అది వేసవి కాలములో నీరు కిందపడడానికి ఉపయోగపడేది. ఈ బావికి దగ్గరలో రెండు వరండాలున్న ఒక భవనముంది. దీనిలో రాజులు కూర్చొని ప్రకృతి సౌందర్యమును తిలకించేవారు.
==డ్రగ్‌ ట్యాంక్‌ కాలువ==
బడి బౌలికి కొద్ది దూరంలో మెట్లకిందుగా పారే ఒక కాలువ వుండేది. ఇది డ్రగ్‌ చెరువు కోటకు 5 మైళ్ళ దూరంలో వుందిఉంది. కోటలో ఉన్న తోటలకు, చేలకు ఈ కాలువ ద్వారానే నీరును మళ్ళించేవారు, పంటలు పండించేవారు.
 
==ఎల్లమ్మ దేవి==
పంక్తి 46:
 
==దాద్‌ మహల్‌==
రోడ్డుకు తూర్పు దిశగా దీని బాల్కనీ వుందిఉంది.. బాల్కనీ ముందు పెద్ద ఖాళీ స్థలము వుంటుంది. ఇక్కడికి ప్రజలు వచ్చి తమ కష్టసుఖాలు చెప్పుకొనేవారు. రాజు ఈ బాల్కానీలోంచి వినేవారు.
 
==బాలా హిస్సారు దర్వాజా==
[[File:Balahissar entrance top.JPG|thumb|right|గోల్కొండ కోట లోపలి ద్వారము: బాల హిస్సార్]]
అన్ని ముఖద్వారములలోకి బాలా హిస్సారు దర్వాజా చాలా మనోహరమయినది. ఆర్చీల మూల ఖాళీలలో ఉన్న సన్నటి రాతి పలకల మీద కాల్పనిక మృగాలు మరియు సింహపు బొమ్మలు ఈ రక్షణ ద్వారమునకు ప్రత్యేక అలంకారాలు. బాలా హిస్సారు దర్వాజా నుండి కొండపైకి వెళ్ళటానికి 380 ఎగుడు దిగుడు రాతిమెట్లు ఉంటాయి. ఆ మెట్లు అన్నీ ఎక్కిన తరువాత మనకు బాలా హిస్సారు బారాదరీ అని పిలవబడే ఒక మంటపము కనిపించును. దర్బారు హాలుగా ఉపయోగించే ఈ కట్టడములో 12 ఆర్చీలు, 3 అంతస్తులు ఉన్నాయి. దానిని వంపు తిరిగిన గదులుగా దృడమయినదృఢమయిన స్థంబాలతో విభజించారు. ఎత్తులో ఉన్న ఒక గదికి ఆనుకొని ఉన్న మూడు ఆర్చీలద్వారా వెనుక ద్వారము తెరుచుకొనును. ఒక ఎత్తయిన మిద్దెపైన మనకు రాతి సింహాసనము కనిపించును. కొండలలో విసిరేసినట్లున్న ఈ మంటపములో అబుల్ హసన్ లు తమ ఉంపుడుగత్తెలను ఉంచేవారని చాలామంది నమ్మకము. బారాదరీలో మనకు మరో విశిష్టత కనిపిస్తుంది - జంట గోడల మధ్య ఉన్న ఖాళీలు గాలిని పీల్చి, పీడనం పెరిగేటట్లుగా గదిలోనికి వదులుతూ, సహజసిద్ధమయిన కూలరు వలె ఉంటుంది.
 
==దేవాలయములు మసీదులు==
పంక్తి 63:
ఏటవాలుగా, ఇరుకుగా ఉన్న మెట్లు కింద ఉన్న జనానాకు మరియు రాణీగారి మహలుకు దారితీయును. అక్కడి రాచమందిరాలు, పెద్ద పెద్ద మిట్టలమీద కట్టారు, వాటికి ఎత్తయిన పైకప్పులు ఉన్నాయి, గోడలన్నీ అలంకార వస్తువులతో నింపి పొదరిల్లులు మరియు చూరులు పర్శియను తరహా రూపకల్పనతో ఎంతో అందముగా తీర్చిదిద్దారు. ఆర్చీల మూలలలో సన్నటి పలకలపై నాజూకు ఆకృతులు మరింత శోభను తెచ్చిపెడుతుంది. రాణీ మహలులో ఉండే ఈ విశేష భోహములను చూసి నాటి మొగలులే అసూయచెందేవారు.
 
దర్బారు హాలుహాల నుండి కొండపాదమున ఉండే ఒక రాచమందిరమునకు దారి చూపే రహస్య సొరంగ మార్గము ఉండేదని ఒక అభిప్రాయము. ఇస్లాముమత వాస్తుశాస్త్రము ఆధారముగా నిర్మించిన కుతుబ్ షాహీ నవాబుల సమాధులు గోల్కొండకు ఉత్తర దిక్కులో బయట గోడకు 1 కి.మీ. దూరమున నిర్మించారు. ఈ సమాధుల చుట్టూ వనములు, వాటి మధ్య అందమయిన రాతి శిల్పాలు ఉన్నాయి.
 
కోట బయట రెండు వెర్వేరు మండపాలను బండరాళ్ళతో నిర్మించారు. వాటిని తారామతి మందిరము మరియు ప్రేమతి మందిరము అని పెలిచేవారు. వీటిలో అక్కాచెళ్ళెలయిన తారామతి మరియు ప్రేమతి నివసించేవారు. వారు రెండంతస్తుల పైన ఒక వృత్తాకారపు వేధికపై తమ ప్రధర్శనలు ఇచ్చేవారు. దానిని కళామందిరమని పిలిచేవారు. దానిని గోల్కొండ కోట పైన ఉన్న రాజుగారి దర్బారునుండి తిలకించవచ్చును.
"https://te.wikipedia.org/wiki/గోల్కొండ" నుండి వెలికితీశారు