గ్రామ దేవత: కూర్పుల మధ్య తేడాలు

+కృష్ణా జిల్లా గ్రామదేవతలు లింకు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వుంది. → ఉంది. (2), ప్రార్దించ → ప్రార్థించ, దర్సన → దర్శన using AWB
పంక్తి 18:
;పృధ్వీ దేవత
 
పృధ్వీ అంటే నేల, ఇది పంటకి ఆధారము, [[కుంకుడు|కుంకుల్లు]] బాగా పండే ప్రాంతములో ప్రతిష్ఠించిన పృధ్వినీ దేవతను '''కుంకుళ్ళమ్మ''' అన్నారు. గోగులు బాగా పూచే ప్రాంతములో ఆ [[గోంగూర]], గోగునార. ఇవే వారి జీవన ఆధారము కాబట్టి ఆపేరుతో '''గోగులమ్మ'''ని యేర్పాటు చేసారు. [[జొన్న]]లు పండేచోట '''జొన్నాళమ్మ''' అని, నూకలు అంటే [[వరి]] పండే ప్రాంతాలలో '''నూకాళమ్మ''' అని పిలుచుకున్నారు. మొదటిసారిగా పండిన పంటను ఆతల్లికే నివేదన చేయడము, అర్చకునిగా వున్నవానికి అందరూ ఆ పంటను యిస్తూవుండడము, దాన్నే సొమ్ముగా మార్చుకొని అతడు జీవించడము. ఇలా సాగుతూ వుండేదీ వ్యవస్థ. పంట వేసేటప్పుడుకూడా ఈ తల్లిని ఆరాదిస్తేగాని చేనుకి వెల్తూండేవారు కాదు. [[అన్నం|అన్నాన్ని]] పెట్టే తల్లి కాబట్టి '''అన్నమ్మ''' అని కూడా ఒక దేవత వుందిఉంది. ఇక పంటలన్నీ చేతికందాక సుఖసంతోషాలతో '''[[జాతర]]''' చేస్తూండేవారు. అదే ఇప్పటికీ అనేక గ్రామాలలో కొనసాగూతూండడం జరుగుతూ ఉంది.
 
;జల దేవత
పంక్తి 38:
== పోషణ, రక్షణ నిచ్చే దేవతలు==
[[File:Diety reliefs at Village Outskirts in Rajula Tallavalasa, Visakhapatnam district.jpg|thumb|250px|విశాఖ జిల్లాలో ఒక గ్రామ దేవత ప్రతిరూపాలు పూజింపబడుతున్నవి]]
ఇక ప్రజల మనసులో పుట్టి ఏ కోర్కెనైనా మంచిదో కాదో తానే నిర్ణయించి కోరిన కోర్కెని తీర్చే బాధ్యతని స్వీకరంచి భక్తులకు అండగా నిలిచే తల్లి '''తలుపులమ్మ'''. తలపు అంటే ఆలోచన వాటిని తీర్చే తల్లి తలపులమ్మ క్రమముగా ఈమె 'తలుపులమ్మ'గా మారింది. ఇంట్లో నుండి బయటికి వెల్లేటపుడు తల్లికి లేదా భార్యకి ఎలా చెప్తామో అలాగే ఆ తల్లిని ప్రార్దించిప్రార్థించి వెళ్ళడం చేస్తారు. వూరిని విడిచి పొరుగూరు వెళ్ళే వ్యక్తుల రాకపోకల్ని గమనిస్తూ వూరి పొలిమేరలో వుండేతల్లి '''పొలిమేరమ్మ''' క్రమముగా '''పోలేరమ్మ''' అయింది. పొలిమేరలో వుండే మరొక తల్లి '''శీతలాంబ'''. ఈమె చేతుల్లో చీపురు, చేట ఉంటాయి. తన గ్రామములోని ప్రజలకు వ్యాదులను కలిగించే క్రిమి కీటకాలని, భయాన్ని కలిగించే భూత ప్రేత పిచాచ గణాలను గ్రామములోనికి రాకుండా వూడ్చి చేటలోకి ఎత్తి పారబోసేది ఈదేవతే. 'ఎల్ల' అంటే సరిహద్దు అని అర్దము అందుకే 'ఎల్లమ్మ' కూడా ఈ పనిని చేసేదన్నమాట. ఒక వ్యక్తికి జీవన భృతి కలిగించి పోసించే తల్లి 'పోచ+అమ్మ=పోచమ్మ' అన్నమాట. ఎల్లమ్మ తల్లి తన భక్తులకి ఎటువంటి వ్యాధులు రాకుండా నివారించేదైతే, పోచమ్మ పోషణ కలిగిస్తుంది. ఇక పాములు బాగా సంచరించే చోటులో వుండే దేవత తల్లి '''పుట్టమ్మ''' ఈమె గుడిలో అనేక పుట్టలుంటాయి. అక్కడే సుబ్రహ్మణ్య షష్టికి అందరూ పుట్టలో పాలు పోస్తారు. ఈ తల్లికే 'నాగేశ్వరమ్మ' అని కూడా అంటారు. పాము+అమ్మ=పాపమ్మ అవుతుంది కాబట్టి ఈ తల్లికి పాపమ్మ అని కూడా అంటారు. [[సుబ్రహ్మణ్య స్వామి|సుబ్రహ్మణ్యేశ్వరుడు]] పేరుమీదే 'సుబ్బ+అమ్మ=సుబ్బమ్మ కూడా దైవముగా వుందిఉంది.
 
==గ్రామదేవతా నామ విశేషాలు ==
సాధారణముగా 15 వూళ్ళకో దేవత వుంటుంది. 'మా వూళ్ళన్నింటికీ అమ్మ' అనే అర్దములో ఆమెను '''మావూళ్ళమ్మ''' అని పిలుస్తూంటే క్రమముగా అది 'మావుళ్ళమ్మ' అయింది. [[శివుడు|శంకరునితో]] కలసి అర్దనారీశ్వర రూపముతో అమ్మవారుండేది. ఆకారణముగా శంకరుని మెడమీద (గళము) మచ్చ (అంకం) కారణముగా అంకగళమ్మ '''అంకాళమ్మ''' మారిపోయింది. బతుకుకి కావలసిన వర్షాన్ని పంటనీ ఇచ్చే తల్లి '''బతుకమ్మ'''. ప్రతి వ్యక్తికీ ఇంతకాలము జీవించాలనే ఓ కట్ట (అవధి) ఏదుందో ఆ కట్టని మేయగల (ఆ అవధినించి రక్షించగల) అమ్మే 'కట్టమేయ+అమ్మ=కట్టమేసెయమ్మ కాలక్రమములో '''కట్టమైసమ్మ''' అయింది. గ్రామప్రజల మంచిని చూసే (కనే) అమ్మ '''కన్నమ్మ'''గా ఎప్పుడూ సత్యాన్ని (నిదర్సనాలనినిదర్శనాలని) చూస్తూవుండే తల్లి సత్య+అమ్మ= '''సత్తెమ్మ'''. స్వచ్ఛమైన అమ్మ అనే అర్దములో అచ్చ (స్వచ్ఛమని)సు+అచ్చ=స్వచ్ఛ అనే రెండు పదాలు కలిపి '''అచ్చమ్మ'''గా అయ్యింది. అలాగే పుల్ల (వికసించిన కళ్ళున్న)అమ్మ '''పుల్లమ్మ'''. ప్రతి విషయాన్ని ఎంతో శ్రద్ధగా పరిశీలించి చూస్తుంది కాబట్టి ఆమె పుల్లమ్మ అయ్యింది. ఇక ప్రతి శుభకార్యానికి నైవేద్యాన్ని అర్పించుకొనే చోటవున్న తల్లి అర్పణ+అమ్మ = అర్పణలమ్మ క్రమముగా '''అప్పలమ్మ''' అయినది. [[బెల్లము]] బాగా వున్న ప్రాంతాలలో ఈ తల్లికి అప్పాలు బాగా ఇష్టమంటూ భావించే భక్తులు అప్పాల+అమ్మ= '''అప్పలమ్మ''' అన్నారు. అమ్మవార్ల వూరేగింపులో అన్నిటికన్న చిన్నది [[బాలా త్రిపుర సుందరి]] విగ్రహానికి సమమైన వుజ్జీ అయినదీ పెంటి (బాల)+అమ్మ= '''పెంటమ్మ'''. భోజనాన్ని అందించగల తల్లి అనే అర్దములో బోనముల (భోజనమనే పదానికి విక్రుతి)+అమ్మ= '''బోనాలమ్మ'''. అయ్య అయిన శంకరునికి అమ్మ (భార్య) కాబట్టి ఈమెను 'అయ్యమ్మ' అని కూడా కొన్ని చోట్ల పిలుస్తారు. [[లలిత|లలితాంబ]], [[భండాసురుడు|భండాసురుణ్ణి]] చంపేందుకు గుర్రాలమీద కూర్చొన్న స్త్రీ సైనికుల సైన్యముతో వెళ్ళినది కాబట్టి గుర్రాల+అమ్మ= '''గుర్రాలమ్మ''' అయినది. ఇక ఊరు పేరుని బట్టి పిల్చుకొనే దేవతలు కొందరున్నారు. సోమప్రోలు+అంబ='సోమపోలమాంబ' అన్నారు. సోమప్రోలు అనే గ్రామము ఉత్తరాంధ్ర [[శ్రీకాకుళం]] జిల్లాలోని సోంపేట.
 
==అమ్మోర్లు==
"https://te.wikipedia.org/wiki/గ్రామ_దేవత" నుండి వెలికితీశారు