కిన్నెరసాని: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: చేసినది. → చేసింది., కూడ → కూడా , విద్యుఛ్ఛక్తి → విద్య using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కిన్నెరసాని''', [[గోదావరి]] నది యొక్క ఉపనది. [[కిన్నెరసాని]] [[వరంగల్ జిల్లా]]లోని మేడారం - [[తాడ్వాయి]] కొండసానువుల్లో పుట్టి ఆగ్నేయంగా ప్రవహించి [[ఖమ్మం జిల్లా]]లో భద్రాచలానికి కాస్త దిగువన [[బూర్గంపాడు]], [[శ్రీధర-వేలేరు|వేలేరు]] గ్రామాల మధ్యన గోదావరిలో[[గోదావరి]]<nowiki/>లో కలుస్తుంది. 96 కిలోమీటర్లు ప్రవహిస్తున్న ఈ నది యొక్క ఆయకట్టు ప్రాంతం మొత్తం 1300 చదరపు కిలోమీటర్లు.
 
కిన్నెరసాని ఉపనదైన మొర్రేడు, [[కొత్తగూడెం]] పట్టణం గుండా ప్రవహించి [[సంగం (పాల్వంచ)|సంగం]] గ్రామం వద్ద కిన్నెరసానిలో కలుస్తుంది.
 
==కిన్నెరసాని ప్రాజెక్టు==
[[దస్త్రం:View from a dam in Kinnarsani WS, AP W IMG 5776.jpg|thumbnail|కిన్నెరసాని జలాశ్రయంలో ఒక చిన్న దీవి]]
కిన్నెరసాని నదిపై [[పాల్వంచ]] మండలములోని [[యానంబైలు]] గ్రామము వద్ద విద్యుత్ ఉత్పాదనకై మరియు కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రానికి నీరందించేందుకు కిన్నెరసాని ప్రాజెక్టు నిల్వ జలాశ్రయాన్ని నిర్మించారు. [[1972]]లో నిర్మాణము పూర్తి చేసున్న ఈ ప్రాజెక్టుకు 558 లక్షల వ్యయమైనది. [[1998]] ఏప్రిల్ లో రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈ ప్రాజెక్టును విద్యుచ్ఛక్తి శాఖకు బదిలీ చేసింది. ఈ ప్రాజెక్టు [[వ్యవసాయం|వ్యవసాయ]] భూములకు, విద్యుత్ ఉత్పత్తికే కాక పాల్వంచ, [[కొత్తగూడెం (ఖమ్మం జిల్లా పట్టణము)|కొత్తగూడెం]] పట్టణ ప్రజలకు త్రాగునీరు కూడా అందిస్తుంది.
 
2005లో జలయజ్ఞం పథకం క్రింద పాల్వంచ, [[బూర్గంపాడు]] మండలాల్లో పదివేల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు కిన్నెరసాని ప్రాజెక్టుకు కుడి మరియు ఎడమ కాల్వల నిర్మాణాన్ని ఆమోదించారు. తొలి విడతలో భాగంగా నిర్మించిన కుడి ప్రధాన కాల్వను 2012లో [[ముఖ్యమంత్రి]] నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి ప్రారంభించాడు.<ref>http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/article3740522.ece</ref>. ఇక్కడ ఒక వణ్యప్రాణీ సంరక్షణ కేంద్రం ఉంది. దీన్ని కిన్నెరసాని అభయారణ్యంలో నెలకొల్పారు.
 
==సాహిత్యంలో==
కిన్నెరసాని నది వృత్తాంతాన్ని వర్ణిస్తూ [[విశ్వనాథ సత్యనారాయణ]] ''కిన్నెరసాని పాటలు'' అనే కవితా సంపుటాన్ని వ్రాశాడు. ఇది 1925లో ''కోకిలమ్మ పెళ్లి''తో పాటు ఒకే సంచికలో ప్రచురితమైంది. విశ్వనాథ సత్యనారాయణ తండ్రి శోభనాద్రి కష్టదశలో కిన్నెరసాని వాగుకు ఆవల ఉన్న గ్రామంలో కౌలుకు భూమి తీసుకుని [[వ్యవసాయం]] చేశారు. ఆయనతో పాటుగా కుమారుడు విశ్వనాథ సత్యనారాయణ కూడా వెంటవెళ్ళేవారు. ఆ గ్రామానికి వెళ్ళే మార్గంలో వాగును దాటేప్పుడు కిన్నెరసాని వాగును భద్రాచలం అడవులలో చూచినప్పుడు ఆయన మనస్సు ఆ వాగుతో సంవదించింది. చుట్టూపులులూ పుట్రలూ ఏమీ పట్టలా, పాములు ప్రక్కగా పోయినాయి ఆయనకు పట్టలేదు. ఆ వాగు వలెనే తన భావప్రవాహం సాగిపోయింది. కులపాలికా ప్రణయపూతమైన తన హృదయంలో పడిన ఆ వాగు పవిత్రచారిత్రయైంది.<ref>{{cite book|last1=భరతశర్మ|first1=పేరాల|title=విశ్వనాథ శారద (విశ్వనాథలోని నేను వ్యాసం)|date=సెప్టెంబరు 1982|publisher=విశ్వనాథ సత్యనారాయణ స్మారక సమితి|location=హైదరాబాద్|page=17|edition=మొదటి ప్రచురణ|accessdate=17 November 2014}}</ref>
 
కిన్నెరసానీ! ఊహలోనైనా కాస్త నిలువమని ఆమె భర్త ప్రాధేయపడుతున్నాడు.
పంక్తి 48:
ఏ ఉపాయంతోనైనా మళ్ళీ మనిషిగా మారితే బాగుండుననే కోరికను ఆపుకోలేక విలపించింది కిన్నెరసాని . అంటే ఆమె తన భర్తప్రేమకు చలించిపోయి తన తొందరపాటుకు పశ్చాత్తపడిందని అర్ధం.
తనను విడిచి ఆమెభర్త జీవీంచలేడని ఆమె బ్రతికుండగా గ్రహించలేకపోయింది. అది తెలిసి ఉంటే అతనితో ఎంతో ప్రేమగా ఉండే దాన్నని కిన్నెరసాని ఎంతో వెలపించింది.
అటువంటి భర్తతో[[భర్త]]<nowiki/>తో కాపురాన్ని ఇలా నాశనం చేసుకున్నానని కిన్నెర ఎంతో దిగులుపడింది.
చివరికి ఏమీ చేయలేక కిన్నెరసాని రాయిగా మారిన భర్తను తన అల్లలు అనే చేతులతో చుట్టి ఎంతో వ్యధచెందింది.
కొండగా మారిన భర్తను మాటిమాటికి కిన్నెర చేతులతో కౌగిలించి అలలమోతతో పలుకరించింది.
"https://te.wikipedia.org/wiki/కిన్నెరసాని" నుండి వెలికితీశారు