రంజాన్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సంను → సాన్ని (2), లొ → లో, కొసము → కోసము, వున్నాయి. → ఉన్న using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వుంది. → ఉంది. (4), తరవాత → తరువాత, ) → ) using AWB
పంక్తి 14:
== ఉపవాస విధి ==
రంజాన్ మాసంలో ప్రతి దినం అయిదు పూటల నమాజు చేయడం, రంజాన్ నెలలో కఠిన ఉపవాస దీక్ష రోజా పాటించడం అనేది వయోజనులైన స్త్రీపురుషులందరికీ విధిగా నిర్ణయించబడింది. అయితే వృద్దులు, పిల్లలు, వ్యాధిగ్రస్తులు, ప్రయాణంలో వున్నవారు ఈ విధి నుండి మినహాయింపబడ్డారు. దివ్యఖురాన్ ఉపవాస విధిని గురించి ' రంజాన్ నెలలో విధిగా నెలంతా ఉపవాసం పాటించాలి. అయితే ఎవరైనా ప్రయాణంలో వుంటే, వ్యాధిగ్రస్తులయితే వారు ఆ ఉపవాసాలను వేరే రోజులలో పూర్తిచేయాలి. దేవుడు మీకు సౌలభ్యం కలుగజేయాలని భావిస్తూ వున్నాడు కానీ, మిమ్మలను ఇబ్బందులలో పడవేయాలని అనుకోవడం లేదు అని పేర్కొంది.రంజాన్ అనగా ఉపవాస దీక్షలు మాత్రమే కాదు మనిషిలోని చెడు భావనల్ని మరియు అధర్మాన్ని ద్వేషాన్ని రూపుమాపేది. ఈ మాసంలో పేదవాడికి ఒక పూట నీవు ఆహారం పెడితే నీకు ఆ అల్లా 1000 పూటలు ప్రసాదిస్తాడు. రంజాన్ మాసమంతా ఇస్లాం మత విశ్వాసులకు పవిత్రం, పుణ్యదాయకం.
ప్రాతఃకాలం సహరీతో ఉపవాస దీక్ష రోజాకు సంకల్పించి సూర్యాస్తమయం తరవాతతరువాత ఇఫ్తార్‌తో విరమిస్తారు. తదుపరి తరాబీ నమాజుల్లో పాల్గొంటారు. దైవసన్నిధిలో ఉన్న అనుభూతి పొందుతూ తాదాత్మ్యతతో శారీరక అలసట, నీరసం మరచిపోతారు. శరీర శుభ్రత పాటిస్తూ నమాజుకు పూనుకొంటారు. నమాజు చేసే సమయాన ఒక్కొక్క భంగిమ ఒక్కొక్క యోగాసనమై శారీరక దృఢత్వాన్ని మానసిక చేతనను కలిగిస్తుంది. ఒకేసారి మనిషి బాహ్యాంతరాలు పరిశుద్ధం కావడం విశేషం.
 
== గల్ఫ్ లో రంజాన్ ==
పంక్తి 22:
== ఏతెకాఫ్ ==
 
ఈ విధంగా అత్యంత నిష్టనియమాలతో ఉపవాసదీక్షలతో గడిపే ముస్లింలు రాత్రింబవళ్ళు నమాజులో లీనమై వుంటారు. సాధారణంగా ముస్లింలు ప్రతిరోజూ ఐదుసార్లు నమాజు చేయడం అందరికీ తెలిసిందే! వీటికి తోడు రంజాన్ నెలలో ప్రత్యేక ప్రార్థనలు జరుపుతారు. ఈ నెలలో సాయం సంధ్యవేళలో (ఇషా) ఫర్జ్ నమాజ్ తర్వాత అదనంగా ఇరవై రకాత్ ల ' తరావీహ్' [[నమాజ్]] చేస్తారు. ఇది నెలంతా నిర్వహిస్తారు. రంజాన్ నెల 21వ రోజు నుంచి చివరివరకూ ఒక ప్రత్యేకత వుందిఉంది. అదే ' ఏతెకాఫ్ ' . 'ఏతెకాఫ్ ' అంటే ఒకరకమైన తపోనిష్ట. దీనిని పాటించదలచినవారు మసీదులోనే ఒక ప్రక్క డేరాలా ఒక తెరను కట్టుకుని అక్కడ దైవధ్యానం, ప్రార్థనలు, ఖురాన్ పారాయణం చేయడంలో నిమగ్నమయివుంటారు. ఈ సమయంలో ' ఏతెకాఫ్ ' వున్నవారు బలమైన కారణం వుంటే తప్ప [[మస్జిద్]] వదిలి బయటకు పోకూడదు.
 
== షబ్-ఎ-ఖద్ర్ ==
 
రంజాన్ నెలలోని 27వ తేదీన ' [[షబ్-ఎ-ఖద్ర్]] ' జరుపుకుంటారు. దివ్యఖురాన్ ఈ రోజునెే అవతరించిందని భావించే ముస్లిం సోదరులు ఆ రోజు రాత్రి జాగరణ చేసి ప్రార్థనలు చేస్తూ గడుపుతారు. ఆ రాత్రి భక్తితో కఠోరదీక్షతో ప్రార్థనలు చేసేవారికి 83 సంవత్సరాల పాటు ప్రార్థనలు చేసిన ఫలం దక్కుతుందనే నమ్మకం వుందిఉంది. ఆ రాత్రి చేసే ప్రార్థనల వల్ల సర్వపాపాలు తొలగిపోతాయని భావిస్తారు.
 
== జకాత్ ==
పంక్తి 36:
{{ప్రధాన వ్యాసం|ఫిత్రా}}
[[File:Ramadan jerusalem kmhad.jpg|thumb|upright|[[జెరూసలెం]] పాతబస్తీలో రంజాన్ పండుగ.]]
'[[జకాత్]]' తో పాటు ' [[ఫిత్రా]]' దానానికి రంజాన్ నెలలో ఎంతో ప్రాముఖ్యత వుందిఉంది. మూడుపూటల తిండికి, ఒంటినిండా బట్టకు నోచుకోని పేదవారు ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి అభాగ్యులకు, పేదవారికి పండుగ సందర్భంలో దానం చేయాలని ఇస్లాం మతం ఉద్భోదిస్తూవుంది. దీనినే ' ఫిత్రాదానం' అని పిలుస్తారు. ఉపవాసవ్రతాలు విజయవంతంగా ముగిసినందులకు దేవుడి పట్ల కృతజ్ఞతగా .. పేదలకు ఈ ఫిత్రాదానం విధిగా అందజేస్తారు. ఈ ఫిత్రాదానంలో 50 గ్రాముల తక్కువ రెండు కిలోల గోధుమలను గానీ, దానికి సమానమైన ఇతర ఆహారధాన్యాలను గానీ, దానికి సమానమైన ధనాన్ని గానీ పంచిపెట్టాలి. ఈ దానం కుటుంబంలోని సభ్యులందరి తరపున పేదలకు అందజేయాలి. దీనివలన సర్వపాపాలు హరించబడి, పుణ్యం దక్కుతుందనే నమ్మకం వుందిఉంది.
 
దైవ ప్రవక్త ఫిత్రాధానాన్ని విధిగా నిర్ణయించడానికి కారణం - ఉపవాస వ్రత నియమాన్ని పాటించే సమయంలో హృదయంలో కలిగే చెడు తలంపులు, ఆలోచనలు, నోటినుంచి వెలువడే అసత్యాలు, పనికిమాలిన మాటలు వంటి పొరపాట్లు జరుగుతూ వుంటాయి. ఇలాంటి అనాలోచిత పొరపాట్లు అన్నీ ఫిత్రాదానం వల్ల క్షమించబడతాయి ' అని [[మహమ్మదు ప్రవక్త|మహమ్మద్‍]] అనుచరుడు అబ్దుల్లా బిన్ మసూద్ తెలిపాడు.
పంక్తి 76:
* [http://www.iqrasense.com/ramadan-fasting Ramadan and Fasting in Islam]
* [http://www.aapkaislam.com/ramadan.html Articles on Ramadan]
* [http://presstv.com/Program/141715.html Ramadan] ([[PressTV]] video)
* [http://www.islamfrominside.com/Pages/Articles/Fast%20until%20the%20night%20%28Ramadan%29.html Purpose of Fasting in Islam: "And Fast Until The Onset Of Night"]
 
"https://te.wikipedia.org/wiki/రంజాన్" నుండి వెలికితీశారు