మహాకవి శ్రీశ్రీ (పుస్తకం): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
మహాకవిగా సుప్రసిద్ధుడైన [[శ్రీశ్రీ]] జీవితం, సాహిత్యం గురించి మహాకవి శ్రీశ్రీ గ్రంథం కేంద్ర సాహిత్య అకాడమీ వారు వెలువరించారు. ప్రముఖ భాషావేత్త, రచయిత, పాత్రికేయుడు [[బూదరాజు రాధాకృష్ణ]] ఈ పుస్తకం రచించారు.
== రచన నేపథ్యం ==
మహా కవి శ్రీశ్రీ అనే ఈ పుస్తకాన్ని బూదరాజు రాధాకృష్ణ భారతీయ సాహిత్య నిర్మాతలు శీర్షిక కోసం [[1999|1999లో]] ఆంగ్లంలో రచించారు. దాన్ని ఆయనే తెలుగులోకి అనువదించారు. [[కేంద్ర సాహిత్య అకాడమీ]] ముఖ్యమైన భారతీయ భాషలన్నిటిలోకీ అనువదించి [[భారతీయ సాహిత్య నిర్మాతలు]] శీర్షికన ప్రచురించారు.
== విషయం ==
ఇరవయ్యవ శతాబ్దపు [[తెలుగు సాహిత్యము|తెలుగు]] సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీశ్రీ. శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ గా ప్రసిద్ధుడయ్యాడు. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా, సినిమా పాటల రచయితగా ఆయన ప్రసిద్ధుడు. శ్రీశ్రీ హేతువాది మరియు నాస్తికుడు. మహాకవిగా శ్రీశ్రీ విస్తృతామోదం పొందాడు. ఆయన సృజించిన కవితా! ఓ కవితా! అనే కవిత గురించి శ్రీశ్రీ .జీవిత కథకుడు, ప్రసిద్ధ రచయిత, భాషావేత్త, [[బూదరాజు రాధాకృష్ణ]] ఇలా రాసాడు: "కనీసం వేయి సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగు సాహిత్యంలో కవితను ఇలా నిర్వచించి,ఇంత కవితాత్మకంగా వర్ణించి, ఇంత అద్భుత సృష్టి చేసిన మరో కవి లేనే లేడు. ఇదే అతణ్ణి సాహితీ శిఖరాగ్రాన నిలిపింది". [[మహాప్రస్థానం]] ఆయన రచించిన కావ్యాల్లో ప్రసిద్ధమైనది. ఆయన సాహిత్య కృషిని, సాహిత్యంలో ఆయన స్థానాన్ని, కాలాన్ని, ప్రభావాన్ని గురించి తెలియజేయడం ఈ [[పుస్తకము|పుస్తకం]] లక్ష్యం. ముఖ్యంగా భారతదేశంలోని[[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లోని ఇతర భాషల వారిని ఉద్దేశించి, వారికి తెలిపేందుకు ఈ గ్రంథం రచించారు.
=== ప్రకరణాలు ===
* జీవిత రేఖాచిత్రం