సంసారం ఒక చదరంగం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 15:
==కథ==
విశాఖపట్టణ స్టీల్ ప్లాంటులో పదవీ విరమణకు వయసు చేరువైన గుమస్తా అప్పల నరసయ్య ([[గొల్లపూడి మారుతీరావు]]), గోదావరి ([[అన్నపూర్ణ (నటి)|అన్నపూర్ణ]]) దంపతులకు నలుగురు సంతానం. పెద్ద కొడుకు ప్రకాష్ ([[శరత్ బాబు]]) ఇండియన్ ఆయిల్ కంపెనీలో అకౌంటెంట్, అతని భార్య ఉమ ([[సుహాసిని]]), ఒక ఫ్యాక్టరీలో చిన్న ఉద్యోగం చేసుకుంటున్న రెండో కొడుకు రాఘవ ([[రాజేంద్ర ప్రసాద్(నటుడు)|రాజేంద్ర ప్రసాద్]]), చదువు పూర్తిచేసి ఉద్యోగం చేస్తున్న కూతురు సరోజ (కల్పన), పదోతరగతి పరీక్షల్లో తరచు తప్పుతూండే చిన్న కొడుకు కాళిదాసు తల్లిదండ్రులతో ఒకే ఇంట్లో జీవిస్తూంటారు. వీరివి వేర్వేరు మనస్తత్వాలు, ఆశలు, ఆలోచనలు. ప్రకాష్ ఖర్చు దగ్గర ఖచ్చితంగా ఉండే మనిషి, భార్య ఉమ అందరితో కలుపుగోలుగా ఉంటూంటుంది, సరోజ కొద్దిపాలు అహంకారంతో వ్యవహరిస్తూ అప్పటికే పీటర్ అనే అబ్బాయిని ప్రేమించివుంటుంది, రాఘవ బాధ్యతలు తెలుసుకుని మసులుకుంటూండగా, కాళిదాసు బాధ్యతారాహిత్యంగా తిరుగుతూంటాడు. వీరందరి ఆశలు, ఆకాంక్షలు మధ్య సంసారాన్ని సాగిస్తూంటారు అప్పల నరసయ్య, గోదావరి. మధ్య నలభై ఏళ్ళ నుంచి ఆ ఇంటిలో పనిచేస్తూండే చిలకమ్మ ([[షావుకారు జానకి]]) ఇంటిలో మనిషిలాంటిదే.<br />
సరోజను చూడడానికి ఓ పెళ్ళికొడుకు తండ్రి, అతని చెల్లెలు వసంత ([[ముచ్చెర్ల అరుణ]]) పెళ్ళిచూపులకు వస్తారు. ఐతే తనకి ఈ పెళ్ళి ఇష్టం లేదని, తన ఆఫీసులోనే పనిచేసే పీటర్ ని ప్రేమించుకుంటున్నానని చెప్పడంతో పెళ్ళివాళ్లు వెళ్లిపోతారు.
"https://te.wikipedia.org/wiki/సంసారం_ఒక_చదరంగం" నుండి వెలికితీశారు