సంసారం ఒక చదరంగం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
సరోజను చూడడానికి ఓ పెళ్ళికొడుకు తండ్రి, అతని చెల్లెలు వసంత ([[ముచ్చెర్ల అరుణ]]) పెళ్ళిచూపులకు వస్తారు. ఐతే తనకి ఈ పెళ్ళి ఇష్టం లేదని, తన ఆఫీసులోనే పనిచేసే పీటర్ ని ప్రేమించుకుంటున్నానని చెప్పడంతో పెళ్ళివాళ్లు వెళ్లిపోతారు. కూతురు ప్రవర్తనకు క్షమాపణలు కోరిన అప్పల నరసయ్య ఆ పెళ్ళివాళ్ళ కూతురు వసంతను తన రెండో కొడుకు రాఘవకు సంబంధం కుదుర్చుకుంటాడు. పీటర్-సరోజల పెళ్ళి, ఆపైన రాఘవ-వసంతల పెళ్ళీ జరుగుతాయి. ఉమ గర్భవతి అయి పుట్టింటికి వెళ్తుంది. ఐతే కొత్తగా పెళ్ళి అయిన సరోజ భర్తతో గొడవపడి పుట్టింటికి వస్తుంది, ఇక్కడ రాఘవతో మనస్పర్థలు రావడంతో వసంత కూడా పుట్టింటికి వెళ్ళిపోతుంది. అయితే రాఘవ తల్లిదండ్రుల మాట విని, భార్య పుట్టింటికి వెళ్ళి ఆమెని తీసుకువస్తాడు. తన భర్త పీటర్ కూడా అలానే వచ్చి తీసుకువెళ్తాడని ఆశించి పుట్టింట ఉంటుంది సరోజ. మరోవైపు కాళిదాసు మరోమారు పరీక్ష తప్పుతాడు. కాళిదాసును పాస్ చేయించే బాధ్యత స్వీకరించి, కొత్తగా పెళ్ళైనా సరదాలు త్యాగం చేసి చదివిస్తూంటాడు రాఘవ.<br />
ఇంటి ఖర్చు విషయంలో అప్పల నరసయ్యకి, ప్రకాష్ కి మాటపట్టింపు వచ్చి ప్రకాష్ ని అప్పల నరసయ్య ఇంట్లోంచి బయటకు వెళ్ళమనడం, తాను చెల్లెలి పెళ్ళికి సాయంచేసిన డబ్బు తిరిగి ఇచ్చేస్తే వెళ్ళిపోతానని ప్రకాష్ అనడం, వీటన్నిటి ఫలితంగా ఇంటి మధ్యలో ఓ లక్ష్మణరేఖలాంటి గీత గీసి ఇటువారు అటు అటువారు ఇటు రాకూడదనేదాకా వెళ్తుంది. పురుడు పోసుకుని బిడ్డనెత్తుకుని ఉమ ఇంటికి తిరిగివచ్చేసరికి అప్పటికే జరిగిన వివాదంలో ప్రకాష్, అతని కుటుంబంతో తమ కుటుంబంలోని వారు మాటకూడా కలపకూడదని అప్పల నరసయ్య శాసించి ఉంటాడు. ఉమ ఒక్కో సమస్యపై దృష్టిపెట్టి ముందుగా సరోజ మామ ఎడ్వర్డ్ శామ్యూల్ ([[నూతన్ ప్రసాద్]]), చిలకమ్మలతో కలిసి నాటకం ఆడి సరోజ సమస్యని పరిష్కరిస్తుంది. కాళిదాసు చదువు కారణంగా రాఘవ వసంత దంపతుల మధ్య దూరం పెరుగుతోందని గమనించి వారిద్దరికీ ఏకాంతం ఏర్పడేలా చేస్తుంది. అనుకోని విధంగా వసంతకు మసూచి రావడంతో రాఘవ చేసిన సేవల కారణంగా అనుబంధం బలపడుతుంది. రాఘవ కృషి, కాళిదాసుకు ఏర్పడ్డ పట్టుదల ఫలితంగా అతను పదో తరగతి పాస్ అవుతాడు.<br />
ఉమ ప్రయత్నాలు ఫలించి తండ్రీ కొడుకుల మధ్య ఏర్పడిన వైషమ్యాలు తొలగిపోయి కలుస్తారు. కానీ అప్పుడు మాత్రం మళ్ళీ కలిసి ఉమ్మడి కుటుంబంలో కాపురం చేసేందుకు ఉమ ఒప్పుకోదు. నిత్యం కలిసివుండీ విడిపోయే కన్నా, విడివిడిగా ఉంటూ వారానికి ఒకసారి కలుద్దాం అని ప్రతిపాదించి వేరు కాపురానికి వెళ్లడంతో సినిమా ముగుస్తుంది.
"https://te.wikipedia.org/wiki/సంసారం_ఒక_చదరంగం" నుండి వెలికితీశారు