"సంసారం ఒక చదరంగం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
}}
'''సంసారం ఒక చదరంగం''' [[ఎ.వి.ఎం.ప్రొడక్షన్స్]] పతాకంపై [[యం.శరవణన్]], [[యం. బాలకృష్ణన్]] నిర్మాతలుగా [[ఎస్.పి.ముత్తురామన్]] దర్శకత్వంలో [[గొల్లపూడి మారుతీరావు]], [[అన్నపూర్ణ (నటి)|అన్నపూర్ణ]], [[శరత్ బాబు]], [[సుహాసిని]], [[షావుకారు జానకి]], [[రాజేంద్ర ప్రసాద్(నటుడు)|రాజేంద్ర ప్రసాద్]], [[ముచ్చర్ల అరుణ]] తదితరులు ముఖ్యపాత్రల్లో నటించిన 1987 నాటి తెలుగు చలన చిత్రం. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే విసు, మాటలు గణేష్ పాత్రో రాయగా, పాటలు వేటూరి సుందరరామమూర్తి, సంగీతం కె.చక్రవర్తి అందించారు.<br />
విశాఖపట్టణానికి చెందిన స్టీల్ ప్లాంట్ ఉద్యోగి అప్పల నరసయ్య, గోదావరి కుటంబంలో చెలరేగిన కలతలు, సమస్యలు ఎలా పరిష్కరించుకున్నారన్నది చిత్ర కథాంశం. సినిమా ప్రేక్షకుల ఆదరణతో మంచి విజయాన్ని సాధించింది. ప్రత్యేకించి సినిమాలోని పాత్రలు, సన్నివేశాలు, సంభాషణలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
 
==కథ==
విశాఖపట్టణ స్టీల్ ప్లాంటులో పదవీ విరమణకు వయసు చేరువైన గుమస్తా అప్పల నరసయ్య ([[గొల్లపూడి మారుతీరావు]]), గోదావరి ([[అన్నపూర్ణ (నటి)|అన్నపూర్ణ]]) దంపతులకు నలుగురు సంతానం. పెద్ద కొడుకు ప్రకాష్ ([[శరత్ బాబు]]) ఇండియన్ ఆయిల్ కంపెనీలో అకౌంటెంట్, అతని భార్య ఉమ ([[సుహాసిని]]), ఒక ఫ్యాక్టరీలో చిన్న ఉద్యోగం చేసుకుంటున్న రెండో కొడుకు రాఘవ ([[రాజేంద్ర ప్రసాద్(నటుడు)|రాజేంద్ర ప్రసాద్]]), చదువు పూర్తిచేసి ఉద్యోగం చేస్తున్న కూతురు సరోజ (కల్పన), పదోతరగతి పరీక్షల్లో తరచు తప్పుతూండే చిన్న కొడుకు కాళిదాసు తల్లిదండ్రులతో ఒకే ఇంట్లో జీవిస్తూంటారు. వీరివి వేర్వేరు మనస్తత్వాలు, ఆశలు, ఆలోచనలు. ప్రకాష్ ఖర్చు దగ్గర ఖచ్చితంగా ఉండే మనిషి, భార్య ఉమ అందరితో కలుపుగోలుగా ఉంటూంటుంది, సరోజ కొద్దిపాలు అహంకారంతో వ్యవహరిస్తూ అప్పటికే పీటర్ అనే అబ్బాయిని ప్రేమించివుంటుంది, రాఘవ బాధ్యతలు తెలుసుకుని మసులుకుంటూండగా, కాళిదాసు బాధ్యతారాహిత్యంగా తిరుగుతూంటాడు. వీరందరి ఆశలు, ఆకాంక్షలు మధ్య సంసారాన్ని సాగిస్తూంటారు అప్పల నరసయ్య, గోదావరి. మధ్య నలభై ఏళ్ళ నుంచి ఆ ఇంటిలో పనిచేస్తూండే చిలకమ్మ ([[షావుకారు జానకి]]) ఇంటిలో మనిషిలాంటిదే.<br />
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2131007" నుండి వెలికితీశారు