చివరకు మిగిలేది (నవల): కూర్పుల మధ్య తేడాలు

→‎బయటి లింకులు: వ్యక్తిగత బ్లాగు వ్యాసానికి సంబంధం లేనిది అందరికీ అందుబాటులో లేనిది
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
ధయానిధి పట్ట్ట్టణంలో డాక్టరు చదువుతూ పల్లెకు వచ్చినపుడు కోమలి అనే ఒక తక్కువ కులపు అమ్మయిని ప్రేమిస్తాడు, కాని ఆమెకు తన ప్రేమను వ్యక్తపరచడం ఎలానో, అసలు తనది ప్రేమో లేక ఆకర్షణో తెలియని సంగ్దిగ్దంలో ఉండి చదువు సంద్యలు లేని ఆమెకు ఆ అభిప్రాయాలను వ్యక్తం చేయలేక పోతాడు.
 
దయానిధి వృత్తి రీత్యా డాక్టరు. జీవిత యాత్రలో తారసిల్లిన అనేక సంఘటనలు, పరిసరాల ప్రభావంతో ఆయన తాత్వికుడుగా, భావకుడుగా మారతాడు. తల్లి మీద ఆయనకి అపారమైన గౌరవం ఉంటుంది. అయితే, ఆమె శీలం గురించి మాత్రం సంఘంలో సరైన అభిప్రాయం ఉండదు. సుశీల, ఇందిర అనే ఇద్దరు దయానిధి తల్లిని అవహేళన చేస్తారు. నిజానికి వారిద్దరు దయానిధికి భార్యలు కావాల్సినవారు. వారికి దయానిధి తల్లి మీద ఉన్న ఏహ్యభావం కారణంగా దయానిధికి దూరమవుతారు. అమృతం అనే యువతి మాత్రం దయానిధి తల్లి పట్ల గౌరవంతో మాట్లాడుతుంది. అందువల్లే ఆమె దయానిధికి సన్నిహితురాలవుతుంది. దయానిధి తల్లి పాత్ర ఎంతో కీలకమైనా ఆ పాత్ర మాత్రం నవలలో ఎక్కడా కనిపించదు. ఆమె చేసిన తప్పిదం మాత్రం కొడుకు దయానిధిని నీడలా వెన్నాడుతుంటుంది. తల్లి గురించి నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకోవడం విని సహించలేక దయానిధి సంఘానికి దూరంగా ఏకాంత జీవితం గడుపుతుంటాడు. అప్పుడే ఆయనకి జీవితానికి అర్థం ఏమిటి అన్న ప్రశ్నకలుగుతుంది. సత్యాన్వేషణకు, ఆధ్యాత్మిక, తాత్విక చింతనకు దారితీస్తుంది. పెద్దలు చేసిన తప్పిదాలకు [[పిల్లలు]] బాధ్యులై వారి జీవితాలు సాగాల్సిన తీరున సాగలేకపోవడం- ఈ నవలలో చిత్రితమైంది. దయానిధి సర్కారు వదిలి రాయలసీమకు వెళతాడు. అక్కడ [[సర్కారు]] [[రాయలసీమ]] ప్రాంతాల మధ్య గల వైషమ్యాలు భగ్గుమంటాయి. దయానిధి స్వాతంత్య్రోద్యమంలో కూడా పాల్గొంటాడు. పెళ్లయి పునస్సంధానం జరిగే తొలిరాత్రి దేశమాత పిలుపునందుకొని అరెస్టవుతాడు. కోమలి, అమృతం, సుశీల, ఇందిర- ఈ నలుగురు స్త్రీల మధ్య అతను నాలుగు స్తంభాల ఆట ఆడినా అమృతం ఆయన హృదయాన్ని చూరగొంటుంది. అయితే అన్నివిధాలా ఆయనకు కోమలి సన్నిహితురాలైంది. ఇంకా కాత్యాయని, నాగమణి, శ్యామల... వీరు కూడా దయానిధి జీవితంలో సంచలనం కలిగిస్తారు. ఇతర పాత్రలైన కృష్ణమూర్తి, జగన్నాధం, సోమయ్య, రెడ్డి, నారయ్య మొదలైన వ్యక్తులందరూ ప్రతి వ్యక్తికీ సన్నిహితంగా ఉండి అందరితో కలసి మెలసి జీవించే పాత్రలు. ఈ నవల ద్వారా పాఠకులు గ్రహించే సత్యం ఏమిటంటే- 'మానవునికి కావాల్సింది మతాలు, దేవుళ్లు, మొక్కుబళ్లు, రాజకీయాలు కావు... కావాల్సింది దయ. అది కొంచెం ఉన్నా చాలు'. ఇక దయానిధి జీవితం అంతా- 'వ్యక్తిని కాదు ద్వేషించాల్సింది, వ్యక్తిలోని దౌర్భల్యాలను, బలహీనతలను ద్వేషించాలి' అన్న మానవతా వాద సిద్ధాంతం పైనే నడుస్తుంది.<ref name="chikolu"/>
 
ఇందులో పదకొండు అధ్యాయాలున్నాయి. గడ్డిపోచ విలువెంత, అనుభవానికి హద్దులు లేవు, మూణ్ణాళ్ళ ముచ్చట, చప్పుడు చెయ్యని సంకెళ్లు, సౌందర్యరాహిత్యం, స్వయం సంస్కారం, చీకటి సమస్య, రాళ్లసీమ, కాత్యాయని సంతతి, ఆకులు రాలడం, చివరకు మిగిలేది. బుచ్చిబాబు స్వయంగా 'సమర్పణ' పేరుతో ఉపోద్ఘాతం రాశారు. అందులో తనని బాధించినదేదే రాస్తూ- 'గతించిపోయిన యౌవనం, జాడ్యం, బీదతనం, మృత్యువు- ఇవి జీవితంలోని చెడుగు. ఈ చెడుగులో మానవుడు గుండె బాదుకోవల్సిన విషాదం ఏమీ లేదు. జీవితంలో నిజమైన విషాదం ద్వేషించడం కూడా కాదు; నిజమైన విషాదం ప్రేమించలేకపోవడం, ద్వేషించడంలో కొంత పట్టుదల, కార్యసాధన కూడా ఉండొచ్చు; కాని ప్రేమించలేకపోవడంతో అట్లా సమాధానపడేటందుకేమీ లేదు. కృష్ణశాస్త్రి 'నా కొరకు చెమ్మగిల నయనమ్ము లేదు'-కంటె విషాదకరమైన గీతం ఏదుంది? ఈ సమస్య నన్ను బాధించింది. దీన్నిబట్టి ఈ సమస్యని నవలలో చర్చించి, ఒక సమాధానం కనుక్కున్నానని కాదు. ఈ వస్తువుని వ్రాసేస్తే విషయం నాకు విశదపడుతుందనీ, నలుగురితో పంచుకుంటే బాధ నుండి విముక్తి లభిస్తుందనీ తోచింది. వ్యక్తిగతమైన విముక్తి ఈ నవలకి ప్రేరణ. ప్రేమించలేపోవడం ఒకటే కాదు ఈ నవలలో వస్తువు. జీవితంలో 'చెడుగు' - 'పాపం' - ముఖ్యంగా పెద్దలు చేసిన తప్పిదాలు పిన్నలపైబడి వారి జీవితాల్ని ఏవిధంగా వికసించనీయకుండా, పాడుచేసింది- యిది కూడా ఒక ప్రధానమైన అంశమే. ఒకరు చేసిన అపచారాలకి మరియొకరు బాధ్యులై బాధపడడం వల్ల సమాజంలో వ్యక్తిగతమైన నైతిక విలువలకి తావులేకుండా పోతుంది' అంటూ బుచ్చిబాబు సుదీర్ఘమైన ముందు మాట రాశారు.<ref name="chikolu"/>