సి.డి.దేశ్‌ముఖ్: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: 1896, జనవరి 14 న జన్మించిన చింతామణి ద్వారకనాథ్ దేశ్‌ముఖ్ (Chintaman Dwarakan...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[1896]], [[జనవరి 14]] న జన్మించిన చింతామణి ద్వారకనాథ్ దేశ్‌ముఖ్ (Chintaman Dwarakanath Deshmukh) [[భారతీయ రిజర్వ్ బాంక్]] మూడవ గవర్నర్ మరియు స్వతంత్ర భారత దేశపు తొలి రిజర్వ్ బాంక్ గవర్నర్. ఇతడు [[1943]], [[ఆగస్ట్ 11]] నుంచి [[1949]], [[జూన్ 30]] వరకు ఈ పదవిని నిర్వహించాడు. ఆ తర్వాత దేశ్‌మూఖ్ భారత దేశానికి [[ఆర్థిక మంత్రి]] గా నియమితులైనాడు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధురాలైన [[దుర్గాబాయి దేశ్‌ముఖ్]] ను వివాహం చేసుకున్నాడు.
 
[[ఇండియన్ సివిల్ సర్వీస్]] సభ్యుడైన దేశ్‌ముఖ్ కు [[1939]] నుంచే రిజర్వ్ బ్యాంక్ తో సంబంధం ఉంది. [[1941]] లో రిజర్వ్ బ్యాంక్ డిప్యూటి గవర్నర్ గా నియమించబడ్డాడు. August, 1943. ఆ తర్వాత జేమ్స్ టేలర్ నుంచి 3 వ గవర్నర్ గా బాద్యతలు పొందినాడు. దేశ్‌ముఖ్ గవర్నర్ గా ఉన్న సమయంలో ప్రపంచంలో ముఖ్యమైన ఆర్థిక పరిణామాలు సంభవించాయి. [[జూలై]] [[1944]] లో జర్గిన [[బ్రెట్టన్ వుడ్స్]] సమావేశం లో అతడు కూడా [[భారత దేశం]] తరఫునన పాల్గొన్నాడు. ఈ సమావేశమే [[అంతర్జాతీయ ద్రవ్య సంస్థ]] {International Monetary Fund-IMF) మరియు [[ప్రపంచ బ్యాంకు]] (International Bank for Reconstruction and Development-IBRD) ఏర్పడడానికి కారణమైంది. ఈ రెండు సంస్థల లోనూ దేశ్‌ముఖ్ బోర్డ్ ఆఫ్ గవర్నర్ గా పదేళ్ళ పాటు పనిచేశాడు. [[1950]] లో [[పారిస్]] లో జర్గిన ఈ రెండు సంస్థల వార్షిక సంయుక్త సమావేశంలో ఇతడు చైర్మెన్ గా వ్యవహరించాడు. <ref>{{cite web
|url = http://www.rbi.org.in/Content/Annual_CDMemorial.aspx
|title = Chintaman Deshmukh Memorial Lectures
|accessdate = 2006-12-08
|publisher = Reserve Bank of India}}</ref>
"https://te.wikipedia.org/wiki/సి.డి.దేశ్‌ముఖ్" నుండి వెలికితీశారు