శ్రీమన్నారాయణ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
'''శ్రీమన్నారాయణ ''' [[రమేష్ పుప్పల]] నిర్మాతగా, [[రవి చావలి]] దర్శకత్వంలో [[నందమూరి బాలకృష్ణ]], [[పార్వతీ మెల్టన్]], [[ఇషా చావ్లా]] ప్రధాన పాత్రల్లో నటించిన 2012 తెలుగు చలన చిత్రం.
==కథ==
శ్రీమన్నారాయణ (నందమూరి బాలకృష్ణ) ధైర్యవంతుడు, ఆవేశపరుడు అయిన జర్నలిస్టు. అతను ఎప్పుడూ న్యాయం కోసం పోరాడుతూంటాడు. కొందరు దర్మార్గులుదుర్మార్గులు చేస్తున్న కుంభకోణాలను బయటపెట్టి, వారి అవినీతి డబ్బు నష్టపోవడానికి కారణమవుతాడు. కల్కి నారాయణమూర్తి (విజయకుమార్) శ్రీమన్నారాయణ తండ్రి, జైకిసాన్ ట్రస్టు ఏర్పాటుచేసి రైతుల సంక్షేమం కోసం పోరాడుతూండే వ్యక్తి. రైతుల సంక్షేమం కోరుతూ నారాయణమూర్తి చేసిన విజ్ఞప్తికి ప్రజలు స్పందించి భారీ విరాళాలు ఇవ్వగా, ఆ మొత్తం రూ.5వేల కోట్లు అవుతుంది. కానీ విరాళం ఉపయోగించే సమయం వచ్చేసరికి నారాయణమూర్తి బ్యాంకులో అనూహ్యమైన పరిస్థితుల్లో చనిపోతాడు. 5వేల కోట్ల సొమ్ము మాయమవుతుంది. అదే సమయంలో శ్రీమన్నారాయణ విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నాడన్న నింద పడుతుంది. శ్రీమన్నారాయణను ఈ పరిణామాలన్నిటికి కారకుడిగా అనుమానించి అరెస్టు చేస్తారు. జైలు నుంచే శ్రీమన్నారాయణ తన అమాయకత్వం నిరూపించుకుని, పోయిన సొమ్ము కనిపెట్టాల్సి వస్తుంది.
 
ఛానెల్ రిపోర్టర్ అయిన స్వాప్నిక (పార్వతి మెల్టన్) శ్రీమన్నారాయణ నిర్దోషిగా నిరూపించుకునేందుకు సహాయం చేస్తూంటుంది. వాళ్ళిద్దరూ అవినీతిపరుడైన మంత్రి బయల్ రెడ్డి, అతని బావమరిది బ్యాంకు జనరల్ మేనేజర్ రాజన్, డాక్టర్ శ్రీకర్, ఐజీ మార్తాండ్, మలేషియాకు చెందిన హవాలా డీలర్ హర్షద్ భాయ్ ఈ కుట్ర వెనుక ఉన్నారని కనిపెడతాడుకనిపెడతారు. ఈ ఆరుగురు అవినీతిపరుల వద్ద ఒక్కో అంకె ఉండేలా ఆరు అంకెల పాస్ వర్డు ఏర్పాటుచేసి దాంతో తన తండ్రి అక్కౌంట్ లాక్ చేశారన్న విషయం తెలుసుకుంటాడు శ్రీమన్నారాయణ.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/శ్రీమన్నారాయణ" నుండి వెలికితీశారు