శ్రీమన్నారాయణ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 22:
'''శ్రీమన్నారాయణ ''' [[రమేష్ పుప్పల]] నిర్మాతగా, [[రవి చావలి]] దర్శకత్వంలో [[నందమూరి బాలకృష్ణ]], [[పార్వతీ మెల్టన్]], [[ఇషా చావ్లా]] ప్రధాన పాత్రల్లో నటించిన 2012 తెలుగు చలన చిత్రం. సినిమాకు కథ, మాటలు ఘటికాచలం, సంగీతం చక్రి అందించారు. [[కోట శ్రీనివాసరావు]], [[సురేష్ (నటుడు)|సురేష్]], [[నాగినీడు]], [[ఆహుతి ప్రసాద్]], [[వినోద్ కుమార్]], తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.
5వేల కోట్ల భారీ మొత్తంలో విరాళాలు సేకరించి రైతులను ఆదుకునేందుకు ప్రయత్నించిన సామాజిక కార్యకర్తను చంపి, డబ్బు దొంగిలించి, జర్నలిస్టు అయిన అతని కొడుకు మీదే నేరం మోపిన నేరస్తులను జైలు నుంచే కథానాయకుడు ఎలా అంతం చేసి, డబ్బును పేదరైతులకు అందేలా చేశాడన్నది సినిమా కథాంశం. సినిమా సమీక్షల్లో యావరేజ్ గా అంచనా వేయగా, ప్రేక్షకుల నుంచి సానుకూలమైన స్పందనే లభించింది.
==కథ==
శ్రీమన్నారాయణ (నందమూరి బాలకృష్ణ) ధైర్యవంతుడు, ఆవేశపరుడు అయిన జర్నలిస్టు. అతను ఎప్పుడూ న్యాయం కోసం పోరాడుతూంటాడు. కొందరు దుర్మార్గులు చేస్తున్న కుంభకోణాలను బయటపెట్టి, వారి అవినీతి డబ్బు నష్టపోవడానికి కారణమవుతాడు. కల్కి నారాయణమూర్తి (విజయకుమార్) శ్రీమన్నారాయణ తండ్రి, జైకిసాన్ ట్రస్టు ఏర్పాటుచేసి రైతుల సంక్షేమం కోసం పోరాడుతూండే వ్యక్తి. రైతుల సంక్షేమం కోరుతూ నారాయణమూర్తి చేసిన విజ్ఞప్తికి ప్రజలు స్పందించి భారీ విరాళాలు ఇవ్వగా, ఆ మొత్తం రూ.5వేల కోట్లు అవుతుంది. కానీ విరాళం ఉపయోగించే సమయం వచ్చేసరికి నారాయణమూర్తి బ్యాంకులో అనూహ్యమైన పరిస్థితుల్లో చనిపోతాడు. 5వేల కోట్ల సొమ్ము మాయమవుతుంది. అదే సమయంలో శ్రీమన్నారాయణ విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నాడన్న నింద పడుతుంది. శ్రీమన్నారాయణను ఈ పరిణామాలన్నిటికి కారకుడిగా అనుమానించి అరెస్టు చేస్తారు. జైలు నుంచే శ్రీమన్నారాయణ తన అమాయకత్వం నిరూపించుకుని, పోయిన సొమ్ము కనిపెట్టాల్సి వస్తుంది.
|