వైష్ణవ దేవి ఆలయం: కూర్పుల మధ్య తేడాలు

→‎స్థల పురాణం: మరిన్ని వివరాలు జోడించబడినాయి
Added links and references
పంక్తి 10:
}}
 
'''వైష్ణవ దేవి ఆలయం''' ప్రసిద్ధి చెందిన అమ్మవారి పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రం వైష్ణవ దేవి కొండలపై నెలకొని ఉంది. హిందువులు '''వైష్ణవ దేవి'''నే '''మాతా రాణి''' అని '''వైష్ణవి''' అని కూడా సంభోదిస్తారు.<ref>https://www.maavaishnodevi.org/historyholyshrine.aspx</ref>
[[దస్త్రం:Vaishno Devi Entrance.jpg|right|thumb|250px|వైష్ణోదేవి ఆళయం ప్రవేశ ద్వారం]]
[[దస్త్రం:Vaishno devi.jpg|thumb|right|వైష్ణో దేవి ఆలయం]]
ఈ ఆలయం ఉత్తర భారత్ లోని జమ్ము- కాష్మీరికాశ్మీర్ రాష్ట్రంలో జమ్ముకు సుమారు 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎత్తైన హిమాలయ పర్వత ప్రాంతంలోని త్రికూట పర్వత శేణిలో ఉంది. జమ్ము నుండి 50 కిలో మీటర్ల దూరంలో వున్న కాట్రా ప్రాంతానికి హెలి కాప్టర్లలో వెళ్లవచ్చు. ఇతర వాహనాలు వుంటాయి. అక్కడి నుండి కాలి నడకన, గుర్రాలమీద, పల్లకిల్లో ఎలాగైన వెళ్లవచ్చు. ఇక్కడికి ఆలయం సుమారు 15 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈ దారి చాల కష్టతరమైనది. తిరుపతి కొండ ఎక్కేవారు గోవిందా గోవింద అని అరుస్తున్నట్లె ఇక్కడ కూద కొండ ఎక్కేవారు జై మాతాదీ అంటు అరుస్తుంటారు. ఇంకా చాల దూరం వుందనగానె మాతాదీఅమ్మవారి ఆలయం కనిపుస్తూనె వుంటుంది. ఈ ఆలయం వున్న ప్రాంతాన్ని భవన్ అని అంటారు. భక్తులను గ్రూపులుగా విభజించి వారికి ఒక నెంబరిస్తారు. దాని ప్రకారం భక్తులను ఆలయంలోనికి అనుమతిస్తారు. ఆలయంలోపలికి సెల్ ఫోన్లు, కెమరాలు, అలాగె తోలుతో చేసిన ఏ వస్తువును అనుమతించరు. కనుక వాటిని కలిగి వున్నవారు వాటిని అక్కడే లాకర్లలో భద్ర పరుచు కోవచ్చు.<ref>https://www.maavaishnodevi.org/accomodations.aspx</ref> వైష్ణో దేవి మూడు రూపాల్లో దర్శనమిస్తుంది. అవి మహాకాళి, మహా లక్ష్మి, సరస్వతి. ఆలయానికి వెళ్లే దారిలో ఇతర పురాతనమైన చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి.<ref>https://www.maavaishnodevi.org/index.aspx</ref>
 
ఈ అమ్మ వారి ఆలయం ఉత్తర భారతాన [[జమ్ము]] జిల్లాలోని కాట్రాలో ఉంది. ఈ ఆలయ వార్షికాదాయం ఐదు వందల కోట్ల రూపాయల వరకు ఉంటుంది. పర్వ దినాలలో ఈ ఆలయానికి వచ్చె భక్తుల సంక్య లక్షలలో వుండగా కానుకలుగా ఆలయానికి నాలుగు15 కోట్ల రూపాయలు వస్తాయివచ్చినాయి.<ref>http://timesofindia.indiatimes.com/business/india-business/Money-spinning-mandirs/articleshow/5108844.cms</ref>
==స్థల పురాణం==
[[Image:Vaishno.jpg|thumb|left|250px|Vaishno Devi Bhawan.]] జమ్మూలోని పర్వత సానువులలో ఉన్న అమ్మవారి ఆరాధన ఎప్పుడు మొదలైందనేది ఇదమిత్థంగా చెప్పలేము. కానీ పిండీలు అని పిలవబడే మూర్తులు మూడు కొన్ని లక్షల సంవత్సరములుగా అక్కడ ఉన్నాయని భూగోళ శాస్త్రజ్ఞులు తెలియజేస్తున్నారు. త్రికూట పర్వతముగా ఋగ్వేదములో చెప్పబడిన పర్వతసమూహము ఇదేనని కొందరి వాదన. ఋగ్వేదములో ఇక్కడ శక్తి ఆరాధన జరుగుచుండేదని చెప్పబడినది. 
 
వైష్ణో దేవి గురించిన మొదటి ప్రస్తావన మహాభారతములో ఉన్నది. కురుపాండవ సంగ్రామమునకు ముందు శ్రీకృష్ణుని ఆదేశానుసారము అర్జునుడు ఇక్కడ అమ్మవారిని పూజించి ఆమె దీవెనలు తీసుకున్నాడని వ్యాసభారతము చెపుతోంది. "జంబూకటక చైత్యేషు నిత్యం సన్నిహితాలయే" అనే శ్లోకము ఆధారముతో ఈ దేవస్థానములోనే అర్జునుడు పూజలు చేసినాడని తెలుస్తుంది. <ref>https://www.maavaishnodevi.org/historyholyshrine.aspx</ref>
 
స్థలపురాణము ప్రకారము పాండవులు మొదటగా ఇక్కడ దేవాలయ నిర్మాణము చేసినారని తెలుస్తుంది. త్రికూటపర్వతమునకు పక్కన ఐదు రాతి కట్టడములు ఉన్నవి. వీటిని పంచ పాండవులకు ప్రతీకగా స్థానిక జనము భావిస్తారు.
 
మధ్యకాలపు చరిత్ర ప్రకారము మొదటగా సిక్కుల గురువైన గురు గోబింద్ సింగ్ పుర్మండాల్ మీదుగా వచ్చి ఈ పవిత్ర గుహను దర్శించినాడని తెలుస్తుంది. గుహలకు ఉన్న ఒక పాట కాలపు నడక బాట ఈ మార్గము గుండా వెళుతుంది.<ref>https://www.maavaishnodevi.org/historyholyshrine.aspx</ref>
 
ఇక్కడ సతీదేవి యొక్క శిరస్సు పడిన కారణముగా కొన్ని సంప్రదాయములు శక్తిపీఠాలన్నింటిలోనూ ఈ పీఠమును అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తాయి. కొన్ని సంప్రదాయముల వారు మాత్రము అమ్మవారి కుడిచేయి ఇక్కడ పడిందని భావిస్తారు. హైందవ పవిత్ర పుస్తకముల మూలముగా తెలియవచ్చేది ఏమనగా కష్మీరములో అమ్మవారి కుడిచేయి పడిందని. ఇప్పటికీ మాతా వైష్ణోదేవి ఆలయములో మనిషి కుడి చేయి రూపములోని కొన్ని శిల్పములు లభ్యము కావడము ఈ వాదన సరైనదేననడానికి ఊతమిస్తుంది. ఈ చేతి శిల్పమును అమ్మవారి వరద హస్తముగా భక్తులు గౌరవిస్తారు.
పంక్తి 29:
శ్రీధరపండితుడు అనే వ్యక్తి 700 సంవత్సరాలకు పూర్వము ఈ కొండగుహలను కనుగొన్నాడని చెపుతారు. తన ఇంటిలోనున్న పూజా సంపుటములో అమ్మవారి విగ్రహం మాయమవడం చూసిన శ్రీధరపండితుడు అమ్మవారికి కటిక ఉపవాసము చేస్తూ మొరపెట్టుకోగా కలలో దర్శనమిచ్చిన అమ్మవారు తను పర్వత సానువులలో ఉన్నానని దారి చూపించిందని, ఉపవాస దీక్ష మానవలసినదిగా ఆదేశించిందని.
 
ఆమె ఆజ్ఞానుసారము శ్రీధర్ వెతుక్కుంటూ వెళ్ళగా మూడు రాతుల రూపములో అమ్మవారు దర్శనమిచ్చిందని చెపుతారు. ఆ మూడు మూర్తులే మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళీ అవతారములుగా శ్రీధరపండితుడు పూజించినాదని చెపుతారు. తరువాత అమ్మవారి ప్రసాదముగా శ్రీధరపండితునికి నలువురు కుమారులు జన్మించినారని, తరువాత శ్రీధరపండితుడు తన శేష జీవితాన్ని అమ్మవారి సేవలో గడిపినాడని ఒక స్థానిక కథ.<ref>https://www.maavaishnodevi.org/discovery_of_the_shrine.aspx</ref>
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/వైష్ణవ_దేవి_ఆలయం" నుండి వెలికితీశారు