కొత్తపల్లి జయశంకర్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → , ( → ( (2) using AWB
పంక్తి 65:
మీరు చేయాల్సింది మీరు చేశారు. ఈ సమయంలో నేను ఇక్కడ ఇక ఉండలేను. నేను వరంగల్‌కే పోతాను. నన్ను పంపండి’ అంటూ ఆయన పుట్టిన గడ్డమీద మమకారంతో వారం రోజుల క్రితం ఇక్కడికి వచ్చారు. ఇంట్లోనే వైద్యులు ఆయనకు అన్నిరకాల వైద్యసేవలు అందించారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఆయన పల్స్‌రేట్ పడిపోవడంతో ఆక్సిజన్ అందించారు.
 
మా వనరులు మాకున్నాయి. మా వనరులపై మాకు అధికారం కావాలి. యాచక దశ నుంచి శాసక దశకు తెలంగాణ రావాలి! మా తెలంగాణ మాగ్గావాలి..!! యాభై ఏళ్లుగా ఇదే ఆకాంక్ష.. ఇదే శ్వాస.. ఇదే లక్ష్యం.. ఇదే జీవితం.. ఇందులోనే మరణం! ఉద్యమాన్ని శ్వాసించిన మహోపాధ్యాయుడు ప్రొఫెసర్ కొత్త పల్లి జయశంకర్ రెండేళ్లుగా గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్న ప్రొఫెసర్.. 21.-6.-2011 మంగళవారం ఉదయం 11.30 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు.
 
==సంతాపం==
పంక్తి 73:
తరతరాలుగా తెలంగాణకు సీమాంధ్ర పాలకులు, మీడియా చేస్తున్న అన్యాయాలు, అక్రమాల గురించి గంటల తరబడి వివరించే సత్తా, సాధికారత ప్రొఫెసర్ జయశంకర్ సొంతం. నీళ్లు, ఉపాధి, విద్య, సంస్కృతి…ఇలా ఏ అంశాన్ని తీసుకున్నా అందులో తెలంగాణకు జరిగిన నష్టాన్ని ఆయన బాధాతప్త హృదయంతో చెబుతారు. మీడియా వక్రీకరణలు, ట్యాంక్‌బండ్ సంఘటన, జాయింట్ క్యాపిటల్, తెలంగాణ సాహిత్యం, సామాజిక న్యాయాలపై ప్రారంభసంచికలో ముచ్చటించిన ప్రొఫెసర్ సాబ్ జీవితంలో ‘సిటీకాలేజ్’ సంఘటనకూ ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇక మన భాషను, యాసను ఎగతాళి చేసిన సీమాంవూధులను ఎండగడుతూనే… భవిష్యత్ తెలంగాణను గొప్పగా ఊహిస్తున్నారు. ఆ సంగతులు ఆయన మాటల్లోనే…
1952లో విశాలాంవూధకు వ్యతిరేకంగా పోరాటం మొదలయ్యింది. నేనప్పుడు వరంగల్‌లో ఇంటర్ చదువుతున్నా. 1948-52 ప్రాంతంలో ఉద్యోగాల కోసం వలస వచ్చారు. తెలంగాణలో ఇంగ్లీషు రాదు… కమ్యూనిస్టు భావాలు చాలా ఉంటాయని కేంద్రం ఆంధ్ర ఉద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చింది. ఇక్కడికొచ్చిన వాళ్లు మనల్ని బాగా ఎక్కిరించేవాళ్లు. అయ్యదేవర కాళేశ్వరరావు అనే ఆయనను పిలిపించి వరంగల్‌లో ఉపన్యాసం పెట్టించారు. ఆయన మనల్ని బాగా వెక్కిరిస్తే.. మేం ప్రతిఘటించినం. కలెక్టర్లు, పోలీసులు కూడా వాళ్లే కాబట్టి లాఠీచార్జీ జరిపించారు. అప్పుడు నేను కూడా లాఠీదెబ్బలు తిన్నా. అప్పటికే తెలంగాణ ఎన్టీవోస్, టీచర్లు ఆంధ్రోళ్ల వల్ల అవమానాలకు గురవుతూ.. హైదరాబాదు‌లో ఓ సమావేశం ఏర్పాటు చేశారు. వరంగల్ నుంచి నేను కూడా బయలుదేరినా.. మా బస్సు భువనగిరిలో ఫెయిలయ్యింది. ఈలోపు అఫ్జల్‌గంజ్‌లో కాల్పులు జరిగి 7గురు విద్యార్థులు చనిపోయారు. ఒకవేళ ఆ సమయానికి నేను కూడా అక్కడికి చేరుంటే.... అమరవీరుల జాబితాలో చేరే వాణ్ణి. ఆ అదృష్టం నాకు దక్కలేదు. బతికి ఏం చేశానయ్యా అంటే.. ఈ ఘోరాలన్నీ చూడాల్సి వచ్చింది.
భాషను.. యాసను ఎగతాళి చేశారు…చేశారు.
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/కొత్తపల్లి_జయశంకర్" నుండి వెలికితీశారు