కరాటంపాడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 95:
 
== గార్లపాటి ఫౌండేషన్ ట్రస్టు ==
ఈ గ్రామానికి చెందిన శ్రీ గార్లపాటి వేణుగోపాలనాయుడు, తనశ్రీ గార్లపాటి భాస్కర నాయుడు, శ్రీ గార్లపాటి సుబ్బారావు గార్ల తండ్రి పేరుపై, ఈ ట్రస్టు ఏర్పాటుచేసి, తద్వారా పలు సేవాకార్యక్రమాలు చేపట్టుచున్నారు. 2003 వేసవిలో గ్రామానికి మంచినీటి ఎద్దడి తలెత్తినప్పుడు, మంచినీటి ట్యాంకర్ల ద్వారా ఉచిత మంచినీటి సరఫరా చేశారు. 2005లో గిరిజనులకు పక్కా ఇళ్ళనిర్మాణానికి ఒక్కో ఇంటికీ, 5 వేల రూపాయలు వితరణ చేశారు. గ్రామంలోని ఉన్నత పాఠశాలకు వీరు 4 గదులు నిర్మించి ఇవ్వగా, ప్రభుత్వం వారు మరో 4 గదులు మంజూరు చేశారు. దానితో పాఠశాలకు ఇప్పుడు, కార్పొరేటు స్థాయిలో భవనవసతి అందుబాటులోనికి వచ్చింది. వీరు ఉర్దూ పాఠశాల అభివృద్ధికి ప్రహరీ గోడ నిర్మించి ఇచ్చారు. ఉన్నత పాఠశాల విద్యార్ధులకు ప్రతియేటా 2 జతల సమదుస్తులు, పది నోటు పుస్తకాలూ ఉచితంగా అందిస్తున్నారు. ప్రతిభగల విద్యార్ధులకు ప్రోత్సాహక బహుమతులిస్తున్నారు. చుట్టుప్రక్కల గ్రామాలవారి వైద్యసేవల కొరకు, ఒక సంచార వైద్యశాల వాహనాన్నీ ఒక డాక్టరునూ మందులతో సహా ఏర్పాటుచేశారు. వికలాంగులకు రెండు సార్లు శిబిరాలు ఏర్పాటుచేసి, వీల్ ఛైర్లు, ట్రైసికిల్సు, కృత్రిమ అవయవాలు, వినికిడి యంత్రాలు, చేతికర్రలు అందించినారు. [1]
 
==గ్రామ భౌగోళికం==
*విస్తీర్ణం 1102 హెక్టారులు
"https://te.wikipedia.org/wiki/కరాటంపాడు" నుండి వెలికితీశారు